డెయిలీ క్విజ్ 29: ఇండియన్ పాలిటీ
Q1. కింద ఇవ్వబడిన భారతదేశపు అటర్నీ జనరల్స్‌ను కాలక్రమానుసారం అమర్చండి:
A: ముకుల్ రోహత్గి
B: సోలి సొరాబ్జీ
C: అశోక్ దేశాయి
D: జి. ఇ. వాహనవతి
E: కె. కె. వేణుగోపాల్
సరియైన క్రమాన్ని/జవాబునుఎంపిక చేయండి:
a) E, A, D, B మరియు C
b) A, C, D, B మరియు E
c) C, B, D, A మరియుE
d) B, E, C, A మరియు D
Q2. కింది జతలలో ఏవి సరియైనవి?
A: అంతర్గత ఎమర్జెన్సీ విధించినసంవత్సరం - 1973
B: 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణలు పార్లమెంట్‌లో ఆమోదించబడిన సంవత్సరం – 1993
C: కేంద్ర – రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి సర్కారియా కమిషన్ నియమింపబడిన్ సంవత్సరం – 1983
సరియైన జతలను ఎంపిక చేయండి:
a) B మరియు C మాత్రమే
b) A, B మరియు C
c) A మరియు B మాత్రమే
d) A మరియు C మాత్రమే
Q3. భారత రాజ్యాంగ పీఠికకు సంబంధించిన కింది వివరణలను పరిశీలించండి:
A: లక్ష్యాలు, ఆశయాల తీర్మానంపై భారత రాజ్యాంగ పీఠిక ఆధారపడింది.
B: భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం రాజ్యాంగం తన అధికారాన్ని భారత ప్రజల నుండి గ్రహిస్తుంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A మరియు B రెండూ సరియైనవి కావు
b) A మాత్రమే సరియైనది
c) B మాత్రమే సరియైనది కాదు
d) A మరియు B రెండూ సరియైనవి
Q4. కింది వివరణలను పరిశీలించండి:
A: దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ప్రాధమికమైనవి.
B: భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతి, భద్రతలను పెంపొందించే అంశాలు ప్రాధమిక విధుల భాగంలో ఉన్నాయి.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A మరియు B రెండూ సరియైనవి కావు
b) A మాత్రమే సరియైనది
c) B మాత్రమే సరియైనది
d) A మరియుB రెండూ సరియైనవి
Q5. కింది జతలలో ఏవి సరియైనవి?
A: స్ధానిక సంస్ధలకు ఎన్నికలు నిర్వహించే అధికారం కలది - రాష్ట్ర ఎన్నికల సంఘం
B: రాష్ట్ర ప్రభుత్వం మరియు స్ధానిక సంస్ధల మధ్య నిధుల విభజన చేసే సంస్ధ - రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్
C: భారతదేశంలో మొట్టమొదటగా పంచాయితీ రాజ్ వ్యవస్ధను ప్రవేశపెట్టిన రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్
సరియైన జతలను ఎంపిక చేయండి:
a) B మరియు C మాత్రమే
b) A, B మరియు C
c) A మరియు B మాత్రమే
d) A మరియు C మాత్రమే
Q6. కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
A: జిల్లా కోర్ట్ మరియు సెషన్స్ జడ్జి కోర్టే జిల్లా స్ధాయిలోని అత్యున్నత క్రిమినల్ కోర్ట్.
B: రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర హైకోర్టుని సంప్రదించి జిల్లా స్ధాయి జడ్జిలను నియమిస్తారు.
C: జిల్లా జడ్జిగా అర్హత పొందడానికి ఒక వ్యక్తి ఏడు సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ కాలం అడ్వకేటు లేదా ఫ్లీడర్‌గా పనిచేసిన వారు లేక కేంద్ర లేక రాష్ట్ర న్యాయ శాఖలో సేవలు అందించిన అధికారి అయివుండాలి.
D: సెషన్ జడ్జి మరణ శిక్ష విధించిన పక్షంలో, దాని అమలుకు ముందు హైకోర్టు నిర్ధారించాలి.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A మరియు B మాత్రమే
b) A, B, C మరియు D
c) B, C మరియు D మాత్రమే
d) C మరియు D మాత్రమే
Q7. రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులలో ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తారు?
a) భారత ప్రధాన న్యాయమూర్తిచే నియమింపబడిన వ్యక్తి
b) ప్రధాన మంత్రి
c) లోక్‌సభ స్పీకర్
d) భారత ప్రధాన న్యాయమూర్తి
Q8. భారతదేశ స్ధానిక స్వీయ ప్రభుత్వ పితామహుడు ఎవరు?
a) లార్డ్ వెల్లెస్లీ
b) లార్డ్ డల్‌హౌసి
c) లార్డ్ రిప్పన్
d) లార్డ్ బెంటింక్
Q9. కింది ఏ పరిస్ధితులలో కో-వారెంట్ రిట్ జారీ చేయబడుతుంది?
A: కార్యాలయం ప్రభుత్వందై ఉండాలి. అలాగే రాజ్యాంగం యొక్క శాసనం ద్వారా లేదా రాజ్యాంగం ద్వారా రూపొందించబడాలి.
B: కార్యాలం అనేది కేవలం విధి మరియు కార్యాచరణతో పాటు ఇతరుల ఇచ్చ మరియు ఆమోదంతో కూడినది మాత్రమే కాకుండా యదార్ధమైనదై ఉండాలి.
C: ఒక వ్యక్తి నియామకం రాజ్యాంగం లేదా శాసనానికి విదుద్దంగా జరిగినట్లయితే.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A మరియు B మాత్రమే
b) A, B మరియుC
c) B మరియు C మాత్రమే
d) A మరియు C మాత్రమే
Q10. కింది వాటిలో ప్రాధమిక విధుల గురించి సరియైనవి ఏవి?
A: ఇవి అమలు చేయబడలేవు.
B: ఇవి ఎటువంటి చట్టపరమైన హక్కులు కావు.
C: ఇవి పాధమికంగా నైతిక విధులు
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B మరియు C
b) A మరియు B మాత్రమే
c) A మరియు C మాత్రమే
d) B మరియు C మాత్రమే
Answers:
1. జవాబు: c
2. జవాబు: a
3. జవాబు: d
4. జవాబు: b
5. జవాబు: c
6. జవాబు: b
7. జవాబు: d
8. జవాబు: c
9. జవాబు: b
10. జవాబు: a

No comments