ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్విజ్ 01-డిసెంబర్-2018
1. రాష్ట్రంలోని అన్ని అత్యవసర సేవలకు ఒకే నంబరు ‘112’ను ప్రారంభించిన తొలి భారతీయ రాష్ట్ర ఏది?
a) హిమాచల్ ప్రదేశ్
b) పశ్చిమ బెంగాల్
c) తమిళనాడు
d) ఉత్తరప్రదేశ్
2. 2018లో G20 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న దేశం ఏది?
a) ఆస్ట్రేలియా
b) అర్జెంటీనా
c) రష్యా
d) డెన్మార్క్
3. మొట్టమొదటి సస్టెయినబుల్ బ్లూ ఎకానమీ కాన్ఫరెన్స్ 2018 కి ఆతిథ్యమిచ్చిన నగరం ఏది?
a) న్యూఢిల్లీ
b) న్యూయార్క్
c) నైరోబీ
d) కేప్ టౌన్
4. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2018లో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డును పొందిన చిత్రం ఏది?
a) వాకింగ్ విత్ విండ్
b) ఈ మే యో
c) వెన్ ద ట్రీస్ ఫాల్
d) డాన్బాస్
5. ఇటీవల, ఏ దేశ పార్లమెంటు అధ్యక్ష ఎన్నికల వయో పరిమితిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని ఆమోదించింది?
a) మలేషియా
b) మాల్దీవులు
c) శ్రీలంక
d) ఇండోనేషియా
6. ఇటీవల, యునైటెడ్ కింగ్డమ్ బ్రెగ్జిట్ తర్వాత అమలయ్యే విమానయాన (పోస్ట్-బ్రెక్సిట్ ఏవియేషన్) ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకుంది?
a) యునైటెడ్ స్టేట్స్
b) ఫ్రాన్స్
c) జర్మనీ
d) జపాన్
7. రాజ్యాంగంలోని షెడ్యూల్ VIII ప్రకారం ఎన్ని భాషలు అధికారిక భారతీయ భాషలుగా గుర్తించబడ్డాయి?
a) 24
b) 22
c) 36
d) 16
8. వ్యవసాయ వృద్ధిని పెంపొందించడానికి 28 లక్షల మంది రైతులకు ఉచిత మొబైల్ ఫోన్లు ఇస్తామని ప్రకటించిన రాష్ట్రం ఏది?
a) ఛత్తీస్గఢ్
b) మహారాష్ట్ర
c) రాజస్థాన్
d) జార్ఖండ్
9. 'కోప్ ఇండియా 2019' (Cope India 2019 ) అనే వైమానిక విన్యాసాలలో భారత వైమానిక దళంతో పాటు ఏ దేశం యొక్క వైమానిక దళం పాల్గొంటుంది?
a) చైనా
b) దక్షిణ కొరియా
c) యునైటెడ్ స్టేట్స్
d) ఆస్ట్రేలియా
10. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఇప్పటివరకు ఏ దేశంలో ‘ఎబోలా వైరస్ వ్యాప్తి’ చరిత్రలో రెండవ అతిపెద్దదిగా మారింది?
a) ఉగాండా
b) జాంబియా
c) కాంగో
d) సుడాన్
11. ప్రపంచ AIDS దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
a) డిసెంబర్ 01
b) డిసెంబర్ 02
c) డిసెంబర్ 03
d) డిసెంబర్ 04
Answers & Explanations:
1. జవాబు (a): హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని అత్యవసర సేవలకు ఒకే నంబరు ‘112’ను సంప్రదించేందుకు వీలుగా రాజధాని సిమ్లాలో ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్’ (ERC) ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో డిస్ట్రిక్ కమాండ్ సెంటర్స్‌ని ఏర్పాటుచేసారు.
2. జవాబు (b): G20 సమ్మిట్ 2018 నవంబరు 30 న అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిరెస్‌లో జరిగింది. ఈ సదస్సు యొక్క థీం: బిల్డింగ్ కన్సెన్సస్ ఫర్ ఫెయిర్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్. ఈ వార్షిక సమావేశంలో భారత్ ప్రధాని నరేంద్రమోడీతో సహా ప్రపంచంలోని టాప్ 20 ఆర్థిక వ్యవస్థల నాయకులు హాజరయ్యారు.
3. జవాబు (c): మొట్టమొదటి సస్టెయినబుల్ బ్లూ ఎకానమీ కాన్ఫరెన్స్ 2018 కెన్యాలోని నైరోబీ నగరంలో నవంబరు 26 నుంచి 28 వ తేదీ వరకు నిర్వహించారు. ద 'బ్లూ ఎకానమీ అండ్ 2030 అజెండా ఫర్ ది సస్టెయినబుల్ డెవలప్మెంట్'. ఈ సదస్సును కెనడా మరియు జపాన్ సహాయంతో కెన్యా నిర్వహించింది.
4. జవాబు (d): నవంబర్ 28న గోవాలో నిర్వహించిన భారతదేశ 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2018)లో సెర్గీ లాజ్నిట్సా దర్శకత్వంలో వచ్చిన ఉక్రేనియన్ చలన చిత్రం ' డాన్బాస్’ ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం అవార్డుతో పాటు 40 లక్షల రూపాయల నగదు బహుమతి, ట్రోఫీ, ధ్రువీకరణపత్రాన్ని అందుకుంది.
5. జవాబు (b): మాల్దీవులు పార్లమెంటు ఆ దేశ అధ్యక్ష ఎన్నికల వయో పరిమితిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. ఇందుకు సభలో కావల్సిన 3/4 వంతుల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో 65 ఏళ్ల పైబడిన వారు పోటీ చేయకుండా నిషేధించిన రాజ్యాంగ సవరణను రద్దు చేయాలన్న ఈ ప్రతిపాదనకు 85 మంది సభ్యులున్న పార్లమెంట్ (మజ్లిస్) లో 72 మంది సభ్యులు మద్దతు తెలిపారు.
6. జవాబు (a): యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్ ప్రతినిధి బృందాలు బ్రీక్టు తర్వాత అమలులోకి వచ్చే ద్వైపాక్షిక విమానయాన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. బ్రెగ్జిట్ తర్వాత ప్రస్తుత అమెరికా-ఐరోపా (US-EU) ఒప్పందం యునైటెడ్ కింగ్డమ్‌కు వర్తించదు. అందుకని యూకే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అన్ని కార్గో సర్వీసు అవకాశాలను కల్పిస్తుంది. అంతేకాకుండా బ్రిటీష్ విదేశీ భూభాగాలు మరియు బ్రిటన్‌పై ఆధారపడిన (క్రౌన్ డిపెండెన్సీ) భూభాగాలు కూడా ఈ ఒప్పందంలో భాగమే.
7. జవాబు (b): రాజ్యాంగంలోని షెడ్యూల్ VIIIలో 22 భాషలు అధికార భాషలుగా ఉన్నప్పటికీ చాలామంది విద్యార్థులు కేవలం ఒకటి లేదా రెండు భాషలతో మాత్రమే సుపరిచితులుగా ఉన్నారు. అందుకని, కేంద్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ అధికారిక భారతీయ భాషలను విద్యార్థులకు పరిచయం చేయటానికి ఒక ప్రత్యేక కార్యక్రమం ‘భాషా సంగమం’ ప్రారంభించింది.
8. జవాబు (d): 2019/2021 నాటికి 28 లక్షల మంది రైతులకు వ్యవసాయ అవసరాల కొరకు ఉచిత మొబైల్ ఫోన్లు మరియు ప్రత్యేక ఎలక్ట్రిక్ ఫీడర్‌ను కల్పించనున్నట్లు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ ప్రకటించారు. దీనివలన మార్కెట్ రేట్లు మరియు వ్యవసాయానికి సంబంధించిన ఇతర సమాచారాన్ని రైతులు తెలుసుకోవచ్చు.
9. జవాబు (c): డిసెంబరు 2018 లో పశ్చిమ బెంగాల్లో రెండు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ల వద్ద 12 రోజుల పాటు ఉమ్మడి శిక్షణ ‘కోప్ ఇండియా 2019’ పేరుతో నిర్వహించనున్న ఉమ్మడి విన్యాసాలలో అమెరికా- ఇండియా వైమానిక దళాలు పాల్గొననున్నాయి. ఈ విన్యాసాలు ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న వైమానిక సామర్థ్యాలు, వ్యూహాలు మరియు వైమానిక శక్తిపై పరస్పర అవగాహనను పెంపొందిస్తాయి.
10. జవాబు (c): కొన్ని సంవత్సరాల క్రితం పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తించి వేలాది మంది మృతి చెందిన వినాశకరమైన దుర్ఘటన తర్వాత ప్రస్తుతం కాంగోలో ఘోరమైన ఎబోలా వ్యాప్తి చరిత్రలో రెండో అతిపెద్దది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కాంగో ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం, ఎబోలా వ్యాప్తి వల్ల మొత్తం మరణాల సంఖ్య 426 కు చేరుకుంది. ఇందులో 379 కేసులు ఎబోలా కేసులుగా ధృవీకరించబడ్డాయి. మరియు 47 ఎబోలా సంభావ్యత కలిగి ఉన్నాయి.
11. జవాబు (a)

No comments