ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షలు 2 వారాలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షలను 2 వారాలు వాయిదా వేసున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.
- డీఎస్సీ ప్రకటనకు పరీక్షకు మధ్య సమయం తక్కువగా ఉన్నందున చదువుకునేందుకు సమయం కావాలంటూ అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
- మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
- కొత్త షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు.
- ఈ వాయిదా కారణంగా పరీక్షా కేంద్రాల ఐచ్ఛికాల సమయం సైతం మారనుంది.
- డీఎస్సీ అన్ని పోస్టులు కలిపి 7729 ఉండగా వీటికి 6,08,157 మంది దరఖాస్తు చేసుకున్నారు.

No comments