డెయిలీ క్విజ్ 13: హిస్టరీ
Q1. ఫాక్లాండ్స్ యుద్దంలో కింది వాటిలో ఏ దేశాలు పోరాడాయి?
A: అర్జెంటీనా
B: ఆస్ట్రేలియా
C: ఫ్రాన్స్
D: జర్మనీ
E: యూనైటెడ్ కింగ్‌డమ్
సరియైన జవాబును ఎంపిక చేయంది:
a) A మరియు E మాత్రమే
b) A, B మరియు D మాత్రమే
c) C, D మరియు E మాత్రమే
d) B మరియు D మాత్రమే
Q2. యంగ్ ఇటలీ ఉద్యమానికి ఇద్దరు విప్లవకారులు సారధ్యం వహించారు? అందులో ఒకరు గారిబాల్డి కాగా మరో విప్లవకారుడు ఎవరు?
a) విక్టర్
b) నెపోలియన్ బోనపార్టే
c) గుసెప్పె మాజిని
d) మాకియవెల్లి
Q3. 1789-90 ఫ్రెంచి విప్లవానికి సంబంధించి కింది వివరణలలో (వ్యాఖ్యలలో) సరియైనవి ఏవి?
A: నిరంకుశ పాలనపై ప్రజాస్వామ్య గెలుపుకు సంకేతం.
B: భూస్వామ్య వ్యవస్ధపై పెట్టుబడిదారీ వ్యవస్ధ గెలుపుకు సంకేతం.
C: యూరప్‌లలో పరస్పర రక్షణ కూటముల పెరుగుదలకు దోహదం.
సరియైన జవాబును ఎంపిక చేయండి.
a) A, B మరియు C
b) A మరియు B మాత్రమే
c) B మరియు C మాత్రమే
d) A మరియు C మాత్రమే
Q4. డిసెంబరు1991 లో సోవియట్ యూనియన్ కూలిపోవడానికి కింది వాటిలో ఏవి కారణభూతమయ్యాయి?
A: ఆర్దిక వ్యవస్ధ స్తంభించటం.
B: గ్లాసునోస్తు విధానాల కారణంగా పోటీతత్వ రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లా అవతరించడం.
C: సైనిక వ్యవస్ధ అత్యధిక దృష్టి పెట్టటం.
D: జాతులు విడిపోవడం.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A మరియు D మాత్రమే
b) A, B మరియు C మాత్రమే
c) B, C మరియు D మాత్రమే
d) A, C మరియు D మాత్రమే
Q5. ‘బ్రెక్సిట్’ కి సంబంధించి కింది వ్యాఖ్యలలో ఏవి సరియైనవి?
A: బ్రెక్సిట్ రెఫరెండం మే 23, 2016 నాడు నిర్వహించబడింది.
B: యూరోపియన్ యూనియన్ నుండి వైదొలగడానికి యునైటెడ్ కింగ్‌డం సాధారణ మెజారిటీ ఓటుతో నిర్ణయం తీసుకుంది.
C: యునైటెడ్ కింగ్‌డం సమయం ప్రకారం మార్చి 29, 2019 నాడు రాత్రి 11 గంటలకు వైదొలగబోతుంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B మరియు C
b) A మరియుB మాత్రమే
c) A మరియు C మాత్రమే
d) B మరియు C మాత్రమే
Q6. కింది వివరణలను పరిశీలించండి:
A: బౌద్ద గ్రంధాలు ఇక్ష్వాకులని శ్రీరాముని సంతతి అని వివరించాయి.
B: పేరణి నృత్య భంగిమలు గల దేవాలయం రామప్ప.
C: రుద్రదేవుడి మిలటరీ విజయాల్ని ‘వేయి స్తంభాల’ గుడి శాసనం తెలియజేస్తుంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A మరియు C మాత్రమే
b) A, B మరియుC
c) A మరియు B మాత్రమే
d) B మరియు C మాత్రమే
Q7. కింది వివరణలను పరిశీలించండి:
A: కల్నల్ టాడ్ ’రాజస్ధాన్ ఆనల్స్’ అనే తన గ్రంధంలో రాజపుత్రులను విదేశీయులుగా పేర్కొన్నాడు.
B: ‘పృధ్వీరాజ్ రాసో’ అనే గ్రంధాన్ని సి. వి. వైద్య రచించాడు.
C: మిహిర భోజుడు ప్రతీహార వంశానికి చెందినవాడు.
D: మొహమ్మద్ ఘోరీ దాడులను చండీల రాజు విద్యాధరుడు ఎదురించలేదు.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) D మాత్రమే
b) A మరియు B మాత్రమే
c) A మరియు C మాత్రమే
d) B, C మరియు D మాత్రమే
Q8. మగధ నేలిన కింది చక్రవర్తులను వారి పాలనా కాలాన్ననుసరించి సరైన క్రమంలో అమర్చండి:
A: బిందుసారుడు
B: బింబిసారుడు
C: అశోకుడు
D: అజాత శత్రువు
సరియైన క్రమాన్ని/జవాబును ఎంపిక చేయండి:
a) D, C, B, A
b) A, C, D, B
c) B, A, D, C
d) B, D, A, C
Q9. ‘అబుల్ హసన్ తానీషా’ కు ఆ పేరు పెట్టిన సూఫీ మత గురువు పేరేమిటి?
a) అహ్మద్ పటేల్
b) షిరాజుద్దీన్
c) మొయీనుద్దిన్ చిష్తీ
d) షారాజు ఖత్తాల్
Q10. కింది వివరణలను పరిశీలించండి:
A: బెనారస్‌లో ‘ఇండియన్ అసోసియేషన్’ స్ధాపించబడింది.
B: ‘డక్కా అనుశీలన్ సమితి’ ని 2009లో నెలకొల్పారు.
C: దాదాబాయి నౌరోజీచే ‘ఈస్ట్-ఇండియా అసోసియేషన్’ ఏర్పాటు చేయబడింది.
D: క్రీ.శ. 1782లో సల్‌బాయ్ సంధి జరిగింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, C మరియుD మాత్రమే
b) A మరియు B మాత్రమే
c) B మరియు C మాత్రమే
d) C మరియు D మాత్రమే
Answers:
1. జవాబు: a
2. జవాబు:c
3. జవాబు:b
4. జవాబు:b
5. జవాబు:d
6. జవాబు:b
7. జవాబు:b
8. జవాబు:d
9. జవాబు:d
10. జవాబు:d

No comments