Breaking News

డెయిలీ క్విజ్ 27: ఎకానమీ

daily-quiz-in-telugu-Economy-27-telugumaterial.in

Q1. ‘గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2018’లో 180 దేశాలలో భారతదేశపు ర్యాంకు 177 గా గుర్తించారు. దీనికి సంబంధించిన సరియైన వివరణలను గుర్తించండి :
a: ఈ సూచీని ‘డౌన్ టు ఎర్త్’ మ్యాగజీన్ (Down to Earth)  విడుదల చేసింది.
b: దీనిని ‘స్టేట్ ఆఫ్ ఇండియా’స్ ఎన్విరాన్‌మెంట్’ 2018 సంకలనం చేసింది.
c: ‘స్టేట్ ఆఫ్ ఇండియా’స్ ఎన్విరాన్‌మెంట్’ అనేక అంశాలను, గాలి కాలుష్యం నుండి పర్యావరణ క్రైమ్ వరకు భిన్న అంశాలను పరిశీలిస్తుంది.
d: ఈ సూచీలో మొదటి అయిదు స్ధానాల్లో అంటే గ్రీన్ ర్యాంకింగ్ పొందిన దేశాలు ఏవంటే స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, డెన్‌మార్క్, మాల్టా, స్వీడన్.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a, b, c, d
b) a, b, c
c) b, c, d
d) a, d




Q2. GST కి సంబంధించిన కింది వాటిలో సరైనవి ఏవి?
a: GST ని అమ్మకం జరిగే ప్రదేశంలో వసూలు చేస్తారు.
b: GST భారతదేశంలోని అన్ని ప్రత్యక్ష పన్నులను రద్దు చేస్తుంది.
c: GST జూలై 1, 2017 నుండి అమల్లోకి వచ్చింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a మరియు b మాత్రమే
b) a మరియు c మాత్రమె
c) b మరియు c మాత్రమే
d) a, b మరియు c




Q3. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంచే ప్రకటించబడిన స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2018 ర్యాంకింగ్స్ లో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ మరియు కరీంనగర్ నగరాలకు (ఒక లక్ష జనాభా మించిన నగరాల విభాగంలో) ఏ ర్యాంకింగులు వచ్చాయి?
a) వరుసగా 22, 49 మరియు 76
b) వరుసగా 27, 31 మరియు 73
c) వరుసగా 38, 47 మరియు 85
d) వరుసగా 27, 38 మరియు 77




Q4. ఉదయపూర్‌లోని జవార్ గనులు వీటికి ప్రసిద్ధి :
a) బంగారం
b) అభ్రకం
c) బొగ్గు
d) జింకు




Q5. భారతదేశంలో చెరుకు ఉత్పత్తిలో ప్రధమ మరియు ద్వితీయ స్ధానాలలో నున్న రాష్ట్రాలు :
a) ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర
b) ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్ర
c) మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్
d) మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్




Q6. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రాలు :
a) తమిళనాడు మరియు పంజాబ్
b) కేరళ మరియు పంజాబ్
c) కేరళ మరియు గోవా
d) కేరళ మరియు మిజోరాం




Q7. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక పట్టణ జనాభా శాతం గల రాష్ట్రాలు, అవరోహణ క్రమంలో :
a) తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్
b) తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్
c) మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్
d) మహారాష్ట్ర తమిళనాడు, పంజాబ్




Q8.కింది వాటిలో ఏ బాధ్యతలు ఆర్ధిక సంఘం పరిధిలోనికి వస్తాయి?
a: పన్నుల నికర ఆదాయాన్ని కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పంపకం.
b: కేంద్రం రాష్ట్రాలకు అందించే సహాయాలకు సంబంధించిన నియమాలను సిఫారసు చేయడం.
c: రాష్ట్రపతి సూచనలకు అనుగుణంగా బలమైన ఫైనాన్స్ రూపొందించడానికి అవసరమైన సిఫారస్‌లు చేయడం.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a మాత్రమే
b) b మాత్రమే
c) b మరియు c మాత్రమే
d) a, b మరియు c




Q9. ‘పునర్నిర్మాణం మరియు అభివృద్ధి కోసం యూరోపియన్ బ్యాంకు’ (EBRD) గురించి కింది వివరణలను (అంశాలను) పరిశీలించండి :
a: బెర్లిన్ గోడ (వాల్) పతనం తర్వాత ఈ బ్యాంకు 1991 లో ఏర్పాటు చేయబడింది.
b: బ్యాంకు ప్రధాన కార్యాలయం బెర్లిన్ లో ఉంది.
c: బ్యాంకు యొక్క 69వ వాటాదారుగా భారతదేశం చేరింది.
d: బ్యాంకు లక్ష్యం ఎదుగుతున్న యూరోపాలో ప్రజా మౌలిక సదుపాయాల కల్పనను ప్రోత్సాహించడం.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a, b మరియు c మాత్రమే
b) a, b మరియు d మాత్రమే
c) b మరియు d మాత్రమే
d) a మరియు c మాత్రమే




Q10. భారతదేశంలో స్ధాపించబడిన నీతి (NITI) ఆయోగ్ కు సంబంధించిన కింది అంశాలను పరిశీలించండి :
a: విమర్శనాత్మక, దిశాత్మక, వ్యూహాత్మక మౌళిక సలహాలను అభివృద్ధి ప్రక్రియకు అందించడానికి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసారు.
b: భారతదేశంలో సహకార సమాఖ్య వ్యవస్ధను ప్రోత్సహించడానికి, బలపరచడానికి, రూపొందించడానికి ఇది తోడ్పడుతుంది.
c: భారతదేశానికి పంచవర్ష ప్రణాళికలను రూపొందిస్తుంది.
d: ఒప్పందాల ద్వారా పరిజ్ఞానాన్ని, నవకల్పనలను, వ్యవస్ధాపక మద్ధతును ఈ సంస్ధ కల్పిస్తుంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a, b మరియు మాత్రమే
b) a, bమరియు d మాత్రమే
c) b, c మరియు d మాత్రమే
d) a మరియు c మాత్రమే




Answers:




1. జవాబు: a
2. జవాబు: b
3. జవాబు: b
4. జవాబు: d
5. జవాబు: b
6. జవాబు: d
7. జవాబు: a
8. జవాబు: d
9. జవాబు: d
10. జవాబు: b

No comments