Breaking News

ఏఈఆర్‌సీ ఛైర్మన్‌గా గుంటూరు నాగేశ్వరరావు నియామకం


guntur-nageshwar-rao-appointed-aerc-chairman-telugumaterial.in

అణు ఇంధన నియంత్రణ మండలి (ఏఈఆర్‌సీ) ఛైర్మన్‌గా గుంటూరు నాగేశ్వరరావు నియమితులయ్యారు.
  • ఈ మేరకు కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది.
  • అణు ఇంధన భద్రతా వ్యవహారాల్లో ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పదవిలో నియమించింది.
  • ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.
  • ప్రస్తుతం ఆ స్థానంలో కొనసాగుతున్న ఎస్ఏ భరద్వాజ్నుంచి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
  • నాగేశ్వరరావు ప్రస్తుతం కల్పాకంలో ప్రాజెక్ట్ డిజైన్ సేఫ్టీ కమిటీ, ప్రోటోటైప్ ఫాస్ట్‌బ్రీడర్ రియాక్టర్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.




గుంటూరు నాగేశ్వరరావు: 

  • నాగేశ్వరరావు స్వస్థలం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు.
  • తండ్రి సాధారణ రైతు.
  • ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, ప్రాథమికోన్నత విద్య రేవేంద్రపాడు జడ్పీ స్కూల్‌లో సాగింది.
  • విజయవాడ ఆంధ్రలయోలా కాలేజీలో పీయూసీ, అనంతపురం జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్, మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ చేసారు.
  • అనంతపురం జేఎన్‌టీయూలో తొలి బ్యాచ్ విద్యార్థి. 1969 నుంచి 1975 వరకు అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
  • కెరీర్ ప్రారంభంలో అణు ఇంధనశాఖలో చేరారు.
  • తర్వాత డిప్యుటేషన్‌పై దాని అనుబంధ సంస్థ అయిన ఎన్‌పీసీఎల్‌కి వెళ్లారు. అందులోనే శాశ్వతంగా ఉండిపోయారు.
  • అందులోనే రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటకలోని అణు ఇంధన విద్యుత్తు కేంద్రాల్లో పనిచేసారు.
  • తర్వాత  ఎన్‌పీసీఎల్‌లో పాలకమండలిలో డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
  • ఆగష్టు 2007 నుంచి పదవీ విరమణ పొందేవరకు అక్కడే ఉన్నారు.
  • కొన్నాళ్లు ఎన్‌టీపీసీకి భద్రతా సలహాదారుగా, అనంతరం యూపీలోని ఎన్‌టీపీసీకి కొన్ని రోజులపాటు సేవలందించారు.

No comments