Breaking News

డెయిలీ క్విజ్ 15: తెలంగాణ హిస్టరీ

daily-quiz-in-telugu-telangana-history-15-telugumaterial.in

Q1. సాలార్‌జంగ్ సంస్కరణలకు పూర్వం నిజాం పాలనలో 1853 వరకు తాలూకాదారులు వసూలు చేసే శిస్తులో ఎంత భాగం వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం అనుమతించింది?
a) భూమి శిస్తులో 1/4వ వంతు
b) భూమి శిస్తులో 1/6వ వంతు
c) భూమి శిస్తులో1/5వ వంతు
d) భూమి శిస్తులో1/8వ వంతు




Q2. హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా కోసం మొట్టమొదటి ఆధారమైన ఉస్మాన్ సాగర్‌ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
a) 1924
b) 1918
c) 1920
d) 1937




Q3. కింది వాటిని జతపరచండి:
సంస్ధ
A: భావ సమైక్యత ప్రజా సంఘటన
B: తెలంగాణ ప్రజా సమితి
C: రిపబ్లికన్ పార్టీ
D: తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం




అధ్యక్షులు
1: అచ్యుత రెడ్డి
2: శ్రీమతి ఈశ్వరీబాయి
3: టి.మదన్ మోహన్
4: రామానంద తీర్ధ
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:
a) A-4, B-2, C-1, D-3
b) A-1, B-2, C-3, D-4
c) A-4, B-3, C-2, D-1
d) A-1, B-3, C-2, D-4




Q4. అడవి బాపిరాజు గారి ‘గోన గన్నా రెడ్డి’ నవల అంకితం గైకొన్న జమిందారు ఎవరు?
a) సూర్యా రావు భూపతి – గద్వాల
b) నాయని వెంకట రంగారావు బహుద్దూర్ – నడిగూడెం
c) అక్కినేపల్లి జానకి రామారావు – పాల్వంచ
d) జన్నా రెడ్డి ప్రతాప రెడ్డి – సూర్యాపేట




Q5. కింది వారిలో సులేమాన్ అనే అరబ్ పర్యాటకుడి చేత అతి గొప్ప సామ్రాజ్యాధిపతిగా కీర్తించబడిన రాష్ట్రకూట పాలకుడు ఎవరు?
a) అమోఘ వర్ష
b) దంతి దుర్గ
c) క్రిష్ణ - 1
d) గోవింద -3




Q6. కింది వాటిని జతపరచండి:
సంఘం
A: ఖమ్మంలో అన్నబత్తుల రవీంద్రనాధ్ యొక్క అమరణ నిరాహార దీక్ష
B: పాల్వంచలో పోతు కృష్ణమూర్తి యొక్క అమరణ నిరాహార దీక్ష
C: హైదరాబాద్ రెడ్డి హాస్టల్‌లో జరిగిన తెలంగాణ హాస్టల్‌లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్
D: తెలంగాణప్రజా సమితి యొక్క ఆవిర్భావం




తేది
1: 10-1-1969
2: 8-1-1969
3: 25-3-1969
4: 8-3-1969
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:
a) A-2, B-1, C-3, D-4
b) A-2, B-1, C-4, D-3
c) A-3, B-4, C-1, D-2
d) A-1, B-2, C-3, D-4




Q7. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ జాక్) ఆధ్వర్యంలో జరిగిన కింది ఉద్యమాలను వరుసక్రమంలోఅమర్చండి:
A: ‘వాక్ ఫర్ తెలంగాణ’
B: ‘పల్లె పల్లె పట్టాల పైకి’
C: ‘సాగర హారం’
D: ‘సకల జనుల సమ్మె’ ప్రారంభం
సరియైన క్రమంను/జవాబును ఎంపిక చేయండి:
a) C, B, D, A
b) A, B, C, D
c) A, B, D, C
d) B, A, C, D




Q8. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును అధ్యయనం చేయడానికి కేంద్ర హోంమంత్రి ద్వారా ఏర్పాటు చేయబడిన అన్నిపార్టీల సమావేశంను బహిష్కరించిన పార్టీలు ఏవి?
a) బి. జె. పి., టి.ఆర్. ఎస్., టి.డి.పి., ఎ.ఐ.ఎం.ఐ.ఎం., సి.పి.ఐ. మరియు సి.పి.ఐ(ఎం)
b) బి.జె.పి. మరియు టి.ఆర్.ఎస్.
c) బి.జె.పి., టి.డి.పి. మరియు టి.ఆర్.ఎస్.
d) బి.జె.పి., టి.డి.పి., టి.ఆర్.ఎస్. మరియు ఎ.ఐ.ఎం.ఐ.ఎం.




Q9. విశాఖపట్నంకు చెందిన పి. వెంకట నారాయణ అను అడ్వకేటు ‘సకల జనుల సమ్మే’ ఆపాలని హైకోర్టులో ఒక పిటీషన్ వేశాడు ఇందులో ఆయన ఎవరిని ప్రతివాదులుగా చేర్చాడు?
A: కె. చంద్రశేఖర్ రావు
B: కోదండ రామ్
C: మల్లెపల్లి లక్ష్మయ్య
D: స్వామిగౌడ్
E: శ్రీనివాస గౌడ్
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) C, D మరియు E మాత్రమే
b) A, B మరియు D మాత్రమే
c) C మరియు E మాత్రమే
d) A, B మరియు C మాత్రమే




Q10. కింది వాటిని జతపరచండి:




వ్యక్తి
A: ఎ.డి.గోర్‌వాల
B: సుందర్ లాల్
C: కె.ఎం. ఫణిక్కర్
D: జె. చొక్కారావు




సంస్ధ
1: తెలంగాణ ప్రాంతీయ సంఘం
2: రాష్ట్రాల పునర్ వ్యవస్ధీకరణ కమిషన్
3: కమిటీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ రీ ఆర్గనైజేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎకానమి
4: ఎక్సెస్ ఆఫ్ మిలటరీ ఇన్ హైదరాబాద్
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:
a) A-4, B-1, C-2, D-3
b) A-1, B-2, C-3, D-4
c) A-4, B-3, C-2, D-1
d) A-3, B-4, C-2, D-1




Answers:
1. జవాబు: d
2. జవాబు: c
3. జవాబు: c
4. జవాబు: c
5. జవాబు: a
6. జవాబు: b
7. జవాబు: c
8. జవాబు: b
9. జవాబు: b
10. జవాబు: d

No comments