Breaking News

డెయిలీ క్విజ్ 34: వ్యాపార గణితం

daily-quiz-in-telugu-quantitative-aptitude-34-telugumaterial.in

Q1. ఒక చతురస్రం ప్రతి భుజం 25% తగ్గిస్తే, కొత్తగా ఏర్పడిన చతురస్ర వైశాల్యానికి, దత్త చతురస్ర వైశాల్యానికి గల నిష్పత్తి:
a) 16 :25
b) 4 :9
c) 9 : 16
d) 25 : 36




Q2. A, B, C లు విడివిడిగా ఒక పనిని వరుసగా 12,8,6 గంటలలో పూర్తి చేయగలరు. ముగ్గురు కలిసి రెండు గంటలు పని చేసిన తర్వాత C పని వదలి వెళ్లాడు. మిగిలిన ఇద్దరు కలిసి ఆ పని పూర్తి చేయటానికి పట్టిన సమయం (నిమిషాల్లో) :
a) 12
b) 24
c) 62
d) 72




Q3. కొంతమంది ప్రయాణికులతో ఒక రైలు బయలుదేరినది. మొదటి స్టేషనులో మూడింట ఒక వంతు ప్రయాణికులు దిగిపోగా 280 మంది ప్రయాణికులు రైలులోకి ప్రవేశించిరి. రెండో స్టేషనులో ప్రయాణికుల్లో సగం మంది దిగిపోగా 12 మంది లోనికి ప్రవేశించిరి. ఇప్పుడు రైలులోని ప్రయాణికుల సంఖ్య 248 అయితే ప్రారంభంలో రైలులో ఉన్న ప్రయాణికుల సంఖ్య:
a) 192
b) 288
c) 324
d) 376




Q4. 24 లో 16 2/3% ని s అని, 9లో 331/3%ని t అని, 25లో 20%ని u అని అనుకోండి. s, t, u లను భుజాల పొడవులుగా గల ఒక త్రిభుజంలో, పొడవు u గల భుజపు ఎదుటి కోణం:
a) 30°
b) 45°
c) 60°
d) 90°




Q5.

అయితే x యొక్క ఒక విలువ:

a) 6
b) 7
c) 8
d) 5




Q6. ప్రతి సంవత్సరమూ, 5% జనాభా పెరుగుదల నమోదైన ఒక గ్రామంలో 2013వ సంవత్సరాంత జనాభా 18,522. 2011 ప్రారంభం నాటి ఆ గ్రామ జనాభా:
a) 14,000
b) 15,400
c) 15,800
d) 16,000




Q7. ఒక వ్యక్తి అతని వద్ద ఉన్న సరుకులలో 3/4వ వంతు, 25% లాభమునకు అమ్మినాడు. మిగతా సరుకులను 17% లాభమునకు అమ్మినాడు. అప్పుడు అతనికి అమ్మకములో వచ్చిన లాభ శాతము:
a) 24%
b) 23%
c) 22%
d) 21%




Q8. ఈ క్రింది పటంలో ABCD ఒక దీర్ఘచతురస్రము, CDE ఒక అర్ధవృత్తం. దీర్ఘచతురస్రము పొడవు దాని వెడల్పు కంటె 7 యూనిట్లు అధికంగా ఉంటూ, 98 చదరపు యూనిట్ల వైశాల్యం కల్గి ఉంటే, అప్పుడు అర్ధవృత్తాకారం CDE ప్రాంత వైశాల్యం (చదరపు యూనిట్లలో)
a) 7
b) 49
c) 57
d) 77




Q9. ఒక అంకశ్రేణి యొక్క మొదటి పదం 5, చివరి పదం 60. ఆ పదాల మొత్తం విలువ 195 అయినచో పదాంతరం :
a) 11
b) 9
c) 7
d) 12




Q10. x = 0.3 then x2 =
a) 0.33
b) 0.9
c) 0.01
d) 0.1




Answers:
1. జవాబు: c
2. జవాబు: d
3. జవాబు: b
4. జవాబు: d
5. జవాబు: a
6. జవాబు: d
7. జవాబు: b
8. జవాబు: d
9. జవాబు: a
10. జవాబు: d

No comments