Breaking News

కళ్యాణలక్ష్మి పథకం

kalyana-laxmi-scheme-telugumaterial.in

ప్రారంభించిన వారు: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు

ప్రారంభించిన తేదీ: 2015 అక్టోబరు 2న

అర్హతలు: పెళ్ళి నాటికి ఆడపిల్ల వయసు 18సంవత్సరాలు పూర్తయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2లక్షలు మించకూడదు.

ముఖ్య ఉద్దేశం: పేద కుటుంబాల్లోని యువతులకు భరోసా కల్పించేందుకు, ఆడ పిల్లల కన్నీరు తుడిచి వారి తలపై అక్షింతలు చెల్లేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 అక్టోబరు 2న కళ్యాణ లక్ష్మి పధకాన్ని ప్రారంభించింది.

  • ప్రారంభంలో రూ. 51,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ తర్వాత ప్రజల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు సామాజిక వర్గాల నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తింపజేశారు.
  • ఈ పథకంను 2016 ఏప్రిల్ 21 నుండి తెలంగాణలోని బీసీ, ఈబీసీలకు కూడా వర్తింపజేశారు.
  • ఈ పథకం ప్రయోజనం మరింత పెంచే ఉద్దేశ్యంతో 2017 ఏప్రిల్ 1 నుండి ఈ పథకం ద్వారా అందించే మొత్తాన్ని 75,116కి పెంచారు.
  • మరియు 2018 ఏప్రిల్ 1 నుండి ఈ పథకం ద్వారా అందించే మొత్తాన్ని 1,00,116కి పెంచారు.
  • ఈ పథకం ద్వారామార్చి 2018 నాటికి 3,60,000 మందికి లబ్ది చేకూరిందని ప్రభుత్వం తెలిపింది.
  • కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు 2018-19 తెలంగాణ బడ్జెట్‌లో రూ. 1450 కోట్లు కేటాయించారు.


ఫలితాలు:
  • ఈ పథకంలో ఆడపిల్ల కనీస పెళ్ళి వయసు 18సంవత్సరాలుగా ఉండడతో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి.
  • కళ్యాణ లక్ష్మి పథకం సహాయం అందుకున్న వివాహాలకు ప్రభుత్వ గుర్తింపుతో పాటు చట్టబధ్ధత కూడా లభిస్తున్నది.



మరిన్ని వివరాలు:

పెళ్లయిన తర్వాత 1-3 నెలల్లో లబ్ది దారులకు ఈ మొత్తం అందుతోంది. అయితే, సత్వరం సాయం అందితే తమకెంతో ఉపశమనంగా ఉంటుందని పలువురు తల్లిదండ్రులు, వధువుల నుండి అభ్యర్ధనలు వచ్చిన నేపధ్యంలో పెళ్లి రోజే సాయం అందించాలని నిర్ణయించారు. పెళ్లి ముగిసిన క్షణమే, మండపాల వద్దే ఈ చెక్కులను నవ వధువులకు అందజేయనున్నారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానుంది. ఏటా రూ. వెయ్యి కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పధకాలను మరింత ప్రయోజనకరంగా సమర్ధంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం దరఖాస్తులు, లబ్దిదారులపై రెవెన్యూ యంత్రాంగంతో విచారణ చేయించి శాసన సభ్యుల ద్వారా వారికి చెక్కులను అందజేస్తున్నారు. ఇకపై వివాహపత్రిక, ఇతరత్రా ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకుంటే వెంటనే విచారణ చేయించి, జాబితాను ఎమ్మెల్యేలకు పంపిస్తారు. వారి ఆమోదంతో నిధులను మంజూరు చేస్తారు. తహసీల్దారు / సంక్షేమ శాఖల ద్వారా చెక్కులను సిద్ధం చేసి...... పెళ్లి రోజే స్ధానిక కార్యదర్శులు, వీఆర్వోల ద్వారా వాటిని వధువులకు పంపిణీ చేస్తారు.

No comments