Breaking News

ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్విజ్ 23-జనవరి-2019

important-current-affairs-in-telugu-23-january-2019-telugumaterial.in

Q1. దేశ్ ప్రేమి దివస్ ని ఎప్పుడు జరుపుకుంటారు ?
a) జనవరి 20
b) జనవరి 21
c) జనవరి 22
d) జనవరి 23




Q2. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ‘2019 తీరప్రాంత నియంత్రణ జోన్ నిబంధనల’ను ప్రకటించింది?
a) పర్యావరణ, అటవీ మరియు పర్యావరణ మార్పుల మంత్రిత్వశాఖ
b) షిప్పింగ్ మంత్రిత్వశాఖ
c) వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
d) విద్యుత్తు మంత్రిత్వ శాఖ




Q3. 15వ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో భాగంగా భారత్ వివిధ రంగాలలో కీలక భాగస్వామ్యాన్ని ఏ దేశంతో అంగీకరించింది?
a) సౌదీ అరేబియా
b) మారిషస్
c) బ్రెజిల్
d) అర్మేనియా




Q4. జనవరి 23న రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ను ఏ నగరంలో నిర్వహించారు?
a) ముంబై
b) బెంగళూరు
c) న్యూ ఢిల్లీ
d) చెన్నై




Q5. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2019 వార్షిక సమావేశానికి ఆతిథ్యమిచ్చిన నగరం ఏది?
a) దావోస్
b) పారిస్
c) లండన్
d) మాడ్రిడ్




Q6. 2019లో చమురు డిమాండ్‌లో ఏ దేశాన్ని అధిగమించి భారత్ 2వ అతిపెద్ద దేశంగా అవతరించనుంది?
a) అమెరికా
b) చైనా
c) సౌదీ అరేబియా
d) UAE




Q7. రూ. 253 కోట్లతో నిర్భయ పథకానికి ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
a) మహారాష్ట్ర
b) కర్ణాటక
c) ఉత్తరప్రదేశ్
d) ఢిల్లీ




Q8. 26/11 దాడులు జరిగిన పది సంవత్సరాల తరువాత భారతీయ నౌకా దళం చేపట్టిన అతిపెద్ద తీరప్రాంత రక్షణ విన్యాసాల పేరు ఏమిటి?
a) సీ-విజిల్
b) ట్రోపెక్స్
c) ఇందిరా
d) శక్తి




Q9. ఢిల్లీలోని ఎర్రకోటలో ఏ స్వాతంత్ర్య సమరయోధునికి సంబంధించిన మ్యూజియంను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు?
a) మౌలానా అబుల్ కలాం ఆజాద్
b) భగత్ సింగ్
c) నేతాజీ సుభాష్ చంద్ర బోస్
d) చంద్రశేఖర్ ఆజాద్




Q10. జలియన్ వాలా బాగ్ నరమేధం యొక్క చారిత్రాత్మక సంఘటన జ్ణాపకార్థం ‘యాద్-ఇ-జలియన్’ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు?
a) కుతుబ్ మినార్
b) జంతర్ మంతర్
c) పాత కోట
d) రెడ్ ఫోర్ట్




Answers & Explanations:




1. d: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23ను ఏటా దేశ్ ప్రేమి దివస్‌గా జరుపుకుంటారు.




2. a: 2011 నిబంధనలలో మార్పులుచేస్తూ జనవరి 18న పర్యావరణ, అటవీ మరియు పర్యావరణ మార్పుల మంత్రిత్వశాఖ ‘2019 తీరప్రాంత నియంత్రణ జోన్ నిబంధనల’ను ప్రకటించింది. పర్యావరణ రక్షణ చట్టం, 1986 లోని సెక్షన్ 3 ప్రకారం ఈ కొత్త నిబంధనలను జారీ చేసారు.




3. b: జనవరి 22న, 15వ ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, మౌరిష్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌత్లు చర్చలు జరిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంచే మార్గాలపై వారు చర్చించారు. సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం పై కూడా వారు చర్చించారు.




4. d: తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తమిళనాడు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ పాలసీని విడుదల చేశారు.




5. a: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షిక సమావేశం జనవరి 22న స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రారంభమైంది. 5 రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, పరస్పర సహకార సవాళ్లు, వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్య స్థాయిలు, ఆవాస నష్టాలు, ప్రపంచీకరణ యొక్క నాల్గవ దశ, మొదలైన అంశాలపై చర్చించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతారు.




6. b: వుడ్ మెకెన్జీ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్ చమురు దిగుమతిలో 2019లో చైనాను అధిగమించనుంది. మొదటి స్థానంలో అమెరికా ఉంది.




7. a: మహారాష్ట్ర కాబినెట్ జనవరి 22న కేంద్ర ప్రభుత్వ నిర్భయ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. ముంబాయిలో మహిళలపై నేరాలపై అరికట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా మహిళల భద్రతను మెరుగుపర్చడానికి ఉద్దేశించిన కార్యక్రమాలను అమలు చేయడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) ప్రభుత్వం 2013 లో నిభంధ ఫండ్‌ను ప్రారంభించింది.




8. a: భారతీయ నౌకాదళం యొక్క అతిపెద్ద తీరప్రాంత రక్షణ విన్యాసాలు - "సీ విజిల్" ప్రారంభమయింది. మొత్తం 13 కోస్తా రాష్ట్రాలు మరియు కేంద్రప్రాలిత ప్రాంతాలను కలిపి 7516.6 కి.మీ. సరిహద్దు మరియు ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ (EEZ) లలో ఈ విన్యాసాలు చేపట్టారు. 26/11 దాడుల తర్వాత ఇలాంటి విన్యాసాలు జరపడం ఇదే తొలిసారి.




9. c: నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 122వ జయంతి వార్షికోత్సవం గుర్తుగా ఢిల్లీలోని ఎర్రకోటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుభాష్ చంద్ర బోస్ మరియు ఐఎన్ఏ కు సంబంధించిన అనేక కళాఖండాలను మ్యూజియం ప్రదర్శించనున్నారు.




10. d: న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జనవరి 23న ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు చారిత్రక మ్యూజియంలను ప్రారంభించారు. అవి 1: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ణాపకార్థం. 2: జలియన్ వాలా బాగ్ మరియు మొదటి ప్రపంచయుద్ధ జ్ణాపకార్థం యాద్-ఇ-జలియన్ మ్యూజియం. 3: భారత మొదటి స్వాతంత్ర్య ఉద్యమం 1857 నాటి జ్ణాపకార్థం. 4. భారతీయ కళ యొక్క ప్రదర్శన కొరకు దృశ్యకళా మ్యూజియం.

No comments