డెయిలీ క్విజ్ 24: హిస్టరీ & కల్చర్
1. క్రింద గల ఢిల్లీ సుల్తానుల వంశ క్రమమును తెల్పుము :
a: తుగ్లక్
b: బానిస వంశస్తులు
c: ఖిల్జీలు
d: లోడి సుల్తానులు
e: సయ్యదులు
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) c, a, b , e, d
b) e, b, d, a, c
c) a, b, c, d, e
d) b, c, a, e, d
2. భారతీయ వీణ మరియు ఇరానియన్ తంబురాలను మేళవించి తయారు చేసిన సంగీత వాయిద్యమేది?
a) గిటార్
b) వయోలిన్
c) సితార్
d) మాండొలిన్
3. 1928 లో జరిగిన బర్దోలి సత్యాగ్రహానికి సంబంధము లేని దానిని గుర్తించుము :
a) అది నీలిమందు తోటల బ్రిటిషు యజమానులకు వ్యతిరేకము.
b) అది వడ్డీవ్యాపారులకు వ్యతిరేకంగా జరిగింది.
c) అది రైతులకు కౌలుహక్కులు సంపాదించడానికి జరిగింది.
d) అది బొంబాయి ప్రభుత్వ 22% భూమిశిస్తు అధికంగా విధింపుకు వ్యతిరేకంగా కొనసాగినది.
4. క్రింది వాటిని జతపరుచుము :
వరుస-I
a: కల్హణ
b: బాణభట్ట
c: కౌటిల్య
d: విష్ణు శర్మ
వరుస-II
i: హర్ష చరిత
ii: పంచతంత్ర
iii: రాజ తరంగిణి
iv: అర్ధ శాస్త్ర
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a-ii, b-i, c-iv, d-iii
b) a-i, b-iv, c-ii, d-iii
c) a-iii, b-i, c-iv, d-ii
d) a-iii, b-ii, c-i, d-iv
5. క్రింది వాటిని జతపరచుము:
మహాజనపదాలు
a: మగధ
b: కోసల
c: అవంతి
d: వత్స
ముఖ్యపట్టణాలు
i: మాహిష్మతి
ii: గిరివ్రజ
iii: శ్రావస్తి
iv: కౌసాంబి
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a-ii, b-iii, c-i, d-iv
b) a-ii, b-i, c-iv, d-iii
c) a-ii, b-iv, c-iii, d-i
d) a-iv, b-ii, c-i, d-iii
6. ఈ క్రింది చైనా బౌద్ధ యాత్రికుల ఇండియా పర్యటనను కాలానుక్రమంగా అమర్చుము :
a: హుయాన్ సాంగ్
b: వాంగ్ హ్యయన్ సే
c: ఇత్సింగ్
d: ఫాహియాన్
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a, c, b, d
b) c, b, d, a
c) d, a, b, c
d) b, d, a, c
7. క్రింద గల రాజవంశాలు అందులోని ప్రసిద్ధ రాజులను జతపరచుము :
వరుస-I
a: ప్రతిహారులు
b: పాల
c: రాష్ట్రకూటులు
d: పారమారులు
e: సోలంకులు
వరుస-II
i: భీమ I
ii: కృష్ణ I
iii: మిహిర భోజ
iv: సియక II
v: గోపాల
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a-i, b-v, c-ii, d-iii, e-iv
b) a-iii, b-v, c-ii, d-iv, e-i
c) a-iii, b-v, c-iv, d-i, e-ii
d) a-i, b-v, c-iv, d-ii, e-iii
8. క్రింద తెలుపబడిన రాజులు, వారిచే వ్రాయబడిన రచనలలో సరిగ్గా జతపరచపడినది ఏది?
a) కృష్ణదేవరాయలు - సమరాంగణ సూత్రధార
b) మహేంద్ర వర్మ -మత్తవిలాస ప్రహసన
c) భోజ దేవ - మానసోల్లాస
d) సోమేశ్వర - ఆముక్తమాల్యద
9. క్రింది ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఎవరు భారత జాతీయ కాంగెసుకు చాల కాలం పాటు కోశాధికారిగా పనిజేసిరి?
a) జి. డి. బిర్లా
b) జమాన్‌లాల్ బజాజ్
c) జె. ఆర్. డి. టాటా
d) డబ్ల్యు. హిరాచంద్
10. భారత స్వాతంత్ర్య సమర సమయంలో సుభాస్ చంద్ర బోస్ స్ధాపించిన సైన్యము :
a) రెవల్యూషనరీ పీపుల్స్ ఆర్మీ
b) యంగ్ ఇండియా ఆర్మీ
c) ప్రొగ్రెసివ్ పీపుల్స్ ఆర్మీ
d) ఇండియన్ నేషనల్ ఆర్మీ
Answers:
1. జవాబు: d
2. జవాబు: c
3. జవాబు: a
4. జవాబు: c
5. జవాబు: a
6. జవాబు: c
7. జవాబు: b
8. జవాబు: b
9. జవాబు: b
10. జవాబు: d

No comments