Breaking News

ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్విజ్ 31-జనవరి-2019

important-current-affairs-in-telugu-31-january-2019-telugumaterial.in

Q1. మాజీ కేంద్ర మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ జనవరి 29న కన్నుమూశారు. ఆయన అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యం వహించారు?
a) రైల్వే మంత్రిత్వ శాఖ
b) ఆర్థిక మంత్రిత్వ శాఖ
c) రక్షణ మంత్రిత్వ శాఖ
d) వాణిజ్య మంత్రిత్వ శాఖ




Q2. అధికారిక గణాంక వ్యవస్థను మెరుగుపర్చడానికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ తో ఏ మంత్రిత్వశాఖ ఒప్పందం కుదుర్చుకుంది?
a) స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ
b) ఆర్థిక మంత్రిత్వ శాఖ
c) వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
d) కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ




Q3. ఇటీవల ప్రకృతి వైపరిత్యాలకు గురైన 6 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి జాతీయ విపత్తు రెస్పాన్స్ ఫండ్ (ఎన్డిఆర్ఎఫ్) నుంచి రూ. 7214.03 కోట్ల అదనపు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని ఆమోదించిందిన ఉన్నత స్థాయి కమిటీకి నాయకత్వం వహించినవారు ఎవరు ?
a) నరేంద్ర మోదీ
b) అరుణ్ జైట్లీ
c) రాజ్‌నాథ్ సింగ్
d) రామ్ నాథ్ కోవింద్




Q4. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ప్రకటించిన 'హిందీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2018' పదం ఏది?
a) ఆధార్
b) నారి శక్తి
c) బాహుబలి
d) వికాస్




Q5. ఇటీవల చెరకు రసాన్ని "జాతీయ పానీయం" గా ప్రకటించిన దేశం ఏది?
a) ఆఫ్ఘనిస్తాన్
b) మయన్మార్
c) బంగ్లాదేశ్
d) పాకిస్థాన్




Q6. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (CPI) 2018 లో భారతదేశపు స్థానం ఏది?
a) 59వ
b) 78వ
c) 88వ
d) 97వ




Q7. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (CPI) 2018 జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?
a) డెన్మార్క్
b) న్యూజిలాండ్
c) సింగపూర్
d) అమెరికా




Q8. ఇటీవల వార్తల్లో నిలిచిన సుమన్ కుమారి ఏ దేశంలో సివిల్ న్యాయమూర్తిగా నియమితులైన మొదటి హిందూ మహిళగా చరిత్ర సృష్టించింది?
a) నేపాల్
b) పాకిస్థాన్
c) శ్రీలంక
d) బంగ్లాదేశ్




Q9. జాతీయ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?
a) జనవరి 25
b) సెప్టెంబర్ 27
c) అక్టోబర్ 20
d) ఏప్రిల్ 12




Q10. భారతదేశ గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?
a) జనవరి 26
b) ఆగస్టు 15
c) జనవరి 01
d) నవంబర్ 26




Q11. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం (International Customs Day) ఎప్పుడు జరుపుకుంటారు ?
a) జనవరి 26
b) ఆగస్టు 15
c) అక్టోబర్ 20
d) ఏప్రిల్ 12




Q12. సమాచారం గోప్యతా దినోత్సవం (Data Protection Day) ఎప్పుడు జరుపుకుంటారు ?
a) జనవరి 25
b) జనవరి 27
c) జనవరి 22
d) జనవరి 28




Q13. అమరవీరుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?
a) జనవరి 30
b) అక్టోబర్ 31
c) అక్టోబర్ 20
d) డిసెంబర్ 14




Q14. ప్రపంచ కుష్టువ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని 2019లో ఎప్పుడు జరుపుకున్నారు ?
a) జనవరి 26
b) జనవరి 27
c) జనవరి 28
d) జనవరి 29




Q15. ఏ నెల చివరి ఆదివారాన్ని కుష్టు వ్యాధి నివారణా దినోత్సవంగా జరుపుకుంటారు ?
a) ఏప్రిల్
b) జనవరి
c) ఫిబ్రవరి
d) మార్చి




Answers:




1. (c): కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ (88) జనవరి 29న అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఫెర్నాండెజ్ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల, ఆయనకు స్వైన్ ఫ్లూ కూడా సోకింది. 2001 నుండి 2004 మధ్య కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర రక్షణ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.




2. (a): అధికారిక గణాంకాల వ్యవస్థలో కొత్త సమాచార సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞాన ఉత్పత్తి మరియు విజ్ఞాన భాగస్వామ్యం మరియు సామర్థ్య నిర్మాణానికి సంబంధించి, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ (MoSPI) మరియు నేషనల్ కౌన్సిల్ అఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) మధ్య ఒప్పందం (ఎంఓయు) కుదిరింది.




3. (c): కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ జాతీయ విపత్తు రెస్పాన్స్ ఫండ్ (ఎన్డిఆర్ఎఫ్) నుండి రూ. 7214.03 కోట్ల అదనపు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని 6 రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆమోదించింది.




4. (b): ‘నారి శక్తి’ (మహిళా సాధికారత) పదాన్ని 2018 హిందీ పదం గా ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ప్రకటించబడింది.2018 సంవత్సరంలో ఈ పదం విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ పదం సంస్కృత భాష నుండి వచ్చింది. 'నారి' అంటే 'స్త్రీలు/మహిళలు' మరియు 'శక్తి' అంటే 'శక్తి/సాధికారిత'.




5. (d): ఇటీవల పాకిస్థాన్ చెరకు రసాన్ని దేశ ‘జాతీయ పానీయం’గా ప్రకటించింది. నారింజ, క్యారెట్ మరియు చెరకు రసాలలో ఒకటి ఎంపిక చేయాల్సిందిగా ట్విట్టర్ ద్వారా ఎన్నిక నిర్వహించి చెరకును జాతీయ పానీయంగా ప్రకటించింది.




6. (b): భారత్ ‘అవినీతి పర్సెప్షన్ ఇండెక్స్ (CPI) 2018’ జాబితాలో మూడు స్థానాలు మెరుగుపరుచుకొని, 41 స్కోరుతో 78వ స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో 180 దేశాల ఉండగా డెన్మార్క్ మొదటి స్థానంలో నిలవగా, చైనా 87వ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ 117వ స్థానంలో ఉంది. ఈ జాబితాను ట్రాన్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేస్తుంది.




7. (a): కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (CPI) 2018 జాబితాలో అతి తక్కువ అవినీతి గల దేశంగా డెన్మార్క్ నిలిచింది. దాని తర్వాత న్యూజీలాండ్ నిలిచింది. అత్యంత అవినీతి దేశాలుగా చివరి స్థానాలలో సోమాలియా, సిరియా మరియు దక్షిణ సూడాన్ దేశాలు నిలిచాయి. ఈ జాబితాలో భారత్ 78వ స్థానంలో, చైనా 87వ స్థానంలో మరియు పాకిస్థాన్ 117వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాను ట్రాన్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేస్తుంది.




8. (b): సుమన్ కుమారి పాకిస్తాన్‌లో సివిల్ జడ్జిగా నియమించబడిన మొట్టమొదటి హిందూ మహిళ. ఆమె కంబర్-షహదద్కోట్ జిల్లా వాసి. ఆమె స్థానిక జిల్లాలో సేవలు అందించనున్నారు.




9. (a): దేశ ఆర్ధికవ్యవస్థకు పర్యాటక ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏటా జనవరి 25న జరుపుకుంటారు.




10. (a): బ్రిటీష్ వారు రూపొందించిన ‘1935 భారత ప్రభుత్వ చట్టం’ స్థానంలో భారతీయులచే రచించబడిన భారత నూతన రాజ్యాంగం 1949 నవంబరు 26న భారత రాజ్యాంగ సభచే ఆమోదించబడి, 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ఈ చారిత్రక రోజున భారత్ గణతంత్ర్య రాజ్యంగా అవతరించింది. 1929లో జనవరి 26న బ్ర్తిటీషు వారు ప్రతిపాదించిన డొమీనియన్ స్టేటస్‌ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ‘పూర్ణ స్వరాజ్’ ప్రకటించిన కారణంగా ఈ రోజుని జాతీయ గణతంత్ర దినోత్వవంగా జరుపుకుంటారు.




11. (a): సరిహద్దు భద్రత నిర్వహణలో కస్టమ్స్ అధికారులు మరియు సంస్థల పాత్రను గుర్తించేందుకు ఏటా జనవరి 26న అంతర్జాతీయ కస్టమ్స్ డే (ICD) జరుపుకుంటారు. ఇది కస్టమ్స్ అధికారులు వారి ఉద్యోగాలలో ఎదుర్కొనే పరిస్థితులు మరియు సవాళ్ళపై అవగాహన కల్పిస్తుంది. 2019 థీం: SMART borders for seamless Trade, Travel and Transport




12. (d):




13. (a): మహాత్మా గాంధీ కన్నుమూసిన రోజు జనవరి 30ని ఏటా అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు.




14. (b)




15. (b): ఏటా జనవరి నెల చివరి ఆదివారాన్ని ప్రపంచ కుష్టువ్యాధి నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటారు. 2019 థీం: ‘Ending discrimination, stigma, and prejudice.

No comments