Breaking News

డెయిలీ క్విజ్ 36: వ్యాపార గణితం

daily-quiz-in-telugu-quantitative-aptitude-36-telugumaterial.in


Q1. ఒక వృత్తము యొక్క వ్యాసము AB = 13మీ. ఒకడు A నుండి ఒక సరళరేఖపై ప్రయాణించి ప్రయాణించి వృత్తపరిధి పై C అనే బిందువును చేరుకొన్నాడు. AC = 5 మీ. అయితే CB =
a) 8 మీ.
b) 10 మీ.
c) 12 మీ.
d) 11 మీ.




Q2. ఒక చతురస్రం భుజంలో పెరుగుదల 21% అయినప్పుడు దాని వైశాల్యం పెరిగేది :
a) 42%
b) 44%
c) 46%
d) 46.41%




Q3. 30 మంది విద్యార్ధులు గల ఒక తరగతిలో, భౌతిక శాస్త్రం ప్రధానంగా గల 10 మంది విద్యార్ధులకు సరాసరి మార్కులు 72; రసాయన శాస్త్రం ప్రధానంగా గల 5గురు విద్యార్ధులకు సరాసరి మార్కులు 66; గణిత శాస్త్రం ప్రధానంగా గల 15 మంది విద్యార్ధుల సరాసరి మార్కులు 80. తరగతిలో అందరి విద్యార్ధుల సరాసరి మార్కులు:
a) 69
b) 70
c) 74
d) 75




Q4. B, C లు సమానంగా పెట్టుబడి పెట్టిరి; D పెట్టుబడి C పెట్టుబడికి సగం మరియు A పెట్టుబడికి రెట్టింపు; E పెట్టుబడి B పెట్టుబడికి రెండింతలు. సంవత్సరాంత లాభంలో రూ. 24,00,000 లను E తన వాటాగా పొందితే, మొత్తం లాభం (రూపాయిల్లో) :
a) 95,00,000
b) 54,00,000
c) 57,00,000
d) 76,00,000




Q5. కొంత సొమ్మును కొంత రేటున చక్రవడ్డీకి ఇవ్వబడింది. ఆ సొమ్ము 2వ సంవత్సరాంతానికి మరియు 3వ సంవత్సరాంతానికి వరుసగా రూ. 7,350, రూ. 8,575 గా అయింది. చక్రవడ్డీకి ఇచ్చిన సొమ్ము :
a) రూ. 5,000
b) రూ. 5,400
c) రూ. 6,000
d) రూ. 6,400




Q6. ఒక గది యొక్క పొడవు 5.2 మీటర్లు మరియు దాని వెడల్పు 2.0 మీటర్లు. ఈ గదిని ఖచ్చితంగా చతురస్ర పలకలతో పరచాలంటే కావలసిన పలకల సంఖ్య:
a) 96
b) 85
c) 75
d) 65




Q7. సరళరేఖ PQకి సమాంతర రేఖ AB. రేఖ PQ పై బిందువులు C, D లు; ΔABD వైశాల్యం ‘a’ చదరపు యూనిట్లు అయ్యేట్లుంటే అప్పుడు ΔABD వైశాల్యం (చదరపు యూనిట్లలో) :
a) a
b) a/2
c) a/3
d) a/4




Q8. ఒక ఖాళీ తొట్టిని A, B అనే పంపులు విడివిడిగా వరుసగా 8 గంటలు, 6 గంటలు సమయంలో నింపగా, C అనే పంపు నిండు తొట్టిని 12 గంటల్లో ఖాళీ చేస్తుంది. కొంత సమస్య వల్ల పంపు C ని మూసి వేయటం కుదర లేదు. A, B లను వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా ఒక గంట పాటు విప్పుతూ, ఈ పద్ధతిని A తో ప్రారంభిస్తే ఆ తొట్టి నిండటానికి పట్టే సమయం (గంటల్లో) :
a) 6
b) 8
c) 16
d) 24




Q9. ముగ్గురు వ్యక్తులు P, Q, R లు 1/3 ∶ 1/4 ∶ 1/5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టి ఒక కంపెనీని ప్రారంభించారు. మూడు నెలల తరువాత P తన పెట్టుబడిలో సగము తీసేసుకుంటాడు. ఇంకొక తొమ్మిది నెలల తరువాత వచ్చిన లాభము రూ. 3,16,000 ను పంచుకుంటారు. దానిలో Pకి వచ్చిన వాటా రూపాయిలలో)
a) 1,20,000
b) 1,00,000
c) 96,000
d) 90,000




Q10. 3 సెం. మీ. వ్యాసార్ధం గల ఒక వృత్తం ఒక చతురస్రంలోపల, దాని అన్ని భుజాలను స్పృశిస్తూ ఉంది. ఆ చతురస్ర వైశాల్యం (చ. సెం.మీ. లలో):
a) 9π
b) 9
c) 18
d) 36




Answers:




1. జవాబు: c
2. జవాబు: d
3. జవాబు: d
4. జవాబు: c
5. జవాబు: b
6. జవాబు: d
7. జవాబు: a
8. జవాబు: c
9. జవాబు: b
10. జవాబు: d

No comments