ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షకు దరఖాస్తులకంటే అదనపు రుసుములు చెల్లించిన వారే అధికం
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2018 దరఖాస్తు సమయంలో నెలకొన్న గందరగోలంతో అదనంగా చెల్లించిన రుసుం తిరిగిరాని పరిస్థితి నెలకొంది.
- పోస్టుల అర్హతపై అవగాహన లేకపోవటం, గేట్‌వే ద్వారా రుసుము చెల్లింపు సమయంలో సర్వర్ పని చేయకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
- దరఖాస్తు రుసుము రూ. 500 చెల్లించడంలో నెలకొన్న సమస్యలు ఆ తర్వాత దరఖాస్తు తిరస్కరణవంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
- చాలా మంది అభ్యర్థులు పలు మార్లు రుసుములు చెల్లించారు. ఇలా వేలాది మంది అభ్యర్థులు నష్టపోయారు.
- వీరందరూ చెల్లించిన మొత్తం సుమారు రూ. 93 లక్షల వరకు ఉంది.
- ఆ మొత్తాన్ని తిరిగి తమకు ఇప్పించాలని అభ్యర్థులు కోరుతున్నా పాఠశాల విద్యాశాఖ మాత్రం దీనిపై స్పందించడంలేదు.
- డీఎస్సీ పరీక్షకు వచ్చిన దరఖాస్తులకంటే ఇలా చెల్లించిన అదనపు రుసుము అధికంగా ఉంది.
- అదనంగా చెల్లించిన మొత్తం అభ్యర్థుల బ్యాంకు ఖాతాలకు తిరిగి రాలేదు.
- డీఎస్సీ దరఖాస్తుకు రుసుము చెల్లింపు: 6,26,791.
- దరఖాస్తుల సమర్పణ: 6,08,157.
- దరఖాస్తు లేకుండానే చెల్లించిన వారు: 18,634.
- ఒక్కో దరఖాస్తు: రూ. 500.
- అదనంగా చెల్లింపు: రూ. 93,17,000.

No comments