డెయిలీ క్విజ్ 35: తెలంగాణ హిస్టరీ
Q1. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్ధీకరణ చట్టం 2014’ ప్రకారం ఈ క్రింది ప్రవచనములలో ఏది/ఏవి సరిఅయినది/వి కాదు?
a: పోలవరం సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణిస్తారు.
b: ఆంధ్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాలకు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల వరకు ఉంటుంది.
c: రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నరు ఉంటారు.
d: ఒక సంవత్సరపు కాలం పాటు రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టు ఉంటుంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a మరియు b మాత్రమే
b) b మరియు c మాత్రమే
c) c మరియు d మాత్రమే
d) d మాత్రమే
Q2. తెలంగాణ నాయకులలో ఎవరు మొట్టమొదట “విశాలాంధ్రను” సూచించిరి?
a) గులామ్ రసూల్ ఖాన్
b) జె. వి. నరసింగ రావు
c) దేవులపల్లి రామానుజ రావు
d) కె. వి. రంగారెడ్డి
Q3. ఉస్మానియా మరియు కాకతీయ విద్యార్ధుల నాయకత్వంలో జరిగిన ఈ క్రింది ఉద్యమాలను కాలానుక్రమంలో అమర్చుము.
a: ‘తెలంగాణ విద్యార్ధి ఘర్జణ’
b: ‘ఛలో అసెంబ్లీ’
c: ‘తెలంగాణ విద్యార్ధి మహాగర్జణ’
d: కాకతీయ యూనివర్సిటి విద్యార్ధులచే నిర్వహించబడ్డ ‘విద్యార్ధుల పొలికేక’
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a, b, c, d
b) b, a, d, c
c) c, b, a, d
d) c, d, b, a
Q4. ప్రతిపాదన (A) : 1990 నుండి ప్రబలిన నూతన మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ యొక్క ఫలాల వల్ల ఆంధ్రప్రాంతంలోని పాలకవర్గం లాభపడింది.
కారణం (R) : అభివృద్ధి పేరుతో గల లోటుపాట్లన్నీ తెలంగాణ ప్రజలు భరించవలసి వచ్చింది.
సరియైన వివరన :
a) (A) మరియు (R) రెండూ నిజము, (R), (A) కు సరియైన వివరణ.
b) (A) మరియు (R) రెండూ నిజము, (R), (A) కు సరియైన వివరణ కాదు.
c) (A) నిజము కాని (R) తప్పు.
d) (A) తప్పు కాని (R) నిజము.
Q5. సరికాని జతను గుర్తించండి. :
a) తెలంగాణ అమరవీరుల దినం - 17 మే, 1969
b) తెలంగాణ నిరసన దినం - 2 జూన్,1969
c) తెలంగాణ వంచన దినం - 20 ఏప్రిల్, 1969
d) తెలంగాణ మహిళా దినం - 17 జూన్, 1969
Q6. జతపరుచుము:
(అ): తెలంగాణ పోరుయాత్ర
(ఆ) తెలంగాణ ప్రజాయాత్ర
(ఇ) తెలంగాణ విద్యార్థి రణభేరి
(ఈ) తెలంగాణ యుద్ధభేరి
(1) బి.జె.పి.
(2) సి.పి.ఐ.
(3) ఎ.బి.వి.పి.
(4)తెలంగాణ సంఘర్షణ సమితి
a) అ-1, ఆ-2, ఇ-4, ఈ-3
b) అ-1, ఆ-2, ఇ-3, ఈ-4
c) అ-2, ఆ-1, ఇ-3, ఈ-4
d) అ-4, ఆ-3, ఇ-2, ఈ-1
Q7. 1969లోని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం క్రింది ఏ సంస్థలోని ఉద్యోగ నియామక సమస్యతో ప్రారంభమయ్యింది?
a) కొత్తగూడెం థర్మల్ విద్యుత్ క్షేత్రము
b) సింగరేణి బొగ్గు గనులు
c) నిజాం చక్కర కర్మాగారము
d) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ
Q8. ఎవరిని ఓడించి కె. అచ్యుత రెడ్డి తెలంగాణ ప్రాంతీయ కమిటికి అధ్యక్షుడు అయినాడు?
a) బి. వి. గురుమూర్తి
b) మీర్ మహమ్మద్ అలీ ఖాన్
c) రావి నారాయణ రెడ్డి
d) బద్దం ఎల్లా రెడ్ది
Q9. 2002 సం.లో రాష్ట్ర ప్రభుత్వం జి. ఒ. నెం. 610 ను అమలు పరచిన తీరును పరిశీలించడానికై ఏర్పరచిన కమిషన్ పేరు :
a) జయభారత్ రెడ్డి కమిషన్
b) జె. ఎం. గిర్‌గ్లాని కమిషన్
c) కె. ఆర్. ఆమోస్ కమిషన్
d) పురుషోత్తమ కమిషన్
Q10. క్రింది వాటిని వరుసక్రమంలో పేరుచుము :
a: ‘తెలంగాణ ప్రజాఫ్రంట్’ ను గద్దర్ ఏర్పాటు చేశారు.
b: ‘తెలంగాణ ధూం ధాం’ మొట్టమొదటిసారిగా కామారెడ్డి లో నిర్వహించారు.
c: భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ జోడేఘట్ నుండి హైదరాబాద్ వరకు ‘తెలంగాణ పోరు యాత్రను’ చేపట్టారు.
d: భారతీయ జనతా పార్టీ హైదరాబాదు నుండి భద్రచలం వరకు ‘పోరుతెలంగాణ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) b, c, c, d
b) b, a, d, c
c) a, b, c, d
d) c, d, b, a
Answers:
1. జవాబు: d
2. జవాబు: c
3. జవాబు: d
4. జవాబు: b
5. జవాబు: c
6. జవాబు: b
7. జవాబు: a
8. జవాబు: c
9. జవాబు: b
10. జవాబు: a

No comments