డెయిలీ క్విజ్ 12: జియోగ్రఫీ
Q1. జులై 6, 2018 నాడు భారత ప్రభుత్వం ‘ముదుమలై టైగర్ రిజర్వ్’ (MTR) చుట్టూ 438 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో-సెన్సిటివ్ జోన్ (ESZ) గా ప్రకంటించింది. ముదుమలై టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది?
a) తమిళనాడు
b) అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు
c) కర్ణాటక
d) కేరళ
Q2. సింధూ (ఇండస్) నది యొక్క ఉపనదులు కింద ఇవ్వబడ్డాయి:
A: జీలం
B: సత్లెజ్
C: చేనాబ్
D: రావి
ఉత్తరం నుండి దక్షిణానికి సింధూ నది యొక్క ఉప నదుల సరియైన క్రమాన్ని ఎంపిక చేయండి:
a) C, A, D మరియు B
b) A, C, D మరియు B
c) A, D, B మరియు C
d) B, A, C మరియు D
Q3. కింది జతలను పరిశీలించండి:
A: ఉకై జల విద్యుత్ ప్రాజెక్టు – రాజస్థాన్
B: కొయలి చమురు శుధ్ది కర్మాగారం – గుజరాత్
C: భారతదేశంలోని ప్రథమ జల విద్యుత్ కర్మాగారం – తమిళనాడు
సరియైన జవాబును ఎంపిక చేయండి.
a) A, B మరియు C
b) A మరియు B మాత్రమే
c) A మరియు C మాత్రమే
d) B మరియు C మాత్రమే
Q4. కింది వాటిని జతపరచండి:
జాబితా-I
A: సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
B: కోర్బా బొగ్గు గనులు
C: మిష్మి హిల్స్
D: యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
జాబితా-II
1: అరుణాచల్ ప్రదేశ్
2: చత్తీస్‌గఢ్
3: జార్కండ్
4: ఒడిషా
5: పశ్చిమ బెంగాల్
సరియైన జవాబును ఎంపిక చేయండి.
a) A-1, B-5, C-2, D-3
b) A-4, B-2, C-1, D-3
c) A-5, B-2, C-3, D-4
d) A-2, B-3, C-1, D-5
Q5. కింది జతలను పరిశీలించండి:
పరిశ్రమ / ప్రాజెక్ట్
A: భారతదేశంలో పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి
B: భారతదేశంలో ఆధునిక వస్త్ర పరిశ్రమకు ఆది
C: భారతదేశంలో అత్యధిక ముడి మైకా ఉత్పత్తి రాష్ట్రం
D: భారతదేశంలో మొట్టమొదటి కర్మాగారం ప్రారంభమైన ప్రదేశం
రాష్ట్రం / ప్రదేశం
1: కర్ణాటక
2: సూరత్
3: ఆంధ్రప్రదేశ్
4: రిష్రా
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి.
a) A, C మరియు D మాత్రమే
b) A, B మరియు C మాత్రమే
c) C మరియు D మాత్రమే
d) A, B మరియు D మాత్రమే
Q6. కింది వాటిని జతపరచండి:
కరువు రకం
A: వాతావరణ సంబంధ కరువు
B: జల సంబంధ కరువు
C: వ్యవసాయ సంబంధ కరువు
హాని (వల్నరబిలిటీ) కారకం
1: నేల తేమను తక్కువగా కాపాడే సామర్థ్యం
2: పేలవమైన నీటి నిర్వహణ
3: అటవీ నిర్మూలన
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి.
a) A-3, B-1, C-2
b) A-3, B-2, C-1
c) A-2, B-3, C-1
d) A-1, B-2, C-3
Q7. కింది వాటిని జతపరచండి:
రకం
A: భూగర్భ విపత్తు
B: వాతావరన విపత్తు
C: జీవపరమైన విపత్తు
D: పారిశ్రామిక విపత్తు
విపత్తు
1: రసాయనిక, అణు
2: భూకంపం, సునామీ
3: తుఫాను, కరువు
4: అగ్నిప్రమాదం, బాంబు పేలుడు
5: అంటు వ్యాధులు, విష ఆహారం
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి.
a) A-3, B-4, C-2, D-1
b) A-2, B-5, C-3, D-4
c) A-3, B-2, C-5, D-4
d) A-2, B-3, C-5, D-1
తెలంగాణ జియోగ్రఫీ:
Q8. కింద పేర్కొనబడిన సాగునీటి పథకాలలో ఏవి అదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి?
A: చనాకా-కొరాటా ప్రాజెక్టు (నిర్మాణంలో ఉన్నది)
B: మత్తడి వాగు ప్రాజెక్టు
C: నీల్వాయి ప్రాజెక్టు
D: సదర్‌మత్ ప్రాజెక్టు
E: సాత్నాలా ప్రాజెక్టు
a) A, B మరియు C మాత్రమే
b) A, B, D మరియు E మాత్రమే
c) A, B మరియు E మాత్రమే
d) C, D మరియు E మాత్రమే
Q9. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ద్వారా తాగునీటి సప్లయ్ చేయబడని నగరాలు/పట్టణాలు
A: అదిలాబాద్
B: మంచిర్యాల
C: మెదక్
D: నిజామాబాద్
E: వరంగల్
a) B మరియు C మాత్రమే
b) A, B మరియు C మాత్రమే
c) A, B, C మరియు D మాత్రమే
d) C, D మరియు E మాత్రమే
Q10. కింది వివరణలను పరిశీలించండి:
A:తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం దాదాపు 150 అడుగుల ఎత్తుతో కడెం నది మీద ఉంది.
B: మల్లెల తీర్థం జలపాతం ప్రాణహిత నదిపై ఉంది.
C: కావేరి నదికి భీమా ఒక ఉపనది.
D: హైదరాబాద్ శివారులో గల వనస్థలిపురం వద్ద గల మహావీర్ వనస్థలి పార్కు జింకలకు ప్రసిధ్ధి చెందింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి.
a) B మరియు C మాత్రమే
b) A మరియు B మాత్రమే
c) C మరియు D మాత్రమే
d) A మరియు D మాత్రమే
Answers:
1. జవాబు: a
2. జవాబు: a
3. జవాబు: c
4. జవాబు: b
5. జవాబు: a
6. జవాబు: b
7. జవాబు: c
8. జవాబు: c
9. జవాబు: a
10. జవాబు: d

No comments