డెయిలీ క్విజ్ 39: కెమిస్ట్రీ
1. అత్యంత మృదువైన లోహం
a) లిధియం
b) సోడియం
c) సీసియం
d) బంగారం
2. పదార్ధపు నాల్గవ రూపంగా దేనిని పరిగణిస్తారు?
a) సూపర్ ద్రవం
b) ద్రవస్ఫటికాలు
c) ప్లాస్మా
d) మెత్తని స్ఫటికం
3. ప్లేటులో ఉంచిన కర్పూరం (కాంఫర్) కొన్ని గంటల తరవాత చిన్నదిగా కావడానికి కారణం
a) మండిపోవడం
b) కరిగి పోవడం
c) ఉత్పాతనం చెందడం
d) ద్రవీభవనం చెందడం
4. డాల్టన్ సిద్దాంతం ప్రకారం పదార్ధపు అతి చిన్న కణం ఏది?
a) పరమాణువు
b) అణువు
c) ప్రోటాన్
d) న్యూట్రాన్
5. ప్రాధమిక కణాలను గుర్తించండి:
a) ఎలక్ట్రాన్ లు
b) ప్రోటాన్ లు
c) న్యూట్రాన్ లు
d) పైవన్నీ
6. అత్యంత తేలికైన మూలకం ఏది?
a) హైడ్రోజన్
b) కార్బన్
c) హీలియం
d) యురేనియం
7. సాధారణ ఉప్పు (సోడియం క్లోరైడ్) లో ఉండే బంధం
a) అయానిక బంధం
b) సమయోజనీయం బంధం
c) హైడ్రోజన్ బంధం
d) లోహ బంధం
8. నీటిని విద్యుద్విశ్లేషణ చేసి విడగొడితే లభించే మూలకాలు
a) ఆక్సిజన్, నైట్రోజన్
b) ఆక్సిజన్, హైట్రోజన్
c) కార్బన్, హైట్రోజన్
d) ఆక్సిజన్, కార్బన్, హైట్రోజన్
9. పేలుడు పదార్ధాలు సాధారణంగా
a) నైట్రో సమ్మేళనాలు
b) సల్ఫేట్‌లు
c) క్లోరైడ్‌లు
d) ఫాస్ఫేట్‌లు
10. బంగారము మరియు ప్లాటినమ్‌లను కరగించగల ‘రాయల్ వాటర్’ లేదా కింగ్స్ వాటర్‌గా పిలువబడె ఆక్వా రేజీయ వీటి మిశ్రమము:
1: హైడ్రోక్లోరిక్ ఆమ్లము
2: నైట్రిక్ ఆమ్లము
3: హైడ్రోబ్రోమిక్ ఆమ్లము
4: సల్ఫ్యూరిక్ ఆమ్లము
సరియైన సమాధానము :
a) 1, 2 మరియు 4
b) 1 మరియు 2
c) 1, 3 మరియు 4
d) 1, 2 మరియు 3
Answers:
1. జవాబు: c
2. జవాబు: c
3. జవాబు: c
4. జవాబు: a
5. జవాబు: d
6. జవాబు: a
7. జవాబు: a
8. జవాబు: b
9. జవాబు: a
10. జవాబు: b

No comments