డెయిలీ క్విజ్ 20: జియోగ్రఫీ
Q1. ఉదయపూర్‌లోని జవార్ గనులు వీటికి ప్రసిద్ధి :
a) బంగారం
b) అభ్రకం
c) బొగ్గు
d) జింకు
Q2. కింది వాటిని జతపరచండి :
జాబితా-I (నది అంతర మైదానం)
a: బిస్ట్
b: బారి
c: చజ్
d: రేచ్నా
జాబితా-II (నదులు)
i: రావి మరియు చినాబ్
ii: చినాబ్ మరియు జీలం
iii: బియాస్ మరియు రావి
iv: బియాస్ మరియు సట్లెజ్
సరియైన జవాబును/జతలను ఎంపిక చేయండి :
a) a-i, b-iii, c-iv, d-ii
b) a-iv, b-I, c-ii, d-iii
c) a-i, b-ii, c-iii, d-iv
d) a-iv, b-iii, c-ii, d-i
Q3. ప్రతిపాదన (A): బసాల్ట్ శిలల శైధిల్యం వల్ల నల్లరేగడి భూములేర్పడినాయి.
కారణం (R): నల్లరేగడి భూములు అధిక తేమను నిలుపుకోగల సామర్ధ్యం గలవి.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) (A) మరియు (R) రెండూ ఒప్పు మరియు (R) అనేది (A) కు సరియైన వివరణ.
b) (A) మరియు (R) రెండూ ఒప్పుకాని (R) అనేది (A) కు సరియైన వివరణ కాదు.
c) () అనేది ఒప్పు మరియు () అనేది తప్పు
d) (A) అనేది తప్పు కాని (R) అనేది ఒప్పు.
Q4. భారతదేశంలో చెరుకు ఉత్పత్తిలో ప్రధమ మరియు ద్వితీయ స్ధానాలలోనున్న రాష్ట్రాలు :
a) ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర
b) ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్ర
c) మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్
d) మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్
Q5. కింది వివరణలను చదవండి:
a: శీతాకాలంలో పశ్చిమ ఆటంకాల వల్ల ఉత్తర భారతదేశానికి వర్షపాతం చేకూరుతుంది.
b: ఈశాన్య ఋతుపవనాలు తమిళనాడుకు వర్షపాతాన్నిస్తాయి.
c: భారతదేశానికి ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం లభిస్తుంది.
వీటిలో సరియైన వివరణలు ఏవి?
a) a మరియు b మాత్రమే
b) b మరియు c మాత్రమే
c) a మరియు c మాత్రమే
d) a, b మరియు c
Q6. ప్రతిపాదన (A): భారతదేశ పశ్చిమ తీర మైదానాలలో డెల్టా ఏర్పడడం అగుపించదు.
కారణం (R) : భారతదేశ పశ్చిమ తీర మైదానాలు తూర్పుతీర మైదానాలకంటె ఎక్కువ విస్తృతమైనవి.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) (A) మరియు (R) రెండూ ఒప్పు మరియు (R) అనేది (A) కు సరియైన వివరణ
b) (A) మరియు (R) రెండూ ఒప్పు కాని (R) అనేది (A) కు సరియైన వివరణ కాదు.
c) (A) అనేది ఒప్పు మరియు (R) అనేది తప్పు.
d) (A) అనేది తప్పు కాని (R) అనేది ఒప్పు.
Q7. వెంబానడ్ సరస్సు ఉన్నచోటు:
a) మలబార్ తీరం
b) కోరమండల్ తీరం
c) కొంకన్ తీరం
d) ఉత్కల్ తీరం
Q8. కింది వాటిని జతపరచండి:
జాబితా-I
a: ఎట్నా పర్వతం
b: అరావళి
c: హిమాలయాలు
d: ఓస్టెస్
జాబితా-II
i: బ్లాక్ పర్వతం
ii: యువ ముడత పర్వతం
iii: పాత ముడత పర్వతం
iv: అగ్ని పర్వతం
a) a-i, b-iii, c-iv, d-ii
b) a-ii, b-iv, c-iii, d-i
c) a-I, b-ii, c-iii, d-iv
d) a-iv, b-iii, c-ii, d-i
Q9. ప్రతిపాదన (A) : ముంబాయి దగ్గరగా నున్నపూణె ముంబాయి కంటె తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది.
కారణం (R) పూణె పశ్చిమ కనుమలకు పవన పరాజ్ముఖం వైపు ఉంది. అట్లాగె ముంబాయి పశ్చిమ కనుమలకు పవన అభిముఖంగా ఉంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) (A) మరియు (R) రెండూ ఒప్పు మరియు (R) అనేది (A) కు సరియైన వివరణ.
b) (A) మరియు (R) రెండూ ఒప్పు కాని (R) అనేది (A) కు సరియైన వివరణ కాదు.
c) (A) అనేది ఒప్పు మరియు (R) అనేది తప్పు
d) (A) అనేది తప్పు కాని (R) అనేది ఒప్పు.
Q10. కింది జతలనుండి సమాధానాన్ని కనుగొనండి:
a: బాబుల్ - ముండ్ల అడవులు
b: వేప - సతత హరితారణ్యాలు
c: పైన్ - ఉష్ణమండలపు అడవులు
d: టేకు - ఆకురాల్చు అడవులు
కింది జతలనుండి సరియైన సమాధానాన్ని కనుగొనండి :
a) a మరియు b మాత్రమే
b) a మరియు c మాత్రమే
c) b మరియు c మాత్రమే
d) a మరియు d మాత్రమే
Answers:
1. జవాబు: d
2. జవాబు: d
3. జవాబు: b
4. జవాబు: b
5. జవాబు: a
6. జవాబు: c
7. జవాబు: a
8. జవాబు: d
9. జవాబు: a
10. జవాబు: d

No comments