డెయిలీ క్విజ్ 16 : ఎకానమీ
Q1. యూరోపియన్ యూనియన్ ఏర్పాటు మూలంగా సభ్య దేశాలు ఏ అంశంలో అత్యధికంగా లాభపడ్డాయి?
a) విద్యకు నిధులు, వనరులు సమకూర్చటం వల్ల.
b) వర్తకం (వాణిజ్యం), ప్రయాణం అవరోధాలు తగ్గించటం.
c) ఉమ్మడి రక్షణ వ్యయాన్ని సమిష్టిగా భరించటం వల్ల.
d) ఉమ్మడి భాష ఉపయోగాన్ని సమిష్టిగా పెంపొందించటం వల్ల.
Q2. ఆదివాసీ ప్రజల సమగ్ర అభివృద్ధి మరియు సంక్షేమం కోసం భారత ప్రభుత్వం ‘వనబంధు కళ్యాణ్ యోజన’ అను పథకాన్ని ప్రవేశపెట్టింది. పైలెట్ ప్రాజెక్టు తరహాలో ఈ పథకాన్ని జిల్లాకు ఒక బ్లాక్ చొప్పున కింది ఏ రాష్ట్రాల్లో ప్రారంభించారు?
A: మధ్యప్రదేశ్
B: చత్తీస్‌ఘడ్
C: తమిళనాడు
D: తెలంగాణ
E: ఉత్తరప్రదేశ్
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) B, C, D మరియు E మాత్రమే
b) A, B మరియు D మాత్రమే
c) A, B మరియు E మాత్రమే
d) C, D మరియు E మాత్రమే
Q3. ప్రపంచ న్యాయ ప్రాజెక్టు యొక్క ‘న్యాయనియమావళి సూచిక 2017-18’ 113 దేశాలను అధ్యయనం చేసింది. దీని ప్రకారం భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకు ఎంత? మరియు సున్నా (0) నుంచి ఒకటి (1) మధ్యలో ఎంత స్కోరు సాధించింది?
a) 91వ ర్యాంకు మరియు 0.41 స్కోరు
b) 58వ ర్యాంకు మరియు 0.53 స్కోరు
c) 59వ ర్యాంకు మరియు 0.52 స్కోరు
d) 62వ ర్యాంకు మరియు 0.52 స్కోరు
Q4. కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
A: అంతర్జాతీయ ద్రవ్య నిధి తన జులై 2018 ప్రపంచ ఆర్థిక దృక్పథం (వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్)లో భారతదేశ వృద్ధి రేటు 2018లో 7.3%గా, 2019లో 7.5%గా ఉంటుందని అంచనా వేసింది.
B: ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (OECD) వారి అభివృద్ది కేంద్రం భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2018-19లో 7.4%గా, 2019-20లో 7.5%గా ఉంటుందని అంచనా వేసింది.
C: జనవరి 2018లో భారత ప్రభుత్వం విడుదల చేసిన ‘ఆర్థిక సర్వే’ ప్రకారం 2018-19 సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాలు 7.0-7.5 శాతం పరిధిలో ఉంటాయి.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B మరియు C
b) A మరియు B మాత్రమే
c) B మరియు C మాత్రమే
d) A మరియు C మాత్రమే
Q5. కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
A: ప్రధాన మంత్రి పంటల బీమా పధకం 2015లో ప్రారంభించబడింది.
B: ఆహార పంటలు (ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు), నూనెగింజలు, వార్షిక వాణిజ్య పంటలు/ఉద్యాన పంటలకు ఈ బీమా పధకం వరిస్తంది.
C: ఈ పధకాన్ని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B మరియు C
b) A మరియు B మాత్రమే
c) B మరియు C మాత్రమే
d) A మరియు C మాత్రమే
Q6. కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
A: భారతదేశ పరిధిలోని వాణిజ్య బ్యాంకుల నుండి భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకునే అప్పుపై చెల్లించే రేటును ‘రెపో రేటు’ అంటారు.
B: వాణిజ్య బ్యాంకులకు ఏమైనా నిధుల కొరత ఏర్పడినపుడు రిజర్వు బ్యాంకు ఇచ్చే అప్పుపై విధించే వడ్డీ రేటును ‘రివర్స్ రెపో రేటు’ అంటారు.
C: ఆగష్టు 1, 2018 నాడు రిజర్వు బ్యాంకు రెపో రేటును మరియు రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల చొప్పున వరుసగా 6.5% మరియు 6.25% కు పెంచింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) C మాత్రమే
b) A మరియు B మాత్రమే
c) B మరియు C మాత్రమే
d) A, B మరియు C
Q7. అర్ధశాస్త్రంలో 1998 నోబెల్ పురస్కారాన్ని భారతీయ ఆర్ధికవేత్త ఆచార్య ఆమర్త్య సేన్ కు బహుకరించారు. కింది గ్రంధాలలో అమర్త్య సేన్ (ఆంగ్లంలో) రచించినవి ఏవి?
A: ద ఐడియా ఆఫ్ జస్టిస్
B: ఎస్సేస్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ సమ్ రెమినిసెన్సెస్
C: ద ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్
D: ద కంట్రీ ఆఫ్ ఫస్ట్ బోయిస్: అండ్ అదర్ ఎస్సేస్
E: వేస్ట్ ఆఫ్ ఏ నేషన్:గ్రోత్ అండ్ గార్బేజ్ ఇన్ ఇండియా
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) B, C మరియు E మాత్రమే
b) A, B D మరియు E మాత్రమే
c) A, C మరియు D మాత్రమే
d) C మరియు E మాత్రమే
Q8. డాక్టర్ ఎన్.సి. సక్సేనా కమిటీపై కింది వివరణలను పరిశీలించండి:
A: 2008 అక్టోబరు 2న భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ డాక్టర్ ఎన్.సి. సక్సేనా కమిటీని నియమించింది.
B: ఆ కమిటీ తన రిపోర్టును 2009 ఆగస్టు 21న సమర్పించింది.
C: బి.పి.ఎల్. జాబితా నుండి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్‌గా మినహాయించడానికి మోటారు వాహనాలు యాంత్రిక వ్యవసాయ సామాగ్రి కలిగి వుండటాన్ని ఒక ప్రామాణికంగా ఈ కమిటీ సూచించింది.
D: బి. ఎపి. ఎల్. జాబితాలోకి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్‌గా చేర్చుకోవడానికి కమిటీ చేసిన సిఫార్సులలో ఒకటి ఏమిటంటే ‘ఒంటరి మహిళలు నేతృత్వం వహించే గృహాల’ ను ఆటోమేటిక్‌గా చేర్చుకోవాలి.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A మరియు D మాత్రమే
b) A, B మరియు C మాత్రమే
c) B, C మరియు D మాత్రమే
d) A, C D మాత్రమే
Q9. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రణాళికా సంఘం కింది వాటిలో ఒక లక్షణం దృష్ట్యా వెనుకబడిన దేశంను నిర్వచించింది. అది ఏమిటి?
a) అల్ప ఎగుమతులు, అధిక దిగుమతులు కలిసి ఉండటం.
b) మానవ వనరుల అనుపయోగిత లేదా అల్ప ఉపయోగితా మరియు శోధింపబడని సహజ వనరులు కలిసి ఉండడం.
c) పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు కలిసి ఉండటం.
d) అవస్ధాపనా సౌకర్యాలు అధికంగా అభివృద్ధి చెంది ఉండటం మరియు పేదరికం, నిరుద్యోగిత కలసి ఉండటం.
Q10. జాతీయాదాయ విశ్లేషణలో భాగంగా, వైయక్తిక ఆదాయంలో ఇమిడి ఉండే అంశాలు కింది వాటిలో ఏవి?
A: ప్రత్యక్ష పన్నులు
B: పరోక్ష పన్నులు
C: తరుగుదల
D: బదిలీ చెల్లింపులు
E: ఎగుమతులు, దిగుమతులు
F: మధ్యంతర వస్తువులు
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, C, E మరియు F మాత్రమే
b) A, B మరియు C మాత్రమే
c) B, D మరియు E మాత్రమే
d) A మరియు D మాత్రమే
Answers & Explanations:
1. జవాబు: b
2. జవాబు: b
3. జవాబు: d
4. జవాబు: a
5. జవాబు: c
6. జవాబు: a
7. జవాబు: c
8. జవాబు: c
9. జవాబు: b
10. జవాబు: d

No comments