Breaking News

డెయిలీ క్విజ్ 19: ఇండియన్ పాలిటీ

daily-quiz-in-telugu-Indian-polity-19-telugumaterial.in


Q1. భారతదేశ సుప్రీం కోర్టుకు సంబంధించి కింది వివరణలలో ఏది సరియైనది కాదు?
a) ఇది కోర్టు మార్షల్ మినహాయించి ఏదైనా కోర్టు లేదా ట్రిబ్యునల్స్ నుండి వాదనలు వినవచ్చు.
b) దీనిని 1950 లో స్ధాపించారు.
c) ఇది దేశంలో అత్యున్నత అప్పీల్ గల న్యాయస్ధానం.
d) ఇది ఏదైనకోర్టు లేదా ట్రిబ్యునల్స్ అలాగే కోర్టు మార్షల్ నుండి వాదనలు వినవచ్చు.




Q2. శాసన మండలి సభ్యులు ఎన్నుకోబడే విధానం ఏది?
A: ప్రత్యక్ష ఎన్నిక ద్వారా
B: పరోక్ష ఎన్నిక ద్వారా
C: నియామకం ద్వారా
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A మరియు B మాత్రమే
b) A, B మరియు C
c) A మరియు C మాత్రమే
d) B మరియు C మాత్రమే




Q3. 73వ రాజ్యాంగ సవరణ అధికరణానికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
A: పంచాయితీలలో మహిళలకు రిజర్వేషన్లు
B: నిర్జీత గడువుకు ముందే పంచాయితీలను రద్దు చేయకూడదు.
C: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాల కొకసారి ఫైనాన్స్ కమిషన్‌ను నియమిస్తుంది.
D: ఆర్ధిక అభివృద్దికై మరియు సామాజిక న్యాయం కోసం ప్రణాళికలు రూపొందించేటట్లు పంచాయితీలను పరిపుష్టి చేయడం.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, C మరియు D మాత్రమే
b) A మరియుB మాత్రమే
c) C మరియు D మాత్రమే
d) A, B మరియు C మాత్రమే




Q4. రాజ్యాంగంలోని కింది నిబంధనలలో ఏది నవంబరు 26, 1949 నుండి అమలులోకి వచ్చింది?
A: పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు
B: ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు
C: తాత్కాలిక పార్లమెంటుకు సంబంధించిన నిబంధనలు
D: ప్రాధమిక హక్కులు
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) B మరియు D మాత్రమే
b) A మరియుC మాత్రమే
c) A, C మరియు D మాత్రమే
d) A, B మరియు C మాత్రమే




Q5. కింది పదవులలో దేనితో ప్రధాన మంత్రి పదవిని పోల్చి చూడవచ్చు?
A: క్యాబినెట్ అధినేత
B: విదేశీ సంబంధాల విషయాలపై ముఖ్య ప్రతినిధి
C: రాజ్య అధిపతి
D: పార్లమెంట్ నాయకుడు
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B మరియు D మాత్రమే
b) A మరియుC మాత్రమే
c) C మరియు D మాత్రమే
d) A, B మరియు C మాత్రమే




Q6. కింది వ్యాఖ్యలను పరిశీలించండి;
A: రాష్ట్ర పరిధి దాటి గవర్నర్ చేసే అధికార పర్యటనల గురించి భారత గృహ మంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది.
B: ఇప్పుడు గవర్నర్లు పర్యటనల విషయమై రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి మరియు పర్యటనలు ఒక సంవత్సరంలో 73 రోజుల కన్నా మించకూడదు.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A మరియు B రెండూ సరియైనవి కావు
b) A మాత్రమే సరియైనది
c) B మాత్రమే సరియైనది
d) A మరియు B రెండూ సరియైనవి




Q7. భారత రాజ్యాంగ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఎవరిని రాజ్యాంగం పనితనాన్ని సమీక్షంచడానికి జాతీయ కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించింది?
a) జస్టిస్ కె. పున్నయ్య
b) జస్టిస్ బి. పి. జీవన్ రెడ్డి
c) జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య
d) జస్టిస్ ఆర్.ఎస్. సర్కారియా




Q8. భారత రాజ్యాంగం పాక్షిక సమాఖ్య (క్వాజిఫెడరల్), ఎందుకుంటే:
A: ఇది కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు ఎగ్జిక్యుటివ్ అధికారాల పంపిణీని కల్పిస్తుంది.
B: ఇది ప్రతి రాష్ట్రానికి శాసన సభను మరియు కేంద్రంలో పార్లమెంట్ ను కల్పిస్తుంది.
C: ఇది కేంద్రంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండే ద్వంద్వ శాసన సభను కలిగి ఉంటుంది.
D: ఇది అధికరణం 3లో సమాఖ్య తరహా రాష్ట్రం గురించి రాజ్యాంగంలో వివరిస్తూ ఇండియా ఒక రాష్ట్రాల సమాఖ్యగ చెప్తుంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) B, C మరియు D మాత్రమే
b) A, B మరియు C మాత్రమే
c) A, C మరియు D మాత్రమే
d) A, B మరియు D మాత్రమే




Q9. పౌరసత్వ (సవరణ) చట్టం 2015, భారతీయ మూలానికి చెందిన కొన్ని వర్గాల వ్యక్తులకు ఒక కొత్త రకం పౌరసత్వాన్ని ప్రవేశపెట్టింది. దానిని అధికారికంగా ఏమంటారు?
a) ఇండియన్ ఆరిజిన్ సిటిజెన్ అబ్రాడ్
b) ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్ట్ హూల్డర్
c) నాన్ రెసిడెంట్ ఇండియన్ సిటిజెన్
d) ఇండియన్ సిటిజెన్ ఒవర్సీస్




Q10. కింది వాటిని జతపరచండి:
జాబితా-I
A: ఆనందం యొక్క సిద్దాంతం
B: నివారణ పిటిషన్
C: ప్రివిలేజెస్
D: పర్యవేక్షక అధికార పరిధి




జాబితా-II
1: శాసన సభ
2: సుప్రీం కోర్ట్
3: హైకోర్ట్
4: ఎగ్జిక్యూటివ్
సరియైన క్రమాన్ని/జవాబును ఎంపిక చేయండి:
a) A-3, B-4, C-1, D-2
b) A-1, B-2, C-3, D-4
c) A-2, B-1, C-4, D-3
d) A-4, B-2, C-1, D-3




Answers:

1. జవాబు: a
2. జవాబు: d
3. జవాబు: d
4. జవాబు: d
5. జవాబు: a
6. జవాబు: d
7. జవాబు: c
8. జవాబు: b
9. జవాబు: b
10. జవాబు: c

No comments