డెయిలీ క్విజ్ 17: హిస్టరీ
Q1. కింది వివరణలను పరిశీలించండి:
A: బెనారస్‌లో ‘ఇండియన్ అసోసియేషన్’ స్ధాపించబడింది.
B: ‘డక్కా అనుశీలన్ సమితి’ ని 2009లో నెలకొల్పారు.
C: దాదాబాయి నౌరోజీచే ‘ఈస్ట్-ఇండియా అసోసియేషన్’ ఏర్పాటు చేయబడింది.
D: కీ.శ. 1782లో సల్‌బాయ్ సంధి జరిగింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, C మరియుD మాత్రమే
b) A మరియు B మాత్రమే
c) B మరియు C మాత్రమే
d) C మరియు D మాత్రమే
Q2. అఖిల భారత మహిళా సమావేశం (AIWC) గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి:
A: ఈ కాన్ఫరెన్స్ పూనాలో జనవరి 1927లో ఆవిర్బవించింది.
B: కలకత్తాలోని బెధునె కాలేజీ(Bethune College)లో పాఠాలు చెప్పే ఎ.ఎల్. హ్యుడెకోపర్ దీనిని స్ధాపించారు.
C: మహిళా విద్యాభివృద్ధికి పాటుపడటానికి ఇది కృషి చేస్తుంది.
D: 1932లో మహిళల కోసం హూమ్ సైన్స్ విద్యా పరిశోధన మరియు అధ్యాపకుల శిక్షణ కోసం లేడీ ఇర్విన్ కాలేజీ అనే మహిళా కాలేజీని ఈ సంస్ధ 1932లో ఢిల్లీలో ఏర్పాటు చేసింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) C మరియు D మాత్రమే
b) A, B మరియు C మాత్రమే
c) B మరియు D మాత్రమే
d) A, C మరియు D మాత్రమే
Q3. కింది వివరణలను పరిశీలించండి:
A: భారతదేశంలో దాదాపు అన్ని జౌళి మిల్లులు కలకత్తా సమీపంలో కేంద్రీకృతమై ఉండినవి.
B: నీలం మందు కర్మాగారాలను బ్రిటీష్ ప్రభుత్వం అస్సాంలో స్ధాపించింది.
C: 1860లో కాన్పూర్‌లో ప్రభుత్వ చర్మ కర్మాగారం స్ధాపించబడింది.
D: 1907లో ఇనుము-ఉక్కు పరిశ్రమ సాక్షిలో స్ధాపించబడింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, C మరియు D మాత్రమే
b) A, B మరియు C మాత్రమే
c) C మరియు D మాత్రమే
d) A, B మరియు D మాత్రమే
Q4. కింది వాటిని జతపరచండి:
జాబితా-I
A: ఒబెదుల్లా
B: బర్కతుల్లా
C: మదాం కామా
D: లాలా హర్‌దయాళ్
జాబితా-II
1: ఫ్రాన్స్
2: జెనీవా
3: జర్మనీ
4: ఆఫ్ఘనిస్ధాన్
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:
a) A-4, B-3, C-1, D-2
b) A-3, B-1, C-2, D-4
c) A-1, B-2, C-3, D-4
d) A-2, B-4, C-3, D-1
Q5. కింది జతలను జతపరచండి:
రచయిత గ్రంధం
A: విలియం హింటర్ - ఇండియన్ ముసల్మాన్‌లు
B: రాజా రామ్‌మోహన్ రాయ్ - గిఫ్ట్ టు మోనోధీయిస్ట్ (పర్షియన్ భాషలో)
C: ఎ.ఎల్. భాషం - ఇండియా ఆఫ్టర్ గాంధీ
D: రామచంద్ర గుహా - వ వండర్ దట్ వాజ్ ఇండియా
సరియైనవి కాని జతలను ఎంపిక చేయండి:
a) B, C మరియు D మాత్రమే
b)C మరియు D మాత్రమే
c)A మరియు B మాత్రమే
d)A, B మరియు D మాత్రమే
Q6. కింద ఇచ్చిన సంఘటనలను అధిరోహణ క్రమంలో వాటి ప్రారంభం, లేక జరిగిన సంవత్సరాన్ని బట్టి అమర్చండి:
A: కమ్యూనల్ అవార్డ్
B: మీరట్ కుట్ర కేసు
C: వైకోం సత్యాగ్రహం
D: గురవాయూర్ సత్యాగ్రహం
సరియైన క్రమాన్ని/జవాబును ఎంపిక చేయండి:
a) C, B, D, A
b) A, C, B, D
c) B, A, C, D
d) D, B, A, C
Q7. కింది వివరణరలను పరిశీలించండి:
A: శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, పండితుడైన డా. అఘోరనాధ చట్టోపాధ్యాయ నిజాం పాలిత రాజ్యంలో స్వాతంత్ర్య పోరాట పితామహుడు పరిగణించబడినాడు.
B: అంగ్ల విద్య ప్రారంభం, ఈయన హైదరాబాద్ కళాశాల (తదుపరి నిజాం కళాశాలగా పేరు మార్చబడింది) ప్రధమ ప్రధానాచార్యుడు కావడం, ఈయన చేపట్టిన సాంఘిక ససంస్కరణలు, బ్రిటీష్ వ్యతిరేక స్వాతంత్ర పోరాటానికి సరైన వాతావరణాన్ని కల్పించాయి.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) B మాత్రమే సరియైనది
b) A మరియు B రెండూ సరియైనవి
c) A మరియు B రెండూ సరియైనవి కావు
d) A మాత్రమే సరియైనది
Q8. కింది వివరణలను పరిశీలించండి:
A: బ్రిటీష్ పాలనలో దేశ ఆర్ధిక బీదరికానికి సంపద తరలింపు సిద్దాంతం మూల కారణంగా భావించబడుతుంది.
B: భారతదేశ ముడిపదార్ధాలను ఇంగ్లాండ్‌కు ఎగుమతి చేయడం, బ్రిటన్‌లో తయారైన వస్తువులను ఇండియాకు దిగుమతి చేయడం, భారతదేశంలోని ఆంగ్లేయాధికారుల పొదుపు మొత్తాలను ఇంగ్లాండ్‌కు పంపడం, ఇవన్నీ భారతదేశ సంపద తరలింపుకు దారితీశాయి.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A మరియు B రెండూ సరియైనవి కావు
b) A మాత్రమే సరియైనది
c) B మాత్రమే సరియైనది
d) A మరియు B రెండూ సరియైనవి
Q9. కింది వాటిని జతపరచండి:
జాబితా-I
A: కేసరి
B: వివేకవర్దిని
C: స్వరాజ్య పత్రిక
D: అమృత బజార్ పత్రిక
జాబితా-II
1: గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు
2: శిశిర కుమార్ ఘోష్
3: తిలక్
4: కందుకూరి వీరేశలింగం
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:
a) A-2, B-1, C-3, D-4
b) A-4, B-2, C-1, D-3
c) A-1, B-3, C-2, D-4
d) A-3, B-4, C-1, D-2
Q10. కింది వాటిని జతపరచండి:
జాబితా-I
A: శాసన సభ్యలకు బడ్జెట్‌పై చర్చించేందుకు పరిపాలనాంశాల మీద ప్రశ్నించే అధికారం ఇవ్వబడింది.
B: మతపరమైన నియోజకవర్గాల ఏర్పాటు
C: రాష్ట్రాల్లో ద్వంద్వప్రభుత్వం
D: సమాఖ్య ప్రభుత్వం
జాబితా-II
1: 1935 చట్టం
2: 1892 కౌన్శిళ్ళ చట్టం
3: 1919 చట్టం
4: 1909 చట్టం
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:
a) A-2, B-4, C-3, D-1
b) A-4, B-3, C-2, D-1
c) A-1, B-4, C-3, D-2
d) A-3, B-2, C-4, D-1
Answers:
1. జవాబు: d
2. జవాబు: d
3. జవాబు: a
4. జవాబు: a
5. జవాబు: b
6. జవాబు: a
7. జవాబు: b
8. జవాబు: d
9. జవాబు: d
10. జవాబు: a

No comments