Breaking News

భాజనీయ సూత్రాలు (Divisibility Rules)


  • ఏదైనా ఒక సంఖ్య 2 చే భాగించవలెనన్న ఆ సంఖ్యలోని చివరి అంకె ‘సరిసంఖ్య’ లేదా ‘సున్నా’ ఉండవలెను.
  • ఏదైనా ఒక సంఖ్య 3 చే భాగించవలెనన్న ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే భాగించబడవలెను.
  • ఏదైనా ఒక సంఖ్య 4 చే భాగించవలెనన్న ఆ సంఖ్యలోని చివరి రెండు అంకెలు 4 చే భాగించబడవలెను, లేదా ‘సున్నాలు’ ఉండవలెను.
  • ఏదైనా ఒక సంఖ్య 5 చే భాగించవలెనన్న ఆ సంఖ్యలోని చివరి అంకె 5 లేదా ‘సున్నా’ ఉండవలెను.
  • ఏదైనా ఒక సంఖ్య 6 చే భాగించవలెనన్న ఆ సంఖ్య 2 మరియు 3 చే భాగించబడవలెను.
  • ఏదైనా ఒక సంఖ్య 8 చే భాగించవలెనన్న ఆ సంఖ్యలోని చివరి మూడు అంకెలు 8 చే భాగించబడవలెను.
  • ఏదైనా ఒక సంఖ్య 9 చే భాగించవలెనన్న ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 9 చే భాగించబడవలెను.
  • ఏదైనా ఒక సంఖ్య 10 చే భాగించవలెనన్న ఆ సంఖ్యలోని చివరి అంకె ‘సున్నా’ అయి ఉండవలెను.
  • ఏదైనా ఒక సంఖ్య 11 చే భాగించవలెనన్న ఆ సంఖ్యలోని సరి సంఖ్యల స్థానాలలో ఉండే అంకెల మొత్తానికి బేసి సంఖ్యల స్థానాలలో ఉండే అంకెల మొత్తానికి సమానము అయి ఉండవలెను, లేదా ఆ సంఖ్యల తేడా 11 యొక్క గుణకం అయి ఉండవలెను.

No comments