డెయిలీ క్విజ్ 37: ఇండియన్ పాలిటీ
Q1. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమర్పించిన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది?
a) నవంబర్ 26, 1949
b) జనవరి 26, 1949
c) జనవరి 26, 1950
d) నవంబర్ 26, 1950
Q2. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేది ఏది?
a) నవంబర్ 26, 1949
b) జనవరి 26, 1949
C) జనవరి 26, 1950
d) నవంబర్ 26, 1950
Q3. డిసెంబర్ 2016 లో భారత ప్రధాన న్యాయస్ధానం తన తీర్పులో భారత వైమానిక దళంవారు జారీచేసిన ఒక ఉత్తర్వును సమర్ధించింది. ఈ ఉత్తర్వు ప్రకారం భారత వైమానిక దళంలో పనిచేసే సిబ్బంది గడ్డమును పెంచరాదు. దీనికి సంబంధించిన సరియైన వ్యాఖ్యలను (వివరణలను) ఎంపిక చేయండి :
a: భారత రాజ్యంగంలోని 33వ ఆర్టికల్ ద్వారా భారత ప్రభుత్వానికి వైమానిక దళంలో పనిచేసే వారి విషయంలో అవసరమైన యెడల ప్రాధమిక హక్కుల విషయంలో తగిన నిబంధనలు విధించవచ్చు.
b: ఈ నిబంధనలకు మతపరమైన విశ్వాసానికి సంబంధం లేదు.
c: దీని విషయమై ఒక భారత వైమానిక దళ సిబ్బంది భారత ప్రధాన న్యాయస్ధానానికి ఫిర్యాదు చేసారు.
d: దీనిపై ప్రధాన న్యాయస్ధానం, భారత వైమానిక దళ అధికారులు ఇచ్చిన గడ్డమును పెంచరాదన్న ఉత్తర్వును సమర్ధించింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a, b, c, d
b) b, c, d మాత్రమే
c) a, b మాత్రమే
d) c, d మాత్రమే
Q4. జాతీయ సమగ్రతకు సంబంధించిన కింది అంశాలను పరిశీలించండి :
a: ‘మనం భారతదేశ ప్రజలందరం’ తో భారత రాజ్యాంగ ప్రవేశిక (ప్రియాంబుల్) మొదలవుతుంది.
b: భారత రాజ్యాంగపు నిర్దేశిక (ఆదేశిక) సూత్రాలు అందరికీ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కల్పించే దిశగా చర్యలను తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశిస్తాయి.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a మరియు b రెండూ సరియైనవి
b) a మరియు b రెండూ సరియైనవి కావు
c) a మాత్రమే
d) b మాత్రమే సరియైనది
Q5. పార్లమెంట్ చట్టంలు చేస్తుంది. దీనికి సంబంధించి కింది అంశాలను పరిశీలించండి :
a: ఆర్ధిక బిల్లుతో సహా అన్ని బిల్లులన, ఉభయ సభలలో ఏ సభలో అయినా ప్రవేశ పెట్టవచ్చు.
b: పార్లమెంట్ సభ్యులందరికీ వారి వారి సభలలో బిల్లులను ప్రవేశపెట్టే అధికారం ఉంటుంది.
c: బిల్లును మంత్రి కాని, ప్రైవేట్ సభ్యుడు కాని ప్రవేశ పెట్టవచ్చు.
d: ప్రవేశపెట్టడానికి ముందే అధికారిక గజెట్‌లో ప్రచురించిన బిల్లును సభలో పెట్టడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a, b మరియు c మాత్రమే
b) b, c మరియు d మాత్రమే
c) a, b మరియు d మాత్రమే
d) a, c మరియు d మాత్రమే
Q6. ‘షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అమానిష నివారణ) సవరణ చట్టం’ 2015 గురించి కింది అంశాలను పరిశీలించండి :
a: అక్టోబర్ 2, 2015 నుండి ఈ చట్టం అమలులోకి వచ్చింది.
b: SC మరియు ST సభ్యులకు వ్యతిరేకంగా జరిగే నేరాలకు సంబంధించిన కేసులను వేగవంతంగా విచారణ జరపడానికి గాను ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి.
c: గిరిజన ప్రజలు మతపరమైన, ఆరోగ్యపరమైన మరియు విద్యాపరమైన సంస్ధలను ఉపయోగించుకోకుండా నివారించడం కూడా చట్టప్రకారం శిక్షర్హం.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a, b మరియు c
b) a మరియు b మాత్రమే
c) b మరియు c మాత్రమే
d) a మరియు c మాత్రమే
Q7. రాష్ట్రానికి చెందిన బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తే, రాష్ట్రపతి అధికారానికి సంబంధించి కింది వివరణలను పరిశీలించండి :
a: రాష్ట్రపతి ఆ బిల్లుపై సంతకం చేయవచ్చు.
b: రాష్ట్రశాసన సభకు పున:పరిశీలన కొరకు రాష్ట్రపతి తిప్పి పంపవచ్చు.
c: రాష్ట్రపతి సూచనకు అనుగుణంగా రాష్ట్ర శాసన సభ 6 నెలల లోపు పున:పరిశీలించాలి.
d: సవరణలతో గాని లేదా సవరణలు లేకుండా గాని రెండవసారి రాష్ట్ర శాసన సభ ఆమోదిస్తే, రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేయాలి.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a, b మరియు c మాత్రమే
b) a, b మరియు d మాత్రమే
c) b, c మరియు d మాత్రమే
d) a మరియు c మాత్రమే
Q8. ప్రాధమిక విధులకు సంబంధించి కింది అంశాలను పరిశీలించండి :
a: ఆర్టికల్ 51 ప్రాధమిక విధ్యులను తెలుపుతుంది
b: 1976 సం.పు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాధమిక విధులను పొందిపరచారు.
c: ‘రిట్స్’ద్వారా ప్రాధమిక విధులను అమలు చేయలేం.
d: రాజ్యాంగ పద్ధతులలో ప్రాధమిక విధులను పాటించేలా చేయలేం.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a మరియు b మాత్రమే
b) b మరియు c మాత్రమే
c) a మరియు c మాత్రమే
d) a, b మరియు c
Q9. భారత రాజ్యాంగంలోని కింది అధికరణలకు సంబంధించిన అంశాలను పరిశీలించండి :
a: భారత రాజ్యాంగంలోని 245 అధికరణం పార్లమెంటు మరియు రాష్ట్ర శాసన సభలు రాజ్యాంగ నిబంధనలకు లోబడి పనిచేయాలని చెప్పుతుంది.
b: నేర విచారణలో భాగంగా ధ్వని నమూనా ఇవ్వాలని ఒక నిందితున్ని ఆదేశిస్తే 20(1) అధికరణం ప్రకారం ఆ దేశంన వ్యక్తి స్వేచ్ఛను ఉల్లంఘించినట్లు కాదు.
సరియైన జవాబునుఎంపిక చేయండి:
a) a మరియు b రెండూ సరియైనవి
b) a మరియు b రెండూ సరియైనవి కావు
c) a మాత్రమే సరియైనది
d) b మాత్రమే సరియైనది
Q10. భారత సుప్రీం కోర్టు పర్యావరణంనకు రాజ్యాంగ భాష్యం చెప్పిన కింది వివరణలను పరిశీలించండి.
a: ‘నిరపేక్ష బాధ్యత’ సూత్రం ఓలియమ్ లీకేజి వాజ్యంలో చెప్పబడింది.
b: ‘సుస్ధిరమైన అభివృద్ధి’ భావన రూరల్ లిటిగేషన్ అండ్ ఎంటైటిల్‌మెంట్ కేంద్ర, దెహ్రడూన్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్ వాజ్యంలో ప్రవేశపెట్టబడింది.
c: ‘కాలుష్యకారుడు భరించాలి’ సూత్రంను ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరో లీగల్ యాక్షన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా వాజ్యంలో ఆమోదింపబడింది.
d: చలనచిత్ర ప్రదర్శన శాలలో పర్యావరణం పై ఉచితంగా స్లై యిడ్లను ప్రదర్శించాలని ఎమ్. సి. మెహత Vs యూనియన్ ఆఫ్ ఇండియా 1991 వాజ్యంలో ఉత్తర్వు ఇవ్వబడింది.
సరియైన జవాబును ఎంపిక చేయుము:
a) a, b మరియు c మాత్రము
b) b మరియు d మాత్రమే
c) a మరియు c మాత్రమే
d) a, b, c మరియు d
Answers:
1. జవాబు: a
2. జవాబు: c
3. జవాబు: a
4. జవాబు: c
5. జవాబు: b
6. జవాబు: c
7. జవాబు: a
8. జవాబు: b
9. జవాబు: c
10. జవాబు: d

No comments