సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అర్జన్ కుమార్ సిక్రీ సింగపూర్‌లోని అంతర్జాతీయ కమర్షియల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆగస్టు 1 నుంచి అంతర్జాతీయ న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు. 2021 జనవరి 4 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన భాజాపా సీనియర్ నేత కల్‌రాజ్ మిశ్రా(78) హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు.
గుజరాత్ రాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్(60) నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా ఒడిశాకు చెందిన భాజపా సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి, రచయిత,న్యాయవాది అయిన బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు.
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర గవర్నర్‌గా రాజ్యసభ సభ్యురాలు అనసూయా ఊకే (62) నియమితులయ్యారు.
జులై 15 నుంచి తెలంగాణలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం అమల్లోకి వచ్చింది. దేశంలో ఇప్పటివరకు 24 రాష్ట్రాల్లో 334 ప్రవేట్ వర్సిటీలున్నాయి. తెలంగాణ 25వ రాష్ట్రం కానుంది.
ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ 16-జులై-2019
Reviewed by Venkat
on
4:32 PM
Rating: 5
No comments