ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్విజ్ 05-జనవరి-2019
Q1. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
a) జనవరి 1న
b) జనవరి 2న
c) జనవరి 3న
d) జనవరి 4న
Q2. సౌబ్యాగ్య పథకం కింద ఈస్ట్ సియాంగ్ జిల్లా 100 శాతం విద్యుదీకరణ సాధించింది. ఈ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది?
a) అస్సాం
b) అరుణాచల్ ప్రదేశ్
c) పశ్చిమ బెంగాల్
d) సిక్కిం
Q3. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జనవరి 3న కొత్త ఆహార ప్యాకేజింగ్ నిబంధనలను నోటిఫై చేసింది. ఆహార రంగ వ్యాపారాలు కొత్త నిబంధనలకు అనుగుణంగా కట్టుబడి ఉండటానికి ఇచ్చిన గడువు తేదీ ?
a) 2019 మే 1
b) 2019 జూన్ 1
c) 2019 జూలై 1
d) 2019 ఆగస్టు 1
Q4. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మరియు సాంకేతిక సంస్థల విద్యార్థులకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేయడానికి ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది?
a) పంజాబ్
b) హర్యానా
c) గుజరాత్
d) ఢిల్లీ
Q5. భారతదేశపు అత్యంత వేగవంతమైన ‘ట్రైన్ 18’ ను మొదటగా ఏ రెండు నగరాల మధ్య ప్రారంభించనున్నారు?
a) న్యూఢిల్లీ - భోపాల్
b) న్యూఢిల్లీ - వారణాసి
c) న్యూఢిల్లీ - అలహాబాద్
d) న్యూఢిల్లీ - పాట్నా
Q6. ఏ దేశానికి చెందిన జాతీయులకు ‘వీసా ఆన్ అరైవల్’ సదుపాయాన్ని పాకిస్థాన్ ఇటీవల రద్దు చేసింది?
a) రష్యా
b) యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా
c) భారతదేశం
d) ఆఫ్ఘనిస్తాన్
Q7. 2019 జనవరి 4న ఏ రాష్ట్రంలోని దోలతీబీ బారేజ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం గుర్తుగా ప్రధాని మోదీ ఒక స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు?
a) మేఘాలయ
b) నాగాలాండ్
c) అస్సాం
d) మణిపూర్
Q8. ఈ క్రింది బిల్లులలో 2018 జనవరి 3న పార్లమెంటు ఆమోదించిన బిల్లును గుర్తించండి?
a) ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల రక్షణ) బిల్లు, 2018
b) ఉచిత మరియు నిర్బంధ విద్య బాలల హక్కు (సవరణ) బిల్లు, 2018
c) ది ఆధార్ అండ్ అదర్ లాస్ (సవరణ) బిల్లు, 2018
d) ది అల్లైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషన్స్ బిల్, 2018
Q9. ఏ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆత్మహత్యల సమస్యలను పరిశీలించడానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఒక టాస్క్ ఫోర్ట్ను ఏర్పాటు చేసింది?
a) కేంద్రీయ విద్యాలయాలు
b) కస్తూరిబాయి గాంధీ బాలీక విద్యాలయాలు
c) ఇండియన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్
d) జవహర్ నవోదయ విద్యాలయాలు
Q10. ‘ఐసిసి మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైన వ్యక్తి ఎవరు?
a) స్మ్రితి మంథాన
b) పూనమ్ యాదవ్
c) మిథాలి రాజ్
d) హర్మన్‌ప్రీత్ కౌర్
Q11. ఆంధ్రప్రదేశ్‌లోని ఎగువ పెన్నార్ ఎత్తిపోతల పథకానికి ఎవరి పేరును ఖరారు చేసారు?
a) ఎన్.టీ.రామారావు
b) వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి
c) ఇందిరాగాంధీ
d) పరిటాల రవీంద్ర
Q12. ‘బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాటర్ రీసోర్స్ ప్రాజెక్ట్స్’ విభాగంలో ప్రతిష్టాత్మక సీబీఐపీ అవార్డును దక్కించుకున్నది ఎవరు?
a) గుజరాత్ నీటి పారుదల శాఖ
b) కర్ణాటక నీటి పారుదల శాఖ
c) ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ
d) ఒడిశా నీటి పారుదల శాఖ
Q13. తూర్పుతీరంలో జీఎంఆర్ సంస్థ నిర్మించనున్న నౌకాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 4న శంకుస్థాపన చేసారు. అయితే ఈ నౌకాశ్రయం ఎక్కడ నిర్మిస్తున్నారు?
a) క్రిష్ణపట్నం
b) మచిలీపట్నం
c) కాకినాడ
d) కాళీపట్నం
Q14. ‘నిక్కీ సుపీరియర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అవార్డు-2018’ దక్కించుకున్న పరికరం ఏది?
a) హోండా వారి ఎన్-బాక్స్ (N-Box by Honda)
b) పాలా వారి వ్రింకిల్ షాట్ సెరమ్ (Wrinkle Shot Serum by Pola)
c) రిలయన్స్ వారి జియో ఫోన్ (Jio)
d) యస్కావా ఎలక్ట్రిక్ వారి మోటోమినీ (MotoMini by Yaskawa Electric)
Q15. ‘టై హైదరాబాద్’ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు?
a) శ్రీధర్ పిన్నపురెడ్డి
b) సురేష్ రెడ్డి
c) కాళీ ప్రసాద్ గాదిరాజు
d) వినోద్ కుమార్
Q16. ఇటీవల ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ ను రూపొందించిన దేశం ఏది ?
a) రష్యా
b) చైనా
c) భారత్
d) జర్మనీ
Q17. ఈ క్రింది వాటిల్లో ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్’ (సీబీఐపీ) ఏటా అందించే ఎక్స్‌లెన్స్ అవార్డు దక్కించుకున్న పథకం ఏది?
a) మిషన్ కాకతీయ
b) పోలవరం ప్రాజెక్టు
c) కాళేశ్వరం ప్రాజెక్టు
d) నిజాం సాగర్ ప్రాజెక్టు
Q18. ఈ క్రింది వాటిల్లో ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్’ (సీబీఐపీ) ఏటా అందించే ఎక్స్‌లెన్స్ అవార్డు దక్కించుకున్న పథకం ఏది?
a) పోలవరం ప్రాజెక్టు
b) ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ మిషన్ కార్పోరేషన్
c) హంద్రీ-నీవా సుజల ప్రాజెక్టు
d) వెలిగొండ ప్రాజెక్టు
Answers & Explanations:
1. d: బ్రెయిలీ లిపి సృష్టి కర్త అయిన లూయిస్ బ్రెయిలీ జన్మదినమైన జనవరి 4ని ఏటా ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటారు. లూయిస్ బ్రెయిలీ 1809 జనవరి 4న ఫ్రాన్స్‌లో జన్మించారు. చిన్నతనంలో జరిగిన ఓ చిన్న గాయం వలన కంటి చూపు కోల్పోయాడు. కానీ, అతను త్వరగా తన నూతన జీవన విధానాన్ని నేర్చుకున్నాడు. 15 సంవత్సరాల వయస్సులో చార్లెస్ బార్బియర్ రూపొంధించిన రాత్రి రచన వ్యవస్థ ఆధారంగా అతను చదివే మరియు వ్రాసే వ్యవస్థను సృష్టించాడు. మొదటిసారిగా 1824లో తన తోటి విద్యార్థులకు ఈ వ్యవస్థను అందించాడు. 1932లో అధికారికంగా ఇంగ్లీష్‌లో 'బ్రెయిలీ కోడ్'ను రూపొందించారు.
2. b: అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈస్ట్ సియాంగ్ జిల్లా ప్రధాన మంత్రి సహజ్ బిజలీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య పథకం) క్రింద 100 శాతం విద్యుదీకరణను సాధించింది. రాష్ట్రంలో డిసెంబరు 2017 చివరి వరకు విద్యుత్ కనెక్షన్‌లేని 2,662 గృహాలకు పాసిఘాట్ ఎలక్ట్రికల్ డివిజన్ విద్య్తుత్ సరఫరాను అందించింది.
3. c: ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు వార్తా పత్రికలే కాదు పునర్వినియోగ ప్లాస్టిక్ కూడా 2019 జూలై 1 నుంచి వినియోగించకూడదని ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSAI) ఆదేశించింది. వార్తా పత్రికల తయారీకి వినియోగించే ఇంక్‌లు, డైల వల్ల క్యాన్సర్ సంభవించే ప్రమాదం ఉన్నందున, వీటిల్లో ఆహార పదార్థాలను ప్యాక్ చేసి ఇవ్వకూడదని తెలిపింది. అసంఘటిత రంగంలో ఈ నిబంధనలు అమలు చేయడం కష్టమేనని, అందుకే ప్రజల్లో తగిన అవగాహన కల్పించేందుకు 2019 జూలై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.
4. a: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మరియు సాంకేతిక సంస్థల విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ పంపిణీ చేయడానికి పంజాబ్ కేబినెట్ ఆమోదించింది. అయితే, విద్యార్థులు తమ దగ్గరే ఇప్పటికే స్మార్ట్ఫోన్ను కలిగి లేరని స్వీయ ధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుంది.
5. b: దేశంలో అత్యంత వేగవంతమైన రైలు ‘ట్రైన్ 18’ ఢిల్లీ- వారణాసిల మధ్య త్వరలో ప్రారంభమవనుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఈ రెండు నగరాల మధ్య నడపనున్న ఈ రైలు ఇరు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని 11 గంటల 30 నిమిషాల నుండి 8 గంటలకు తగ్గించనుంది.
6. d:2019 జనవరి 3న పాకిస్థాన్ రక్షణ కారణాలను చూపుతూ ఆఫ్ఘనిస్థాన్ జాతీయులకు ‘వీసా ఆన్ అరైవల్’ సదుపాయాన్ని పాకిస్థాన్ రద్దు చేసింది.
7. d: జనవరి 4న ప్రధాని మోదీ మణిపూర్‌లో వివిధ ప్రాజెక్టులను (మోరె వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్, దోలతీబీ బారేజ్ ప్రాజెక్టు, సావోంబంగ్ వద్ద ఎఫ్‌సీఐ ఫుడ్ స్టోరేజ్ గోడౌన్, తంగల్ సురంగ్ వద్ద ఎకో టూరిజం కాంప్లెక్స్ మరియు ఇతర నీటి సరఫరా పథకాలు) ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాలకు గుర్తుగా ఒక స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు.
8. b: 2018 జనవరి 3న ఇండియన్ పార్లమెంటు, బాలల హక్కు మరియు నిర్బంధ విద్య (సవరణ) బిల్లు, 2018 ని ఆమోదించింది. దీని ద్వారా పాఠశాలల్లో ఇప్పటివరకు ఉన్న నో-డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏ విద్యార్థిని కూడా 8వ తరగతి వరకు డిటెన్షన్ (అదే తరగతిలో ఆపుట) చేయకూడదు. ఈ కొత్త సవరణ ద్వారా విద్యార్థులను డిటెన్షన్ చేసే అధికారం ఆయా రాష్ట్రాలకు అప్పగించారు.
9. d: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (MHRD) జవహర్ నవోదయ విద్యాలయాల్లోని విద్యార్ధుల ఆత్మహత్య సమస్యలను పరిశీలించడానికి సైకియాట్రిస్ట్, డాక్టర్ జితేంద్ర నాగ్పాల్ నేతృత్వంలో డిసెంబరు 31న ఒక టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటుచేసింది. జవహర్ నవోదయ విద్యాలయలాల్లోని వసతి గృహాలలోని విద్యార్థుల ఆత్మహత్యలకు, మరణాలకు దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటుచేసారు.
10. a: స్మ్రితి మంథాన 2018కి గాను ‘ఐసిసి మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’, ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’, ఓడీఐ (ODI) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులతోపాటు ఐసీసీ మహిళల జట్టులో స్థానం దక్కించుకుంది.
11. d: ఎగువ పెన్నార్ ఎత్తిపోతల పథకానికి పరిటాల రవీంద్ర నీటిపారుదల పథకంగా పేరును ఖరారు చేస్తూ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. జీడిపల్లి జలాశయం నుండి ఎగువ పెన్నార్ ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసేలా ఒక పథకం రూపకల్పన చేసి టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టారు.
12. c: ‘బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాటర్ రీసోర్స్ ప్రాజెక్ట్స్’ విభాగంలో పోలవరం ప్రాజెక్టు ఉత్తమ ప్రణాళిక, నిర్మాణానికిగానూ ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ ప్రతిష్టాత్మక సీబీఐపీ అవార్డును దక్కించుకున్నది.
13. c: తూర్పుతీరంలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద గల కోన గ్రామంలో జీఎంఆర్ కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్ నిర్మించనున్న నౌకాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 4న శంకుస్థాపన చేసారు. డీబీఎఫ్‌ఓటీ (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో ఈ నౌకాశ్రయ నిర్మాణానికి జీఎంఆర్ గ్రూపు సంస్థ అయిన కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్ గతేడాది నవంబరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కాకినాడ సెజ్‌కు చెందిన 1811 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించాలని ప్రతిపాదించారు. సముద్రానికి అభిముఖంగా ఉన్న 133 ఎకరాల స్థలాన్ని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. దీని నిర్మాణ వ్యయం రూ. 3000 కోట్లు.
14. c:ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఆవిష్కరించిన చౌక ఫీచర్ ఫోన్ ‘జియోఫోన్’కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. రూ. 49కే అపరిమిత కాల్స్‌తో పాటు అపరిమిత డేటా వినియోగించుకునే వీలున్న ఈ ఫోన్‌కు ‘నిక్కీ సుపీరియర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అవార్డు-2018’ లభించింది. మెరుగైన వినూత్న ఉత్పత్తులు, సేవలతో పాటు భవిష్యత్తు తరాలకు అవసరమైన సాంకేతికతలను అందించే యత్నాలకు ఈ అవార్డు లభించినట్లు నిక్కీ తెలిపింది.
15. b: ‘టై హైదరాబాద్’ ఛాప్టర్ నూతన అధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన బ్రైట్‌కాం గ్రూపు సీఎండీ సురేష్ రెడ్డి ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కంట్రోల్ ఎస్ సీఎండీ శ్రీధర్ పిన్నపురెడ్డి వ్యవహరిస్తారు. అంకుర సంస్థలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలను ‘టై హైదరాబాద్’ చేపడుతుంది.
16. b: ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ (ఎంవోఏబీ) పేరుతో అమెరికా రూపొందించిన శక్తిమంతమైన అణ్వస్త్రేతర ఆయుధానికి పోటీగా చైనా కూడా ఒక భారీ బాంబును రూపొందించింది. విమానం నుంచి ప్రయోగించే ఈ ఆయుధాన్ని ఆ దేశ రక్షణ సంస్థ ‘నారిన్‌కో’ తాజాగా ప్రదర్శించింది. విధ్వంసక శక్తి విషయంలో అణ్వస్త్రాల తర్వాతి స్థానం ఈ ఎంవోఏబీలదే. దీని అసలు పేరు ‘మ్యాసివ్ ఆర్డ్‌నెన్స్ ఎయిర్ బ్లాస్ట్’ (ఎంవోఏబీ). మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌గా ఇది ప్రాచుర్యం పొందింది.
17. a: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు జాతీయ స్థాయిలో పురస్కారం దక్కింది. జలవనరులు, విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరుల నిర్వహణలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ (సీబీఐపీ) ఏటా అందించే ఎక్స్‌లెన్స్ అవార్డు మిషన్ కాకతీయకు దక్కింది.
18. b: విద్యుత్తు నిర్వహణలో విశేష కృషి చేసిన వారికి ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్’ (సీబీఐపీ) ఏటా అందించే ఎక్స్‌లెన్స్ అవార్డు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ మిషన్ కార్పోరేషన్‌కు దక్కింది. ఈ అవార్డును ట్రాన్స్‌కో మేనేజింగ్ డైరెక్టర్ పరుచూరి దినేశ్ అందుకున్నారు.

No comments