డెయిలీ క్విజ్ 33: వ్యాపార గణితం
Q1. ఒక దీర్ఘచతురస్రం పొడవు దాని వెడల్పుకు రెట్టింపుకన్న అయిదు ఎక్కువ. దాని వైశాల్యం 273 చ. సెం.మీ. అయితే, ఆ దీర్ఘచతురస్రపు వెడల్పును వ్యాసార్ధంగా గల వృత్త వైశాల్యం (చ. సెం.మీ. లలో) :
a) 346.5
b) 123.25
c) 140
d) 210
Q2. ఒక వ్యక్తి A, రూ. 1,00,000 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించెను. రెండు నెలల తరువాత రూ. 1,20,000 పెట్టుబడితో B జతకలిసెను. ఎనిమిది నెలల తరువాత కొంత పెట్టుబడితో C వారితో జతకలిసెను. సంవత్సరాంతమున వచ్చిన లాభాన్ని వారు సమంగా పంచుకొంటే, C పెట్టుబడిగా పెట్టిన మొత్తం (రూపాయిల్లో) :
a) 5,00,000
b) 4,00,000
c) 4,50,000
d) 3,00,000
Q3. 1995 యొక్క ధన భాజకాల సంఖ్య :
a) 8
b) 16
c) 32
d) 64
Q4. ఒక గుడారం యొక్క ఆకారం ఒక స్తూపం పై శంకువు బోర్లించినట్లున్నది. శంకువు ఎత్తు, స్తూపం ఎత్తులో సగం మరియు స్తూపం భూ వ్యాసార్ధం 3 మీ. గుడారానికి అవసరమైన గుడ్డ 1898 మీ2 అయితే, గుడారం మొత్తం ఎత్తు (మీటర్లలో) :
a) 5
b) 6
c) 8
d) 12
Q5. ఒక గడియారంలో నిమిషాల ముల్లు వేగం గంటల ముల్లు వేగం కన్న ఎన్ని రెట్లు ఎక్కువ?
a) 30
b) 24
c) 12
d) 8
Q6. 2x – 5y = 7z – 3y, xyz ≠ 0, అయినపుడు

a) 80
b) 82
c) 84
d) 86
Q7. వ్యక్తి A ఒక పని W1 ని 6 గంటల్లో పూర్తిచేయగా మరోవ్యక్తి B మరొకపని W2 ని 6 గంటల్లో పూర్తిచేయగలడు. పన W1, పని W2 లో మూడింట రెండవ రెండవ వంతు మాత్రమే ఉంటే; A, B లు ఇద్దరూ కలిసి ఆరెండు పనులనూ పూర్తి చేయటానికి పట్టే గంటల సంఖ్య:
a) 6
b) 7
c) 5
d) 8
Q8. 6, 9 మరియు 15 లచే భాగించగా 5 శేషము వస్తూ ఉండే 7 యొక్క గుణిజాలలో అతి కనిష్ట సంఖ్య:
a) 450
b) 455
c) 560
d) 378
Q9. A మరియు B యొక్క వయస్సులు 2 : 5 నిష్పత్తిలో ఉన్నాయి. ఎనిమిది సంవత్సరములు తరువాత, వారి వయస్సుల నిష్పత్తి 22 : 43 అవుతుంది. వారి ప్రస్తుత వయస్సులు (సం. లలో):
a) 14, 35
b) 16, 40
c) 18, 45
d) 20, 50
Q10. B కంటె A కి 50% జీతం ఎక్కువ వస్తే, A కంటె B జీతం ఎంత శాతం తక్కువ?
a) 25
b) 33 1/3
c) 50
d) 66 2/3
Answers:
1. జవాబు: a
2. జవాబు: d
3. జవాబు: b
4. జవాబు: d
5. జవాబు: c
6. జవాబు: c
7. జవాబు: a
8. జవాబు: b
9. జవాబు: a
10. జవాబు: b

No comments