ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ 30-నవంబర్-2018
ఈ ఉదయం ప్రముఖ దినపత్రికలలో ప్రచురితమైన జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక మరియు బ్యాంకింగ్, సైన్స్ & టెక్నాలజీ (S&T), క్రీడలు, అవార్డులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మొదలైన అంశాల నుండి ప్రధాన కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మరియు ఇరు తెలుగు రాష్ట్రాలలో త్వరలో జరగనున్న అన్ని పోటీ పరీక్షల దృష్ట్యా వీటిని అంశాలవారీగా చేర్చడం జరిగింది.
జాతీయం
మరాఠాలకు 16శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన మహారాష్ట్ర శాసనసభ
- మహారాష్ట్రలోని మరాఠా సామాజిక వర్గానికి 16 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదిస్తూ నవంబర్ 29న ప్రవేశపెట్టిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
- సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విభాగం కింద మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించారు.
- ప్రభుత్వ ఉద్యోగాలు, ఎయిడెడ్, నాన్‌ఎయిడెడ్ విద్యాసంస్థల్లో అడ్మిషన్లలో ఇకపై 16 శాతం రిజర్వేషన్ మరాఠాలకు దక్కనుంది.
అంతర్జాతీయం
మూడూ రోజుల పర్యటన కొరకు అర్జెంటీనా చేరుకున్న ప్రధాని మోదీ
- మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమేదీ నవంబర్ 29న అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ఏర్స్‌కు చేరుకున్నారు.
- నవంబర్ 30 మరియు డిసెంబర్ 1 తేదీలలో జరగనున్న జీ-20 సదస్సుకు హాజరవుతారు.
సైన్స్ & టెక్నాలజీ (S&T)
31 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ43
- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నవంబర్ 29న శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి పోలార్ లాంచ వెహికల్ ద్వారా 31 ఉపగ్రహాలను ముందుగా నిర్ణయించిన మేరకు కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
- 380 కిలోల బరువున్న మన దేశ ఉప్రగ్రహంతో పాటు ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలను మూసుకెళ్ళింది.
- షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్ బయలుదేరాక 17.27 నిమిషాలకు మనదేశానికి చెందిన హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని 636 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో వదిలిపెట్టింది.
- రాకెట్‌లోని పీఎస్4 ఇంజిన్‌ను మరోమారు మండించి విదేశాలకు చెందిన ఉపగ్రహాలను 504 కిలోమీటర్ల ఎత్తులో ఒక్కొక్కటిగా కక్ష్యలో విడిచిపెట్టింది.
- హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం (హెచ్వైఎస్‌ఐస్)లో ఆప్టికల్ ఇమేజింగ్ డిటెక్టర్ ఆరె చిప్ ఉంటుంది. దీనిని ఇస్రో ప్రధాన విభాగమైన అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు రూపకల్పన చేసారు.
- దాని అనుబంధ సంస్థఉన్న చండీగడ్‌లోని సెమికండక్టర్ లేబొరేటరీ వారు తయారుచేసారు.
తెలంగాణ
నదుల పునరుజ్జీవ కమిటీ నియామకం
- తెలంగాణలో నదుల కాలుష్యం తగ్గించి, పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు అవసరమైన కార్యచరణ రూపొందించేందుకు ప్రభుత్వం నదుల పునరుజ్జీవ కమిటీని నియమించింది.
- ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
క్రీడలు
అతిచిన్న వయస్సులో జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన ఇషాసింగ్
- కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి ఇషాసింగ్ జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది.
- అతిచిన్న వయస్సులో (13 ఏళ్లకే) ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. మనుబాకర్ (16 ఏళ్లకు) పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది.
- పూణెలోని గగన్ నారంగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది.
- నవంబర్ 29న ఒక్కరోజే 7 పతకాలు సాధించింది. అందులో 4 స్వర్ణాలు, 2 రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి.
- మహిళల 10 మీటర్ల పిస్టల్, జూనియర్ మహిళల 10 మీ. పిస్టల్, యూత్ మహిళల 10 మీ. పిస్టల్, (సివిలియన్) విభాగాల్లో ఇషా స్వర్ణాలు సాధించింది.
- మహిళల 10 మీ. పిస్టల్ (సివిలియన్)లో రజతం సాధించింది.
వార్తల్లోని వ్యక్తులు
ఫోర్బ్స్‌లో చోటు సాధించిన మేఘన
- పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన బొల్లింపల్లి మేఘన నవంబర్‌లో ప్రచురించిన అమెరికన్ ‘ఫోర్బ్స్’ మేగజీన్‌లో అండర్-30 శాస్త్రవేత్త విభాగంలో చోటు దక్కించుకుంది.
- 2018లో నిర్వహించిన ఐసెఫ్ (ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్టు)ఇంటర్నేషనల్ అవార్డు సాధించినందుకు మేఘనను అత్యంత ప్రతిభాశాలిగా గుర్తించారు.
ఎపొలిటికల్ ప్రపంచ ప్రతిభావంత యువనేతల జాబితాలో లోకేశ్
- ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతమైన యువ నాయకుల సరసన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌కు స్థానం దక్కింది.
- ఎపొలిటికల్ సంస్థ 2018 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన జాబితాలో మొదటి 20 స్థానాల్లో నిలిచిన భారతీయుడిగా లోకేష్‌కు గుర్తింపు లభించింది.
- ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న వివిధ దేశాల్లోని 35 ఏళ్లలోపు యువ నాయకుల జాబితాను ఎపొలిటికల్ సంస్థ నవంబర్ 29న విడుదల చేసింది.

No comments