Breaking News

డెయిలీ క్విజ్ 25: ఇండియన్ పాలిటీ

daily-quiz-in-telugu-Indian-polity-25-telugumaterial.in

Q1. కింది వివరణ (వ్యాఖ్య)లలో సరియైనది/వి ఏది/వి?
A: సౌభ్రాతృత్వం అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక విలువ.
B: ఇది మౌలిక విలువ ఎందుకంటే భారత రాజ్యాంగపు పార్ట్-3లో స్పష్టంగా చెప్పబడింది.
C: ఇది మౌలిక విలువ కాదు ఎందుకంటే భారత రాజ్యాంగంలో చెప్పబడలేదు.
D: ఇది మౌలిక విలువ ఎందుకంటే భారత రాజ్యాంగం పీఠికలో ఒక భాగం మరియు భారత రాజ్యాంగం ప్రాధమిక వ్యవస్ధలో భాగంగా గుర్తించారు.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B మరియు D మాత్రమే
b) A మరియుB మాత్రమే
c) A మరియు D మాత్రమే
d) C మాత్రమే




Q2. కింది వాటిని జతపరచండి:




జాబితా-I
A: ఛార్టర్ యాక్ట్ – 1833
B: భారత ప్రభుత్వం యాక్ట్ – 1858
C: భారత ప్రభుత్వం యాక్ట్ – 1919
D: భారత ప్రభుత్వం యాక్ట్ – 1935




జాబితా-II
1: భారత దేశంలో బాధ్యతగల ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది
2: ఫెదరల్ (సమాఖ్య) ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది.
3: ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసింది.
4: ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా ఏర్పడింది.
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:
a) A-4, B-3, C-1, D-2
b) A-4, B-3, C-2, D-1
c) A-2, B-1, C-3, D-4
d) A-1, B-2, C-3, D-4




Q3. కింది రాజ్యాంగ సవరణలను కాలక్రమానుసారంగా అమర్చండి:
A: విద్యావకాశాలలో రిజర్వేషన్స్ కల్పించే అధికరణం15(4)ను ప్రవేశపెట్టడం.
B: ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ కల్పించే అధికరణం 16(4ఎ) ను ప్రవేశపెట్టడం.
C: రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ను ప్రవేశపెట్టడం.
D: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జె‌ఎసి) ని ప్రవేశపెట్టడం.
సరియైన క్రమాన్ని/జావాబును ఎంపిక చేయండి:
a) D, C, A, B
b) A, B, C, D
c) A, C, B, D
d) B, C, D, A




Q4. ‘సమాచార హక్కు చట్టం’ మొట్టమొదటిగా ఆమోదించిన రాష్ట్రాలు ఏవి?
a) తమిళనాడు మరియు గోవా
b) ఢిల్లీ మరియు హర్యానా
c) కర్నాటక మరియు కేరళ
d) రాజాస్ధాన్ మరియు మహారాష్ట్ర




Q5. పార్లమెంట్‌లో ‘క్వశ్చన్ అవర్’ కు సంబంధించి స్టార్డ్ క్వశ్చన్ (starred question) అనగా ఏమి?
a) ఉపప్రశ్నలు లేనటువంటిది
b) ముఖ్యమైన ప్రశ్న
c) రాతపూర్వక సమాధానం ఆశించినది
d) మౌఖిక సమాధానం ఆశించినది




Q6. సీనియారిటీ ప్రాతిపదికన కింది వారిలో ఎవరు మొదటి రాజ్యంగ అసెంబ్లీ మీటింగ్‌కు అధ్యక్షత వహించారు?
a) సచ్చిదానంద సిన్హా
b) డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్
c) రాజేంద్ర ప్రసాద్
d) వల్లభ్ భాయ్ పటేల్




Q7. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజి’ లో ఉండే సభ్యులు ఎవరు?
a) ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యులు
b) పార్లమెంట్ మరియు రాష్ట్ర ఉభయ సభల అందరు సభ్యులు
c) ఎన్నుకోబడిన పార్లమెంట్ మరియు రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు
d) పార్లమెంట్ సభ్యులు అందరు.




Q8. కింది జతలను పరిశీలించండి:
A: భారత పార్లమెంట్ – 1990 ఎస్‌సి/ఎస్టి దురాగతాల చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం
B: భారతదేశంలో దళిత – మహారాష్ట్ర పాంధర్స్ ఉద్యమంతో ప్రముఖంగా సంబంధం ఉన్న రాష్ట్రం
C: 1956 లో షెడ్యూల్డ్ – రిపబ్లికన్ కులాల ఫెడరేషన్ ఏ పార్టీ పార్టీలోకి మార్చబడింది.
D: భారత ప్రభుత్వ – మండల్ నియమించిన మొదటి కమిషన్ వెనుకబడిన తరగతుల కమిషన్
సరియైనవి కాని జతలను ఎంపిక చేయండి:
a) B మాత్రమే
b) A, B మరియు C మాత్రమే
c) A, C మరియు D మాత్రమే
d) A మరియు D మాత్రమే




Q9. కింది వివరణలను పరిశీలించండి:
A: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తాడు.
B: భారతదేశంలో కేంద్ర ప్రభుత్వపు ప్రధాన న్యాయ సలహాదారుణ్ని (అధికారిని) ‘సొలిసిటర్జనరల్’ అని వ్యవహరిస్తారు.
C: లోక్ అదాలత్ అనేది ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల సంస్ధ. అది చట్టబద్దమైనది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A మరియు C మాత్రమే
b) A, B మరియు C
c) A మరియు B మాత్రమే
d) B మరియు C మాత్రమే




Q10. కింది జతలను పరిశీలించండి:
A: 1989: భారతదేశంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగం ప్రారంభమైన సంవత్సరం.
B: 1909 : భారతదేశంలో జిల్లా కలెక్టర్ పదవిని ఏర్పాటు చేసిన సంవత్సరం
C: 32వ అధికరణం: భారత రాజ్యాంగానికి హృదయంగా, ఆత్మగా డా. బి. ఆర్. అంబేద్కర్ అభివర్ణించిన అధికరణం.
సరియైన జత(ల)ను ఎంపిక చేయండి:
a) C మాత్రమే
b) A మరియు B మాత్రమే
c) A మరియు C మాత్రమే
d) A, B మరియుC




Answers:




1. జవాబు: a
2. జవాబు: a
3. జవాబు: c
4. జవాబు: a
5. జవాబు: d
6. జవాబు: a
7. జవాబు: c
8. జవాబు: d
9. జవాబు: a
10. జవాబు: c

No comments