అంగారకుడిపై దిగిన ‘ఇన్‌సైట్’ రోవర్
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) పంపిన సరికొత్త ల్యాండర్ వ్యోమనౌక ‘ఇన్‌సైట్’ విజయవంతంగా అంగారకుడిపై కాలు మోపింది.
- ఆ గ్రహం మీదున్న గులాబీ రంగు వాతావరణాన్ని సూపర్‌సోనిక్ వేగంతో చీల్చుకుంటూ వెళ్లి, అక్కడి నేలపై క్షేమంగా కాలు మోపింది.
- ఇన్‌సైట్‌ను 2018 మే 5న కాలిఫోర్నియా నుంచి ప్రయోగించారు.
- ల్యాండింగ్ ప్రక్రియ 7 నిమిషాల్లో ముగిసింది.
- భూమి నుంచి పంపే సంకేతాలు 10 కోట్ల మైళ్లు ప్రయాణించి ఆ వ్యోమనౌకను చేరుకోవటానికి 7 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల ఈ దశను భూమి నుంచి నియంత్రించడం సాధ్యం కాదు. ఆ వ్యోమనౌకకే సొంతంగా చేపట్టేలా శాస్త్రవేత్తలు దీనిని తీర్చిదిద్దారు.
- నిర్దేశించిన రీతిలో అంగారకుడి మధ్యరేఖా ప్రాంతానికి సమీపంలోని చదునైన ‘ఎల్సియం ప్లానిషియా’లో దిగింది.
- ల్యాండింగ్ తర్వాత సౌర ఫలకాలు కూడా విజయవంతంగా విచ్చుకున్నాయి. దీనివల్ల బ్యాటరీల ఛార్జింగ్‌కు వీలు కలిగింది.
- తాను దిగిన ప్రాంతానికి సంబంధించిన ఫోటోలు కూడా పంపింది.
- అంగారకుడి అంతర్భాగాల్లోని అంతుచిక్కని అంశాలను వెలుగులోకి తీసుకురావడానికి అక్కడి ప్రకంపనలను అధ్యయనం చేస్తుంది. తద్వారా అంగారక గ్రహం ఆవిర్భావ తీరు తెలుస్తుంది.
- రెండు రోజుల తర్వాత దీనిలోని 1.8 మీటర్ల పొడవైన రోబోటిక్ హస్థాన్ని వినియోగంలోకి తెస్తారు. దానికి అమర్చిన కెమెరా సాయంతో ఫోటోలు తీయవచ్చు.
- ఆ తర్వాత రెండు మూడు నెలల్లో ప్రధాన పరికరాలైన ‘ద సైస్మిక్ ఎక్స్‌పరిమెంట్ ఫర్ ఇంటీయర్ స్ట్రక్చర్ (ఎస్‌ఈఐఎస్), హీట్ ఫ్లో అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ప్యాకేజ్ (హెచ్‌పీ3) వినియోగంలోని వస్తాయి.
- ఇన్‌సైట్ బరువు 365 కిలోలు.
- 99.3 కోట్ల డాలర్లతో దీనిని నిర్మించారు.
- ఇది ఒక్కచోటే స్థిరంగా ఉంటుంది.
- రెండేళ్లపాటు సేవలందిస్తుంది.
- 2012లో క్యూరియాసిటీ రోవర్ తర్వాత ఒక వ్యోమనౌక అంగారకుడిపై నాసా దించడం ఇదే మొదటిసారి.

No comments