డెయిలీ క్విజ్ 32: హిస్టరీ & కల్చర్
Q1. ప్రతిపాదన (A) : భారతదేశంలో వ్యాపారం కొరకు ఇంగ్లండులో బ్రిటిషు తూర్పు ఇండియా వర్తక సంఘము స్ధాపించబడెను.
కారణము (R) : ఇంగ్లండు తోటి వ్యాపారము ఎప్పుడూ భారత దేశానికి లాభసాటిగా కొనసాగెను.
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) (A) మరియు (R) రెండు నిజము (R), (A) కు సరియైన వివరణ.
b) (A) మరియు (R) రెండు నిజము కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.
c) (A) నిజము, కాని (R) తప్పు.
d) (A) తప్పు, కాని (R) నిజము.
Q2. అశోకుడు తన రాతి ఫలకాలలో క్రిందగల ఏ సూత్రాన్ని సూచించ లేదు?
a) తల్లిదండ్రులు, గురువులు మరియు పెద్దల పట్ల విధేయత
b) జీవ హింసకు దూరంగా వుండడం
c) ధనార్జన
d) నైతిక విలువలకు కట్టుబడి వుండడం
Q3. క్రింది వాటిని జతపరుచుము:
వరుస - I
a: పల్లవులు
b: చోళులు
c: విజయనగర్
d: హోయసాలులు
వరుస-II
i: హంపి
ii: బేలూరు
iii: మహాబలిపురం
iv: తంజావూరు
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a-iii, b-iv, c-i, d-ii
b) a-ii, b-iv, c-iii, d-i
c) a-iv, b-i, c-iii, d-ii
d) a-iii, b-iv, c-ii, d-i
Q4. క్రింది వాటిని జతపరుచుము:
వరుస - I
a: ఇబన్ బటుట
b: అల్ బెరుని
c: ఇసామి
d: అమిర్ ఖుస్రూ
e: మిన్హజ్ సిరాజ్
వరుస - II
i: ఫుత్-అస్-సలాటిన్
ii: కితాబ్-ఇ-హింద్
iii: తుగ్లక్ నామ
iv: తాబక్త-ఇ-నసిరి
v: కితాబ్-ఉల్-రహ్ల
సరియైన జవాబును ఎంపిక చేయండి :
a) a-ii, b-iii, c-i, d-iv, e-v
b) a-i, b-iv, c-v, d-iii, e-ii
c) a-v, b-ii, c-i, d-iii, e-iv
d) a-v, b-ii, c-iv, d-i, e-iii
Q5. 1948 జూన్ లో భారత ప్రభుత్వం చేత నియమించబడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్‌కు అధ్యక్షుడు ఎవరు?
a) ఎస్. కె. పాటిల్
b) ఎస్. కె. ధార్
c) పటాస్కర్
d) పి. ఎన్. హక్సర్
Q6. 2011 సం.లో సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సి. ఎస్. డి. ఎస్.) అనే సంస్ధ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?
a) రాజదీప్ సర్దేశాయి
b) యోగేంద్ర యాదవ్
c) ప్రణయ్ రాయ్
d) అర్నబ్ గోస్వామి
Q7. కింది వివరణలను పరిశీలించండి:
A: సహాయ నిరాకరణోద్యమం భారతదేశం లోని అన్ని వర్గాల ప్రజలను స్వాతంత్ర్య సమరంలోకి తీసుకువచ్చింది.
B: చౌరీ-చౌరాలో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) A మరియు B రెండూ సరియైనవి కావు
b) A మాత్రమే సరియైనది
c) B మాత్రమే సరియైనది
d) A మరియు B రెండూ సరియైనవి
Q8. కింది వివరణలను పరిశీలించండి:
A: 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రధమ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఎ.ఒ. హ్యూమ్ ముఖ్య పాత్రను నిర్వహించాడు.
B: ప్రజల అసంతృప్తి, బాధలు, భావాల వ్యక్తీకరణకు రక్షక కవాటంగా భారత జాతీయ కాంగ్రెస్ ను స్ధాపించేందుకై నిర్ణయించడమైంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
a) B మాత్రమే సరియైనది
b) A మరియు B రెండూ సరియైనవి
c) A మరియు B రెండూ సరియైనవి కావు
d) A మాత్రమే సరియైనది
Q9. ‘పెద్ద కరువు’, లేక ‘ధాత కరువు’ గా పేరుగాంచి, భారతదేశంలో బ్రిటీష్ పాలనారంభం నుండి అతి భయంకర క్షామంగా పేరుగాంచింది. ఏ సంవత్సరంలో సంభవించింది?
a) 1876-78
b) 1770
c) 1790
d) 1868-69
Q10. కింది వాటిని జతపరచండి:
జాబితా-I
A: నద్వతుల్ ఉలేమా
B: మహమ్మదీన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్
C: దారుల్ ఉలూమ్
D: రహనుమయ్ మజ్ దయాసన్ సభ
జాబితా-II
: బాంబే
2: దేవ్‌బంద్
3: ఆలీఘడ్
4: లక్నో
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:
a) A-2, B-4, C-3, D-1
b) A-4, B-2, C-1, D-3
c) A-4, B-3, C-2, D-1
d) A-3, B-4, C-1, D-2
Answers:
1. జవాబు: c
2. జవాబు: c
3. జవాబు: a
4. జవాబు: c
5. జవాబు: b
6. జవాబు: b
7. జవాబు: d
8. జవాబు: b
9. జవాబు: a
10. జవాబు: c

No comments