Q61. అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కగట్టే పద్ధతిలో సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో రూ. 6,000/- మీద ఒక సంవత్సరానికి అంతమయ్యే చక్రవడ్డీకి, అదే మొత్తానికి అదే రేటుతో ఒక సంవత్సరానికి అయ్యే సరల వడ్డీకి మధ్య ఉన్నవ్యత్యాసమెంత? a) రూ. 44 b) రూ. 66 c) రూ. 15 d) రూ. 25
Q62. 8,000 రూపాయలను 10 శాతం రేటుతో బారువడ్డీకి ఇవ్వగా, 3 సంవత్సరముల తరువాత ఎంత మొత్తం అవుతుంది? a) రూ. 10,200 b) రూ. 8,240 c) రూ. 10,040 d) రూ. 10,400
Q63. 75 రూపాయలకు ఎంత శాతం కలిపితే 90 రూపాయలు అవుతుంది? a) 10 b) 15 c) 20 d) 30
Q64. ఒక మనిషి ఒక నిర్దిష్ట దూరమును గంటకు 20 కి. మీ. వేగముతో ప్రయాణించెను. తిరుగు ప్రయాణములో గంటకు 30 కి. మీ. వేగముతో ప్రయాణించి తొలి స్ధానమునకు చేసుకొనెను. అయితే మొత్తము ప్రయానములో అతని యొక్క సరాసరి వేగమెంత? a) 25 కి.మీ./గం. b) 22 కి.మీ./గం. c) 24 కి.మీ./గం. d) 26 కి.మీ/గం.
Q65. ఒక రైలు హైదరాబాదులో ఉదయం 6 గంటలకు బయలుదేరి, విజవాడకు ఉదయం 10 గంటలు చేరును. ఇంకొక రైలు విజవాడలో ఉదయం 8 గంటలకు బయలుదేరి హైదరాబాదుకు ఉదయం 11.30కు చేరును. అయితే ఆ రెండు రైళ్ళు ఏ టైమ్ వద్ద ఒకదానికి ఒకటి కలుస్తాయి. a) ఉదయం 9.26 b) ఉదయం 9 c) ఉదయం 8.30 d) ఉదయం 8.56
Q66. Bతో పోలిస్తే A రెండు రెట్లు వేగంగా నడువగలడు మరియు Cతో పోలిస్తే B మూడు రెట్లు వేగంగా నడువగలడు. ఒక ప్రయాణానికి Cకి పట్టిన సమయము 42 నిముషములు అయితే, Aకి ఎంత సమయము పట్టును? a) 14 నిమిషాలు b) 32 నిమిషాలు c) 63 నిమిషాలు d) 7 నిమిషాలు
Q67. నలుగురు పురుషులు మరియు ఆరుగురు స్త్రీలు ఒక పనిని 8 రోజులలో చేయగలరు. అదే పనిని ముగ్గురు పురుషులు మరియు ఏడుగురు స్త్రీలు, కలిసి 10 రోజులలో చేయగలరు. అయితే 10 మంది స్త్రీలు ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? a) 40 రోజులు b) 44 రోజులు c) 36 రోజులు d) 42 రోజులు
Q68. ఒక పనిలో 3/4 వ భాగాన్ని A అనే వ్యక్తి 12 రోజులలో చేయగలడు. 1/8వ భాగాన్ని ఆ వ్యక్తి ఎన్ని రోజులలో చేయగలడు? a) 3 రోజులు b) 2 రోజులు c) 4 రోజులు d) 5 రోజులు
Q69. ఒక పట్టన ప్రస్తుత జనాభా 3500. పురుషుల జనాభా 6%, స్త్రీల జనాభా 4% పెరిగితె, ఆ పట్టణ జనాభా 36760 అవుతుంది. ప్రస్తుతం ఆ పట్టణ స్త్రీల జనాభా ఎంత? a) 20000 b) 18000 c) 17000 d) 19000
Q70. P ఒక ఇంటిని రూ. 10000కు కొని Qకి 10 శాతం లాభానికి అమ్మెను. తరువాత Q అదే ఇంటిని Pకి 10 శాతం నష్టానికి అమ్మెను. అయినచో మొత్తము మీద P యొక్క లాభము ఎంత? a) రూ. 1,000/- b) రూ. 1,100/- c) రూ. 2,000/- d) లాభం లేదు నష్టం లేదు
Q61. Answer: c
Q62. Answer: d
Q63. Answer: c
Q64. Answer: c
Q65. Answer: d
Q66. Answer: d
Q67. Answer: a
Q68. Answer: b
Q69. Answer: c
Q70. Answer: b
VRO 2012 ప్రశ్నాపత్రం: 61 నుండి 70 ప్రశ్నలు
Reviewed by Venkat
on
3:00 AM
Rating: 5
No comments