Breaking News

డెయిలీ క్విజ్ 1: అరిథమెటిక్స్

daily-quiz-in-telugu-quantitative-aptitude-1-telugumaterial.in

1) 2000 సంఖ్యకి ఏ అతి చిన్న సంఖ్యను కలిపినచో వచ్చు సంఖ్య 19 చేత నిశ్శేషముగా భాగించబడును?
(1) 14
(2) 5
(3) 1
(4) 3




2) ఒక డ్వాక్రా వనిత 60 సెం.మీ, 35 సెం.మీ మరియు 22 సెం.మీలు ఉన్న మైనముతో కొవ్వొత్తులు చెయ్యాలనుకొన్నది, 7 సెం.మీల వ్యాసము మరియు 4 సెం.మీల ఎత్తుతో తయారు చెయ్యగలిగిన స్ధూపాకారపు కొవ్వొత్తుల సంఖ్య (π = 22/7 అని తీసుకోండి)
(1) 75
(2) 150
(3) 300
(4) 400




3) ఈ క్రింది సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య కనుగొనుము
√5 - √3, √7 - √5, √9 - √7, √11 - √9
(1) √5 - √3
(2) √7 - √5
(3) √9 - √7
(4) √11 - √9




4) 5 గంటలు ఒకేసారి మ్రోగడం మొదలు పెట్టాయి. ఈ గంటలు వరుసగా 6, 5, 7, 10 మరియు 12 సెకండ్ల కొక్కసారి మ్రోగును. మొదటిసారి మ్రోగినది లెక్కపెట్టకుండా ఉంటే, ఒక గంట సమయంలో అవి అన్నీ ఎన్నిసార్లు కలిసి మ్రోగును?
(1) 7
(2) 8
(3) 9
(4) 10




5) పాలు, నీళ్ళు కలిసిన 40 లీటర్ల మిశ్రమంలో నీరు 5%. నీటి శాతం 10% అయ్యెట్లు ఇంకొన్ని నీళ్ళు ఈ మిశ్రమానికి కలపాలంటే, కలపవలసిన నీటి పరిమాణం (లీటర్లలో)
(1) 5 1/9
(2) 3 1/3
(3) 2 2/9
(4) 6 1/9




6) 162 మరియు 172 మధ్య పరిపూర్ణ వర్గములు కాని పూర్ణాంకాల సంఖ్య
(1) 32
(2) 33
(3) 34
(4) 28




7) కొంత సొమ్ముపై సాలుకు 10% చొప్పున రెండు సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య భేదం రూ. 631. ఆ మొత్తం సొమ్ము
(1) రూ. 63,000
(2) రూ. 63,100
(3) రూ. 63,500
(4) రూ. 63,600




8) అసలు రూ. 80,000/- లపై సాలుకి 10% చక్రవడ్డీ రేటుతో రూ. 16,800 వడ్డీ వచ్చేట్లు ఒక బ్యాంకులో ఉంచితే ఆ అసలును బ్యాంకులో ఉంచిన కాలపరింతి
(1) 1½ సంవత్సరాలు
(2) 2 సంవత్సరాలు
(3) 2½ సంవత్సరాలు
(4) 3 సంవత్సరాలు




9) ఒక వ్యక్తి రూ. 50,000 ను 8% సాధారణ వడ్డీకి 2 సంవత్సరాలకి రుణంగా ఇచ్చాడు మరియు మరో రూ. 50,000 లను అదే రేటున సాలుసరి చక్రవడ్డీతో 2 సంవత్సరాలకి ఇచ్చాడు. రెండేళ్ళ తరువాత అతనికి తిరిగి వచ్చే మొత్తాలలో భేదం
(1) 300
(2) 320
(3) 360
(4) 380




10) క్రింది వానిని జతపరచండి:
కొంత సొమ్మును సాధారణ వడ్డీకి అప్పివ్వడమైనది. ఆ మొత్తం రెట్టింపు అవడానికి
వడ్డీ శాతం
(i) 16 3/2 %
(ii) 20%
(iii) 8%




సంవత్సరముల సంఖ్య
(a) 12½
(b) 6
(c) 5
     (i) (ii) (iii)
(1) (a) (b) (c)
(2) (c) (b) (a)
(3) (a) (c) (b)
(4) (b) (c) (a)




జవాబులు:
1. (1)
2. (3)
3. (1)
4. (2)
5. (3)
6. (1)
7. (2)
8. (2)
9. (2)
10. (4)

No comments