Breaking News

డెయిలీ క్విజ్ 31: తెలంగాణ ఎకానమీ

daily-quiz-in-telugu-telangana-economy-31-telugumaterial.in

Q1. 2011 జనాభా గణాంకాలు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రకారం తెలంగాణలోని కింది జిల్లాలో ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయం 2016-17 (FRE) రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే అధికంగా ఉంది. ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయం ఆధారంగా ఈ జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చండి:
A: హైదరాబాద్
B: మేడ్చల్-మల్కాజ్‌గిరి
C: రంగారెడ్డి
D: సంగారెడ్డి
సరియైన క్రమంను/జవాబును ఎంపిక చేయండి.
a) C, A, B మరియు D
b) A, C, B మరియుD
c) B, A, C మరియు D
d) D, B, A మరియుC




Q2. సాలార్‌జంగ్ సంస్కరణలకు పూర్వం నిజాం పాలనలో 1853 వరకు తాలూకాదారులు వసూలు చేసే శిస్తులో ఎంత భాగం వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం అనుమతించింది?
a) భూమి శిస్తులో 1/4వ వంతు
b) భూమి శిస్తులో 1/6వ వంతు
c) భూమి శిస్తులో1/5వ వంతు
d) భూమి శిస్తులో1/8వ వంతు




Q3. కింది వాటిని జతపరచండి:




G.I. ట్యాగ్
A: సిల్వర్ ఫిలిగ్రీ
B: స్క్రోల్ పెయింటింగ్
C: ఇక్కత్
D: దుర్రీలు




ప్రదేశం
1: వరంగల్
2: పోచంపల్లి
3: నిర్మల్
4: కరీంనగర్
5: చేరియాల్
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:
a) A-1, B-3, C-2, D-4
b) A-4, B-5, C-2, D-1
c) A-5, B-2, C-4, D-1
d) A-3, B-5, C-4, D-2




Q4. 2011 జనాభా లెక్కలు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రకారం ‘జనాభా లింగ నిష్పత్తి’ గురించి కింది వివరణలను పరిశీలంచండి:
A: తెలంగాణలో 2011లో లింగ నిష్పత్తి 988. అంటే అది స్త్రీలకు అనుకూలంగా లేదని సూచిస్తుంది.
B: జిల్లాల వారీ లైంగిక నిష్పత్తి ప్రకారం, తెలంగాణలోని 11 జిల్లాలో పురుష జనాబా కంటే స్త్రీ జనాభా అధికంగా ఉంది.
C: పదమూడు జిల్లాల్లో లైంగిక నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది.
D: 21 జిల్లాల్లో లైంగిక నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B మరియు C మాత్రమే
b) A, B మరియు D మాత్రమే
c) A మరియు C మాత్రమే
d) B మరియు D మాత్రమే




Q5. భూ పంపిణీ, భూ శాసనం అమలును సమీక్షంచడానికి 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది?
a) జయతి గోష్ కమిటీ
b) రోశయ్య కమిటీ
c) కోనేరు రంగారావు కమిటీ
d) సిహెచ్. హనుమంతరావు కమిటీ




Q6. హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా కోసం మొట్టమొదటి ఆధారమైన ఉస్మాన్ సాగర్‌ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
a) 1924
b) 1918
c) 1920
d) 1937




Q7. భారత ప్రభుత్వంచే జూన్ 2015 లో ప్రారంభించబడిన ‘అమృత్’ () పధకంలో కింద ఇచ్చిన తెలంగాణలోని పట్టణాలలో ఏవి చేర్చబడలేదు?
A: ఆదిలాబాద్
B: కరీంనగర్
C: మెదక్
D: నిమామాబాద్
E: సంగారెడ్డి
F: సూర్యాపేట్
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, C, E మరియు F మాత్రమే
b) A, B మరియు D మాత్రమే
c) C మరియు E మాత్రమే
d) E మరియు F మాత్రమే




Q8. భౌగోళిక సూచిక టాగ్ గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి:
A: భౌగోళిక సూచిక వస్తువుల నమోదు మరియు రక్షణ చట్టం 2004లో తీసుకురాబడింది.
B: 2004-05లో భారతదేశంలో డార్జిలింగ్ టీ భౌగోళిక సూచిక టాగ్ ఇవ్వబడిన మొదటి వస్తువు.
C: భౌగోళిక సూచిక టాగ్ తెలంగాణలోని ఆదిలాబాద్ డోక్రాకు 2016-17లో ఇచ్చారు.
D: ఆదిలాబాద్ డోక్రా అనేది ఒక పురాతన కాలం నాటి బెల్ మెటల్ క్రాఫ్ట్. దీనిని వజరీస్ మరియు ఆటరిస్ అనబడే వజ్ తెగకు చెందినటువంటి వాళ్లు ఆచరిస్తున్నారు.
సరియైనవి కాని వ్యాఖ్యలను ఎంపిక చేయండి:
a) B మరియు D మాత్రమే
b) B మరియు C మాత్రమే
c) A మరియు C మాత్రమే
d) A, C మరియు D మాత్రమే




Q9. ఎంత ఆర్ధిక వ్యయంతో ‘సమీకృత మత్య్స అభివృద్ది స్కీం’ (IFDS) ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది?
a) రూ. 15,600 కోట్లు
b) రూ. 5,500 కోట్లు
c) రూ. 4,800 కోట్లు
d) రూ. 10,000 కోట్లు




Q10. ‘తెలంగాణ గ్రామీణ సమ్మిళిత అభివృద్ది పధకం’ గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి:
A: దీనిని ‘తెలంగాణ పల్లె ప్రగతి పధకం’ అని కూడా పిలుస్తారు.
B: చిన్న, సన్నకారు రైతులు మరియు ఎస్‌సి/ఎస్టి కుటుంబాలు ఈ స్కీం వల్ల లబ్ది పొందుతారు.
C: తెలంగాణ రాష్ట్ర ‘సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పాపర్టీ’ (SERP) ఈ పధకాన్ని అమలు చేస్తుంది.
D: ప్రపంచ బ్యాంకు ఈ పధకానికి గాను తెలంగాణ రాష్ట్రానికి రుణాన్ని ఇవ్వడానికి అనుమతిని ఇచ్చింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A, B, C మరియుD
b) A, B మరియు C మాత్రమే
c) B, C మరియు D మాత్రమే
d) A మరియు D మాత్రమే




Answers:




1. జవాబు: d
2. జవాబు: d
3. జవాబు: b
4. జవాబు: b
5. జవాబు: c
6. జవాబు: c
7. జవాబు: c
8. జవాబు: a
9. జవాబు: d
10. జవాబు: a

No comments