డెయిలీ క్విజ్ 28: వ్యాపార గణితం
Q1. చక్రీయ చతుర్భుజం ABCD లో ∠ABC = 47°, ∠BCD = 97° అయితే ∠ADC - ∠BAD =
a) 40°
b) 50°
c) 60°
d) 70°
Q2. 3 : 4 : 5 నిష్పత్తిలో భుజములు గల మూడు ఘనములను కరిగించి, 24√3 సెం.మీ. కర్ణం గల ఒక ఘనముగా తయారు చేయబడినది. అప్పుడు, మొదటి ఇచ్చిన ఘనముల భుజములు : (సెం. మీ. లలో)
a) 12, 16, 20
b) 9, 12, 15
c) 13.5, 18.0, 22.5
d) 15, 20, 25
Q3. రూ. 78,400 ముగ్గురు వ్యక్తులు A, B, Cలకు, నిష్పత్తులు A : B = 5 : 4 మరియు B : C = 6 : 11 లలో పచ బడినది. అప్పుడు, Cకి వచ్చిన వంతు (రూపాయిలలో):
a) 31,200
b) 34,000
c) 35,200
d) 36,200
Q4. ఒక కారు ఒక ప్రయాణాన్ని ఏడు గంటల్లో పూర్తిచేసెను. అది మొదటి సగం దూరాన్ని గంటకు 40 కి. మీ. వేగంతోనూ, మిగిలిన సగం దూరాన్ని గంటకు 60 కి. మీ. వేగంతోనూ పూర్తి చేసెను. అప్పుడు, ప్రయాణించిన మొత్తం దూరం (కి. మీ. లలో) :
a) 280
b) 300
c) 336
d) 420
జాబితా-I
a: a1 - a4
b: 2a2 - a5
c: 5a3 - 4a1
జాబితా-II
i: 1
ii: 1/3
iii: 1/8
iv: 1/2
సరియైన జోడి :
a) a-ii, b-i, c - iv
b) a-iii, b-i, c - iv
c) a-iii, b-ii, c - i
d) a-i, b-iv, c - iii
Q6. 11 మంది సభ్యులున్న ఒక క్రికెట్ బృందపు కెప్టెన్ వయస్సు 26 ఏళ్లు, వాళ్ళ వికెట్ కీపర్ వయస్సు అతని వయస్సు కంటె 3 సంవత్సరాలు ఎక్కువ. మొత్తం బృందపు సరాసరి వయస్సు కంటె మిగిలిన 9 మంది సభ్యుల సరాసరి వయస్సు ఒక సంవత్సరం తక్కువ అయితే ఆ మొత్తం బృందపు సరాసరి వయస్సు:
a) 22 సంవత్సరాలు
b) 23 సంవత్సరాలు
c) 25 సంవత్సరాలు
d) 24 సంవత్సరాలు
Q7. A అనే వ్యక్తి B కి 2 సంవత్సరాలకు రూ. 5,000 లనూ, C కి 4సంవత్సరాలకు రూ. 3,000 లనూ ఒకే రేటుకి సాధారణ వడ్డీకి అప్పు ఇచ్చాడు. అతనికి వచ్చిన మొత్తం వడ్డి రూ. 2,200 అయితే సంవత్సరానికి ఆ వడ్డీ రేటు :
a) 10%
b) 8%
c) 7%
d) 6%
Q8. ఒక వ్యక్తి 24 కి. మీ. దూరాన్ని కాలినడకన ప్రయాణించడానికి బయలుదేరిన ఒక గంట 40 నిమిషాల తరువాత గమనించినదేమంటే అతను ప్రయాణించిన దూరం మిలిలిన దూరంలో 5/7వ వంతు అని. అతని నడక వేగం :
a) 4 కి. మీ. / గం.
b) 5 కి. మీ. / గం.
c) 6 కి. మీ./గం.
d) 8 కి. మీ. /గం.
Q9. A, B లు ఒక పనిని రూ. 6,000 లకు చేయడానికి ఒప్పందం కుదుర్చుకొనిరి. A, B లు విడివిడిగా ఆ పనిని వరుసగా 6, 8 రోజుల్లో చేయగలరు. C సయాయంతో ఆ పనిని 3 రోజుల్లోనే పూర్తిచేసిరి. అప్పుడు B వాటా :
a) రూ. 2,400
b) రూ. 2,250
c) రూ. 2,000
d) రూ. 1,500
Q10. రెండు వస్తువులు ఒక్కొక్కటి రూ. 990 కి అమ్మిన ఒక వర్తకునికి ఒకదానిపై 10% లాభం రాగా, మరొక దానిపై 10% నష్టం వచ్చింది. ఈ లావాదేవీలో వర్తకునకు వచ్చిన ఫలితం :
a) 1 నష్టం
b) 1% లాభం
c) నష్టము లేదు, లాభమూ లేదు
d) 2% నష్టం
Answers:
1. జవాబు: b
2. జవాబు: a
3. జవాబు: c
4. జవాబు: c
5. జవాబు: b
6. జవాబు: b
7. జవాబు: a
8. జవాబు: c
9. జవాబు: b
10. జవాబు: a


No comments