డెయిలీ క్విజ్ 14: తెలంగాణ హిస్టరీ
Q1. కింది వాటిని వరుసక్రంలో అమర్చండి:
A: ఎనిమిది సూత్రాల పధకం
B: ముల్కి రూల్స్‌పై సుప్రీం కోర్టు తీర్పు
C: ఆర్టికల్ 371-డికు 32వ రాజ్యాంగ సవరణ
D: ఆరు సూత్రాల పధకం
సరియైన క్రమంను/జవాబును ఎంపిక చేయండి:
a) B, C, A, D
b) A, C, D, B
c) A, B, D, C
d) D, A, C, B
Q2. 1946-48 సంవత్సరాల్లో వెనుకబడిన తాలూకాలైన కిన్వట్, బోత్ మరియు సిర్పూర్ అదిలాబాద్ జిల్లాలో, హుజూరాబాద్ కరీంనగర్ జిల్లాలో, బూర్గంపహాడ్ వరంగల్ జిల్లాలో, బీద రైతులు ఆరుగురు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను చంపేందుకు ఒక సెకండ్ తాలూక్టార్‌ను ఆరుగురు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను శారీరక హింసకు గురిచేసేందుకు పూనుకోవడానికి బలీయమైన కారణం ఏమిటి?
a) కౌలుదార్లను భూముల నుండి తరచుగా, సులభంగా తొలగించడం.
b) యుద్ద నిధి వసూళ్లు
c) లెవీ ధాన్యాన్ని బలవంతంగా, అన్యాయంగా, అక్రమంగా వసూలు చేయడం.
d) హెచ్చు రేట్లో భూమిశిస్తు.
Q3. నిజాం ప్రభుత్వ ఉద్యోగులుగా కింది వారిలో ఎవరున్నారు?
A: మాడపాటి హనుమంతరావు
B: శ్రీరంగం శ్రీనివాసరావు
C: రాయప్రోలు సుబ్బారావు
D: దాశరధి కృష్ణమాచార్య
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B, C మరియుD
b) A, B మరియు C మాత్రమే
c) B, C మరియు D మాత్రమే
d) A మరియు D మాత్రమే
Q4. కింది వివరణలను పరిశీలించండి:
A: నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన గిరిజన నాయకుడు భీమ్‌జీ గోండ్.
B: ‘జల్-జంగల్-జమీన్’ అను నినాదాన్ని కుమురం భీమ్ ఇచ్చాడు.
C: అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ప్రాంతంలో భీమ్‌జి గోండ్ నాయకత్వంలో గోండులు తిరుగుబాటు చేశారు.
సరియైనవి కాని వివరణ(ల)ను ఎంపిక చేయండి:
a) A, B మరియు C
b) A మరియు C మాత్రమే
c) A మరియు B మాత్రమే
d) C మాత్రమే
Q5. కింది వివరణలను పరిశీలించండి:
A: ముల్కి లీగ్ దక్కన్ జాతీయ వాదాన్ని ప్రచారం చేసింది.
B: హైదరాబాద్, ఇండియాల ఐక్య భాషగా హిందూస్ధానీని ముల్కీ లీగ్ అభిలషించింది.
C: హైదరాబాదీలను తప్పుదోవ పట్టించేందుకు బ్రిటీష్ వారు మతతత్వాన్ని సృష్టించారని ముల్కి లీగ్ భావింకింది.
D: ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనాన్ని ముల్కి లీగ్ కోరింది.
సరియైనవి కాని వివరణ(ల)ను ఎంపిక చేయండి:
a) A, B మరియు C మాత్రమే
b) A మరియు B మాత్రమే
c) C మరియు D మాత్రమే
d) D మాత్రమే
Q6. కింది వివరణలను పరిశీలించండి:
A: 1921లో ఆంధ్ర జన కేంద్ర సంఘ స్ధాపన, అది 1930లో ఆంధ్ర మహాసభగా అభివృద్ది చెందడం, నిజాం రాజ్యంలో ప్రజా చైతన్యం, జాగృతికి గట్టి పునాదులేర్పరచాయి.
B: తెలంగాణ ప్రజాలలో 80 శాతం మంది తమ మాతృ భాష తెలుగులో, అలాగే మరట్వాడలో మరాఠి మరియు కన్నడ భాషల్లో అంటే ప్రజల భాషలలో కార్యకలాపాలు నిర్వహించడం మరియు ప్రజల అభిప్రాయాలను రేకెత్తించడానికి సరైన, సమర్ధవంతమైన వేదికను అందించింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) B మాత్రమే సరియైనది
b) A మరియు B రెండూ సరియైనవి కావు
c) A మరియు B రెండూ సరియైనవి
d) A మాత్రమే సరియైనది
Q7. కింది వాటిని జతపరచండి:
పుస్తకం
A: గాధే సప్తసధి
B: పండితారాధ్య చరిత్ర
C: బృహత్ కధ
D: యాది
రచయిత
1: గుణాడ్యుడు
2: హలుడు
3: సామల సదాశివ
4: పాల్కురికి సోమనాధుడు
5: పాల్కురికి శ్రీనాధుడు
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:
a) A-5, B-1, C-2, D-3
b) A-2, B-5, C-3, D-1
c) A-2, B-4, C-1, D-3
d) A-4, B-3, C-1, D-2
Q8. తెలుగు మీడియాపై శ్రీకృష్ణ కమిటీ పరిశీలన కింది వాటిలో దేనిని తెలియజేసింది?
a) తెలుగు ప్రసార మాధ్యమాల యాజమాన్యం మరియు శీర్షికలు రాసేవారు ఆంధ్ర వారు
b) ఒక రెండు చానళ్లలో వాటాలు గలవారు తప్ప మిగిలిన వార్తపత్రికలు సీమాంధ్ర ప్రజల వద్దే ఉన్నాయి.
c) తెలంగాణ గురించి చెప్పడంలో తెలుగు ప్రసార మాధ్యమాలు నిస్పాక్షికంగా ఉన్నాయి.
d) తెలుగు ప్రసార మాధ్యమాల యాజమాన్యం మరియు శీర్షికలు రాసేవారు తెలంగాణ వారు.
Q9. ‘ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా’ కధా సంకలనాన్ని ఎవరు వెలువరించారు?
a) కె. వి. నరేంద్రర్
b) పులుగు శ్రీనివాస్
c) పసునూరు రవీంద్ర
d) కాసుల ప్రతాప రెడ్డి
Q10. అఖిల భారత మహిళా సమావేశం (AIWC) గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి:
A: ఈ కాన్ఫరెన్స్ పూనాలో జనవరి 1927లో ఆవిర్బవించింది.
B: కలకత్తాలోని బెధునె కాలేజీ(Bethune College)లో పాఠాలు చెప్పే ఎ.ఎల్. హ్యుడెకోపర్ దీనిని స్ధాపించారు.
C: మహిళా విద్యాభివృద్ధికి పాటుపడటానికి ఇది కృషి చేస్తుంది.
D: 1932లో మహిళల కోసం హూమ్ సైన్స్ విద్యా పరిశోధన మరియు అధ్యాపకుల శిక్షణ కోసం లేడీ ఇర్విన్ కాలేజీ అనే మహిళా కాలేజీని ఈ సంస్ధ 1932లో ఢిల్లీలో ఏర్పాటు చేసింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) C మరియు D మాత్రమే
b) A, B మరియు C మాత్రమే
c) B మరియు D మాత్రమే
d) A, C మరియు D మాత్రమే
Answers:
1. జవాబు: c
2. జవాబు: c
3. జవాబు: d
4. జవాబు: b
5. జవాబు: d
6. జవాబు: c
7. జవాబు: c
8. జవాబు: a
9. జవాబు: c
10. జవాబు: d

No comments