నవంబర్ 14: భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం, జాతీయ బాలల దినోత్సవం
నేడు జాతీయ బాలల దినోత్సవం: భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14ని జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. పిల్లల హక్కులు, సంరక్షణ మరియు విద్య గురించి అవగాహన పెంపొందిచడానికి దేశవ్యాప్తంగా పిల్లల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
- ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అని విశ్వసించిన బాలల స్నేహితుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు.
- మన దేశంలో 1957 నుంచి బాలల దినోత్సవాన్ని ఏటా నవంబర్ 14న జరుపుకుంటున్నాము.
- తనను కలిసేందుకు వచ్చే పిల్లలకు గులాబీని కానుకగా ఇచ్చే వారు.
- అందుకే ఆయన దేశ ప్రజల గుండెల్లో ముఖ్యంగా చిన్నారుల హృదయాల్లో ‘చాచా నెహ్రూ’గా నిలిచిపోయారు.
- 1889 నవంబర్ 14న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ పట్టణంలో జన్మించారు.
- ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ. తల్లి స్వరూపా రాణి.
- సోదరి విజయ లక్ష్మి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ.
- నెహ్రూ విద్యాభ్యాసం ఇంగ్లాండ్‌లోని బ్రిటీష్ పబ్లిక్ స్కూల్‌లో కొనసాగింది.
- 18 సంవత్సరాల వయసులో ఆయన కేం బ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీలో చదువుతుండగా కొదరు భారతీయ విద్యార్థులతో పరిచయం ఏర్పడింది. వారి ద్వారా ఆయన లాలా లజపతిరాయ్, గోపాలకృష్ణ గోఖలేల గురించి తెలుసుకున్నారు. వారి ద్వారానే భారతదేశంలో జరుగుతున్న సంస్కరణల గురించి తెలుసుకున్నారు.
- 1912 లో భారతదేశానికి తిరిగి వచ్చి అలహాబాద్ న్యాయస్థానంలో న్యాయ వృత్తి ప్రారంభించారు.
- 1916లో కమలాదేవితో వివాహం జరిగింది.
- 1916లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలలో ఆయన మహాత్మా గాంధీని మొట్టమొదటి సారి కలుసుకున్నారు.
- 1917లో ఇందిరా ప్రియదర్శిని జన్మించారు.
- 1919లో భారత జాతీయ కాంగ్రెస్‌లోకి ప్రవేశించారు.
- 1929లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడయ్యారు.
- భారతీయులను స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనేటట్లు ప్రోత్సహించడానికి ఆయన దేశమంతా పర్యటించారు.
- స్వాతంత్రోద్యమంలో భాగంగా 9సార్లు జైలుకు వెళ్లారు. జైలు జీవితంలో విశ్రాంతి తీసుకోకుండా తోటపని చేసేవారు. ఇతర నాయకులతో చర్చలు జరిపేవారు. చరిత్ర, సామాజిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం ఇలా అనేక విషయాలను అధ్యయనం చేశారు. ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకాన్ని రచించారు. తన అనుభవాలను, భావాలను వివరిస్తూ తన కుమార్తె ఇందిరకు ఉత్తరాల రూపంలో పంపారు.
- 1947 ఆగష్టు 14న అర్ధరాత్రి 12 గంటలకు భారత తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- 1947 నుండి 1964 వరకు 17 సంవత్సరాలపాటు భారత ప్రధానిగా కొనసాగారు.
- అలీనోద్యమానికి నాంది పలికారు. ఈ విధానం ద్వారా ప్రపంచానికి లభించే శాంతియుత సహజీవనం గురించి తెలియజేశారు.
- పంచశీలకు ప్రాణం పోసారు.
- పంచవర్ష ప్రణాళికలను రూపొందించారు.
- 1964 మే 26న తీవ్రమైన గుండె నొప్పితో కన్నుమూశారు.
రచనలు:
- ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకాన్ని జైళ్లోఉన్నప్పుడు రచించారు. దీనిలో ఆయన భారతదేశ చరిత్రను కీర్తించారు.
- తన అనుభవాలను, భావాలను వివరిస్తూ తన కుమార్తె ఇందిరకు ఉత్తరాల రూపంలో పంపారు. ఈ ఉత్తరాలను ‘లెటర్స్ ఫ్రమ్ ఎ ఫాదర్ టు హిజ్ డాటర్’ అనే పుస్తకంగా రూపొందించారు.

No comments