డెయిలీ క్విజ్ 55: ఇండియన్ పాలిటీ
Q1. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని క్రింది ప్రకరణం మరియు భాగంలో ఆస్ధి హక్కు పొందుపరచబడినది.
a) 300A, Part-XII
b) 200A, Part-XII
c) 300A, Part-XVIII
d) 200A, Part-XVIII
Q2. ప్రాధమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాల మధ్య సమతౌల్యత భారత రాజ్యాంగానికి పునాది అని సుప్రీంకోర్టు ఈ క్రింది కేసులో ప్రకటించింది.
a) చంపకం దొరైరాజన్ కేసు Vs మద్రాసు రాష్ట్రం,1951
b) గోలక్‌నాధ్ కేసు Vs పంజాబ్ రాష్ట్రం, 1967
c) శంకరి ప్రసాస్ కేసు Vs యూనియన్ ఆఫ్ ఇండియా, 1952
d) మినర్వా మిల్స్ కేసు Vs యూనియన్ ఆఫ్ ఇండియా, 1980
Q3. భారత రాష్ట్రపతిని ఎన్నుకొనే నియోజక గణంలో సభ్యులు కానివారు
A: పుదుచ్చేరి విధానసభకు ఎన్నికైన సభ్యులు
B: జమ్ము కాశ్మీర్ విధాన సభకు ఎన్నికైన సభ్యులు
C: రాజ్యసభకు నియమించబడిన సభ్యులు
D: ఒక రాష్ట్ర విధాన మండలికి ఎన్నికైన సభ్యులు
a) A, C
b) C, D
c) B, C, D
d) A, B, C, D
Q4. అటల్ బిహారి వాజ్‌పాయ్ మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టినది
a) 1999
b) 1991
c) 1996
d) 1998
Q5. రాజ్యసభకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
a) 229 మంది సభ్యులు రాష్ట్రాల నుండి మాత్రమే రాజ్యసభకు ఎన్నికౌతారు.
b) కేంద్రపాలిత ప్రాంతమైన చండీఘర్ నుండి ఒక సభ్యుడు రాజ్యసభకు ఎన్నికౌతారు.
c) కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి నుండి ఒక సభ్యుడు రాజ్యసభకు ఎన్నికౌతారు.
d) రాజ్యసభలో SC మరియు ST లకు రిజర్వేషన్ ఉండదు.
Q6. ఈ క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలోని 8వ షెడ్యూలులో ఒక క్రొత్త భాషను చేర్చడానికి సంబంధించినది కాదు
a) 21వ రాజ్యాంగ సవరణ చట్టం, 1967
b) 71వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992
c) 62వ రాజ్యాంగ సవరణ చట్టం, 1989
d) 92వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003
Q7. భారత సుప్రీంకోర్టు యొక్క సలహారూపక పరిధిని ఈ క్రింది రాజ్యాంగం నుండి గ్రహించడమైనది
a) అమెరికన్ రాజ్యాంగం
b) ఆస్ట్రేలియా రాజ్యాంగం
c) దక్షిణ ఆఫ్రికా రాజ్యాంగం
d) కెనడా రాజ్యాంగం
Q8. 243D రాజ్యాంగ ప్రకరణను అనుసరించి పంచాయితీ సీట్లలో షెడ్యూల్డు కులాల వారికి నిర్ణయించిన రిజర్వేషన్లు ఈ క్రింది రాష్ట్రానికి వర్తించవు.
a) అరుణాచల్ ప్రదేశ్
b) సిక్కిం
c) త్రిపుర
d) గోవా
Q9. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తొలగింపు ప్రక్రియ ఈ క్రింది వారిని తొలగించే పద్దతిని పోలి ఉంటుంది.
a) రాష్ట్ర అడ్వకేట్ జనరల్
b) హైకోర్టు జడ్జి
c) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్‌పర్సన్
d) రాష్ట్ర ఆర్ధిక సంఘం ఛైర్‌పర్సన్
Q10. భారతదేశంలో ఒక క్రొత్త అఖిల భారత సర్వీసును ఏర్పాటు చెయ్యడానికి కావలసినది
a) లోక్‌సభలో 2/3వ వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదం
b) పార్లమెంటులో 2/3వ వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదం
c) రాజ్యసభలో 2/3వ వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదం
d) భారత రాష్ట్రపతి కార్యనిర్వాహక ఉత్తర్వు
Answers:
1. జవాబు: a
2. జవాబు: d
3. జవాబు: b
4. జవాబు: c
5. జవాబు: b
6. జవాబు: c
7. జవాబు: d
8. జవాబు: a
9. జవాబు: b
10. జవాబు: c

No comments