డెయిలీ క్విజ్ 11: తెలంగాణ గ్రూప్-4 2018 పరీక్ష పేపర్: కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు
07 అక్టోబర్ 2018 నాడు జరిగిన తెలంగాణ గ్రూప్-4 పరీక్షలో అడిగిన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వాటి సమాధానాలు
Q1. 21వ శతాబ్దపు అతి సుదీర్షమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడింది?
a) జులై 28-29, 2018
b) జులై 21-22, 2018
c) జులై 26-27, 2018
d) జులై 27-28, 2018
Q2. ‘ప్రపంచ జల దినోత్సవం’ కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
1: ప్రతి సంవత్సరం మార్చి 22 నాడు ‘ప్రపంచ జల దినోత్సవం’ ను జరుపుతారు.
2: 2018వ సంవత్సరపు దాని నేపథ్యం (థీం) ‘అందరికీ సురక్షితమైన నీరు’.
3: 1993లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 22ను ‘ప్రపంచ జల దినోత్సవం’గా ప్రకటించింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B మరియు C
b) A మరియు B మాత్రమే
c) A మరియు C మాత్రమే
d) B మరియు C మాత్రమే
Q3. 2019 గణతంత్ర దినోత్సవ పరేడ్ మరియు వేడుకలకు భారత ప్రభుత్వం ఎవరిని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది?
a) అమెరికా దేశపు డినాల్డ్ ట్రంప్
b) చైనా దేశపు లీ కెఖియాంగ్
c) దక్షిణ కొరియాకు చెందిన మూన్ జే-ఇన్
d) యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన థెరిసా మే
Q4. ఆదివాసీ ప్రజల సమగ్ర అభివృద్ధి మరియు సంక్షేమం కోసం భారత ప్రభుత్వం ‘వనబంధు కళ్యాణ్ యోజన’ అను పథకాన్ని ప్రవేశపెట్టింది.పైలెట్ ప్రాజెక్టు తరహాలో ఈ పథకాన్ని జిల్లాకు ఒక బ్లాక్ చొప్పున కింది ఏ రాష్ట్రాల్లో ప్రారంభించారు?
A: మధ్యప్రదేశ్
B: చత్తీస్‌ఘడ్
C: తమిళనాడు
D: తెలంగాణ
E: ఉత్తరప్రదేశ్
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) B, C, D మరియు E మాత్రమే
b) A, B మరియు D మాత్రమే
c) A, B మరియు E మాత్రమే
d) C, D మరియు E మాత్రమే
Q5. ప్రపంచ న్యాయ ప్రాజెక్టు యొక్క ‘న్యాయనియమావళి సూచిక 2017-18’ 113 దేశాలను అధ్యయనం చేసింది. దీని ప్రకారం భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకు ఎంత? మరియు సున్నా (0) నుంచి ఒకటి (1) మధ్యలో ఎంత స్కోరు సాధించింది?
a) 91వ ర్యాంకు మరియు 0.41 స్కోరు
b) 58వ ర్యాంకు మరియు 0.53 స్కోరు
c) 59వ ర్యాంకు మరియు 0.52 స్కోరు
d) 62వ ర్యాంకు మరియు 0.52 స్కోరు
Q6. జులై 6, 2018 నాడు భారత ప్రభుత్వం ‘ముదుమలై టైగర్ రిజర్వ్’ (MTR) చుట్టూ 438 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో-సెన్సిటివ్ జోన్ (ESZ) గా ప్రకంటించింది. ముదుమలై టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది?
a) తమిళనాడు
b) అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు
c) కర్ణాటక
d) కేరళ
Q7. కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
A: అంతర్జాతీయ ద్రవ్య నిధి తన జులై 2018 ప్రపంచ ఆర్థిక దృక్పథం (వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్)లో భారతదేశ వృద్ధి రేటు 2018లో 7.3%గా, 2019లో 7.5%గా ఉంటుందని అంచనా వేసింది.
B: ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (OECD) వారి అభివృద్ది కేంద్రం భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2018-19లో 7.4%గా, 2019-20లో 7.5%గా ఉంటుందని అంచనా వేసింది.
C: జనవరి 2018లో భారత ప్రభుత్వం విడుదల చేసిన ‘ఆర్థిక సర్వే’ ప్రకారం 2018-19 సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాలు 7.0-7.5 శాతం పరిధిలో ఉంటాయి.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B మరియు C
b) A మరియు B మాత్రమే
c) B మరియు C మాత్రమే
d) A మరియు C మాత్రమే
Q8. కింది సంస్థలలో ఏ సంస్థను ఇజ్రాయిల్ వ్యతిరేక పక్షపాత ధోరణి అని అరోపిస్తూ యూఎస్‌ఏ వదిలివెళ్లగా ఖాళీ అయిన సీటుకు ఐస్‌లాండ్ 13 జూలై 2018 నాడు ఎన్నుకోబడింది?
a) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO)
b) ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (IBRD)
c) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)
d) యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (UNHRC)
Q9. ‘ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ 2018’ కింద ప్రాజెక్టుల అమలులో గొప్ప ఊపందుకున్నందుకు కింది నగరాల్లో ‘సిటీ అవార్డు’ కోసం ఎంపిక చేయబడిన నగరం ఏది?
a) జబల్‌పూర్
b) లూధియానా
c) సూరత్
d) కొచ్చి
Q10. ‘ది గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్-2018’ను ఏ పుస్తకం గెలుచుకుంది?
a) వోల్ఫ్ హాల్
b) ది ఇంగ్లీష్ పేషెంట్
c) ఇన్ ఎ ఫ్రీ స్టేట్
d) లింకన్ ఇన్ ది బార్డో
Q11. కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
A: 18వ ఆసియా క్రీడల (2018)లో రూపిందర్‌పాల్ సింగ్ భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్.
B: ఈ క్రీడలు 18 ఆగష్టు 2018 నుండి జకార్తా మరియు పాలెంబంగ్ అనే నగరాలలో మొదలయ్యాయి.
C: 18వ ఆసియా క్రీడల ముగింపు ఉత్సవం సెప్టెంబర్ 2, 2018 నాడు జరిగింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B మరియు C
b) A మరియు B మాత్రమే
c) A మరియు C మాత్రమే
d) B మరియు C మాత్రమే
Q12. ప్రపంచ నీటి (జల) దినం (WWD) నేపథ్యం (థీం)కు సంబంధించి కింది వాటిని జతపరచండి:
WWD నేపథ్యం (థీం)
A: జలాన్ని వ్యర్థం చేయడం ఎందుకు
B: జలం మరియు సుస్థిరమైన (నిరంతర) అభివృద్ది
C: జలం కొరకు ప్రకృతి
D: మంచి నీరు మంచి ఉద్యోగాలు
సంవత్సరం
1: 2018
2: 2017
3: 2016
4: 2015
5: 2014
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A-3, B-4, C-2, D-1
b) A-2, B-4, C-1, D-3
c) A-4, B-3, C-1, D-5
d) A-2, B-1, C-5, D-4
Q13. కింది వాటిని జతపరచండి:
సంస్థ & హోదా
A: ఎన్.డి.ఆర్.ఎఫ్. డైరెక్టర్ జనరల్
B: డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా
C: ఐ.సి.హెచ్.ఆర్. చైర్మన్
D: విక్రం సారాబాయి అంతరిక్ష పరిశోధనా కేంద్రం డైరెక్టర్
వ్యక్తి
1: అర్వింద్ జంకేధర్
2: ఎస్. ఈశ్వర రెడ్డి
3: ఎస్. సొమనాథ్
4: సంజయ్ కుమార్
5: డాక్టర్ ఎం. గోవింద్ రావు
a) A-2, B-4, C-1, D-5
b) A-4, B-2, C-1, D-3
c) A-4, B-5, C-2, D-1
d) A-3, B-2, C-5, D-4
Q14. కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
A: భారతదేశ పరిధిలోని వాణిజ్య బ్యాంకుల నుండి భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకునే అప్పుపై చెల్లించే రేటును ‘రెపో రేటు’ అంటారు.
B: వాణిజ్య బ్యాంకులకు ఏమైనా నిధుల కొరత ఏర్పడినపుడు రిజర్వు బ్యాంకు ఇచ్చే అప్పుపై విధించే వడ్డీ రేటును ‘రివర్స్ రెపో రేటు’ అంటారు.
C: ఆగష్టు 1, 2018 నాడు రిజర్వు బ్యాంకు రెపో రేటును మరియు రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల చొప్పున వరుసగా 6.5% మరియు 6.25% కు పెంచింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) C మాత్రమే
b) A మరియు B మాత్రమే
c) B మరియు C మాత్రమే
d) A, B మరియు C
Q15. మూడు సంవత్సరాల క్రితం కింది వాటిల్లోని ఏ దేశంతో అమెరికా దౌత్య సంబంధాలను పునరుద్ధరించింది?
a) క్యూబా
b) పాకిస్థాన్
c) ఇరాక్
d) ఇరాన్
Q16. హైదరాబాద్‌కు చెందిన వర్ధమాన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ 2017 లో ఏ టీమ్ కు ప్రాతినిథ్యం వహించినాడు?
a) పూణే వారియర్స్ ఇండియా
b) సన్ రైజర్స్ హైదరాబాద్
c) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
d) కోల్‌కతా నైట్ రైడర్స్
Q17. సిద్దిపేటకు చెందిన నారాయణ స్వామి వెంకట యోగి ఈ కింది రంగానికి చెందినవారు ?
a) సంఖ్యా శాస్త్రం
b) యోగా
c) బుర్రకథ
d) తెలుగు కవిత్వం
Q18. ప్రఖ్యాత కవి గుల్జార్ రచించిన ‘గ్రీన్ పోయెమ్స్’ ను తెలుగులోకి అనువదించినది ఎవరు?
a) చల్లపల్లి స్వరూపా రాణి
b) వారాల ఆనంద్
c) మంగరి రాజేందర్
d) శిఖామణి
Q19. 2017 సంవత్సరానికి గాను ‘సాహిత్యఅకాడమీ యువ పురస్కార్’ ను పొందిన మెర్సీమార్గరెట్ ఏ భాషలో రచించిన తన కవిత్వానికి పొందారు?
a) తెలుగు
b) కొంకణ్
c) తమిళ్
d) ఇంగ్లీష్
Q20. బర్రెల పంపిణీ స్కీం గురించి ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
A: ఈ స్కీం ‘పాడి రైతులకు బర్రెల పంపిణీ’ తెలంగాణ ప్రభుత్వం ఆమోదం పొంది 2018-19లో ఆచరణ చేయబడుతుంది.
B: అందరు లబ్దిదారులకు యూనిట్ ఖర్చుపైన 50 శాతం సబ్సిడీ ఇవ్వబడుతుంది.
C: సుమారు రెండు లక్షల కుటుంబాలు ఈ పధకం ద్వారా లబ్ది పొందుతారు.
D: రవాణా ఖర్చు రూ. 5000 కాకుండా ఒక్క బర్రె యూనిట్ ఖర్చు రూ. 60,000 కు మించకూడదు.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) B, C మరియు D మాత్రమే
b) A మరియు C మాత్రమే
c) B మరియు D మాత్రమే
d) A, B మరియు D మాత్రమే
జవాబులు:
1. జవాబు: d
2. జవాబు: b
3. జవాబు: a
4. జవాబు: b
5. జవాబు: d
6. జవాబు: a
7. జవాబు: a
8. జవాబు: d
9. జవాబు: c
10. జవాబు: b
11. జవాబు: d
12. జవాబు: b
13. జవాబు: b
14. జవాబు: a
15. జవాబు: a
16. జవాబు: b
17. జవాబు: d
18. జవాబు: b
19. జవాబు: a
20. జవాబు: d

No comments