విద్యుత్తు ఉద్యోగుల విభజనపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు
తెలుగు రాష్ట్రాల విద్యుత్తు ఉద్యోగుల విభజనకు సంబంధించి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.
- జస్టిస్ ధర్మాధికారి సిఫార్సులను సుప్రీంకోర్టు ఆదేశాలుగా పరిగణించాలని రెండు తెలుగురాష్ట్రాల విద్యుత్తు కార్పోరేషన్లు, ఉద్యోగులకు సూచించింది.
- ఆరునెలల్లోగా విభజన ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
- కేసు కోర్టులో ఉన్నప్పటీకీ పరస్పర చర్చల ద్వారా పరిష్కారం చేసుకునే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
- ఆంధ్రప్రదేశ్‌కు ఎంత మంది ఉద్యోగులు, తెలంగాణకు ఎంత మంది ఉద్యోగులు అనేది జస్టిస్ ధర్మాధికారి కమిటీ చెబుతుందని, దాని ప్రకారం నడుచుకోవాలని ధర్మాసనం తెలిపింది.
- ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కమిటీకి చెప్పుకోవాలని సూచిస్తూ కేసు విచారణ ముగించింది.
- నేపథ్యం: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఏకపక్షంగా ఉద్యోగులను రిలీవ్ చేయడం న్యాయపరంగా సరికాదని ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ విద్యుత్తు కార్పొరేషన్లు, కొందరు ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయా పిటిషన్లపై నవంబర్ 28న జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

No comments