Breaking News

ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్విజ్ 04-జనవరి-2019



important-current-affairs-in-telugu-04-january-2019-telugumaterial.in

Q1. ఈ క్రింది ఏ రెండు బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయటానికి కేంద్ర మంత్రి వర్గం ఇటీవల ఆమోదం తెలిపింది?
a) దేనా బ్యాంక్ మరియు విజయ బ్యాంక్
b) విజయ బ్యాంక్ మరియు RBL బ్యాంకు
c) RBL బ్యాంక్ మరియు IDBI బ్యాంక్
d) IDBI బ్యాంక్ మరియు దేనా బ్యాంక్




Q2. 2019 జనవరి 1న ఐక్యరాజ్యసమితిలోని సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ‘శాశ్వత సభ్యత్వం కాని’ (Non-Permanent Members) బాధ్యతలు తీసుకున్న దేశాలను గుర్తించండి:
1: బెల్జియం
2: డొమినికన్ రిపబ్లిక్
3: జర్మనీ
4: ఇండోనేషియా
5: దక్షిణాఫ్రికా
a) 1 & 2 మాత్రమే
b) 1, 2 & 5 మాత్రమే
c) 1, 2, 4 & 5 మాత్రమే
d) పైవన్నీ




Q3. ఇటీవల నేషనల్ హెల్త్ ఏజన్సీని, ‘నేషనల్ హెల్త్ అథారిటీ’గా పునర్నిర్మించటానికి క్యాబినెట్ ఆమోదించింది. అయితే ఇది ఏ పథకాన్ని మెరుగ్గా అమలు పరచడానికి ఉద్దేశించినది?
a) జాతీయ ఆరోగ్య మిషన్
b) ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన
c) రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన
d) జనశ్రీ బీమా యోజన




Q4. 2019 జనవరిలో ప్రధాన మంత్రి ఉజ్వాల యోజన (PMUY) ఏ మైలురాయిని దాటింది?
a) 2 కోట్ల కనెక్షన్ల మార్క్
b) 4 కోట్ల కనెక్షన్ల మార్క్
c) 6 కోట్ల కనెక్షన్ల మార్క్
d) 8 కోట్ల కనెక్షన్ల మార్క్




Q5. 2019 ఫిబ్రవరిలో జరగనున్న ‘ఇండియా ఫార్మా 2019’ & ‘ఇండియా మెడికల్ డివైస్ 2019’ సమావేశాలు ఏ నగరంలో జరగనున్నాయి?
a) న్యూఢిల్లీ
b) బెంగళూరు
c) ముంబై
d) లక్నో




Q6. 2019 జనవరి 1 నుండి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (OPEC) సభ్యత్వాన్ని వదులుకున్న దేశం ఏది?
a) సౌదీ అరేబియా
b) ఖతార్
c) బహ్రెయిన్
d) ఒమన్




Q7. జైర్ బోల్సోనరో 2019 జనవరి 1న ఏ దేశానికి అధ్యక్షినిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు?
a) జర్మనీ
b) అర్మేనియా
c) బ్రెజిల్
d) మెక్సికో




Q8. ఇటీవల ఏ దేశం దాని ప్రధాన ఇమ్మిగ్రేషన్ నిర్బంధ సౌకర్యాలను మూసివేసింది?
a) ఆస్ట్రేలియా
b) కెనడా
c) జర్మనీ
d) అమెరికా




Q9. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఏ వర్గానికి చెందిన ప్రజల జాబితాను సవరించాలన్న 'రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (సవరణ) బిల్లు 2018' కి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది?
a) షెడ్యూల్డ్ కులాలు
b) బోడో
c) షెడ్యూల్డ్ తెగలు
d) గారో




Q10. 2019 జనవరి 2న రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా UK సిన్హా సారథ్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇది ఏ రంగాన్ని పునరుద్ధరించేందుకు ఉద్దేశించినది?
a) MSME
b) చేనేత
c) వ్యవసాయం
d) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్




Answers & Explanations:




1. a: దేనా బ్యాంక్ మరియు విజయ బ్యాంక్‌లను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయటానికి జనవరి 2న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఈ విలీనం ఫలితంగా ఆస్తుల పరంగా దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకు అవతరించనుంది. ఏప్రిల్ 1 నుండి విలీన బ్యాంక్ కార్యకలాపాలు సాగించనుంది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ ప్రభుత్వరంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కాగా తరవాత స్థానంలో ప్రైవేటురంగ ఐసీఐసీఐ బ్యాంకు ఉంది.




2. d: 2019 జనవరి 1న ఐదు దేశాలు- బెల్జియం, డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేషియా మరియు దక్షిణాఫ్రికాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) నాన్-శాశ్వత సభ్యులుగా బాధ్యతలు స్వీకరించాయి.




3. b: ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) పథకాన్ని మెరుగ్గా అమలుచేయడానికి నేషనల్ హెల్త్ ఏజెన్సీని ‘నేషనల్ హెల్త్ అథారిటీ’గా పునర్వ్యవస్థీకరించేందుకు 2019 జనవరి 2న కేంద్ర కేబినెట్ ఆమోదించింది.




4. c: ప్రధాన మంత్రి ఉజ్వాలా యోజన (పిఎంయువై) కింద ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఇటీవల 6 కోట్ల-వ ఎల్పీజీ కనెక్షన్‌ను డిల్లీలో ఖాన్పూర్లోని శివ్‌పార్క్ కు చెందిన జాస్మినా ఖటోన్‌కు అందించారు. దారిద్య్రరేఖ దిగువస్థాయి (బీపీఎల్) కుటుంబాలకు 8 కోట్ల డిపాజిట్ లేని ఎల్పీజీ కనెక్షన్లను అందించడానికి ప్రభుత్వం 12800 కోట్ల రూపాయల వ్యయంతో ‘ప్రధాన మంత్రి మంత్రి ఉజ్వాల యోజన’ను ప్రారంభించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 6కోట్ల కనెక్షన్లను ఇచ్చారు.




5. b: ఫిబ్రవరి 18న బెంగుళూరులో ఫార్మాస్యూటికల్ అండ్ మెడికల్ డివైస్ విభాగంలో 4వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) నిర్వహిస్తోంది. ఇండియా ఫార్మా 2019 థీం: ‘ఎనేబిలింగ్ క్వాలిటీ అఫర్డబుల్ హెల్త్‌కేర్' మరియు ‘ఇండియా మెడికల్ డివైస్ 2019’ థీం: 'మెడ్-టెక్ ఇండియా: గేరింగ్ అప్ ఫర్ ఆయుష్మాన్ భారత్'.




6. b: ఖతార్ 2019 జనవరి 1 నుండి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ యొక్క సభ్యత్వాన్ని కోల్పోయింది. OPEC నుండి సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు ఖతార్ డిసెంబరులో ప్రకటించింది. ఆ దేశంలో లభించే సహజ వాయువు ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. కొన్ని పెర్షియన్ గల్ఫ్ దేశాలతో పాటు అనేక అరబ్ దేశాలు తమ దేశంపై విధించిన దౌత్య మరియు ఆర్థిక ఆంక్షల కారణంగా ఖతార్ ఈ నిర్ణయం తీసుకుంది.




7. c: జైర్ బోల్సోనరో 2019 జనవరి 1న బ్రెజిల్ దేశాధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా "వివక్ష మరియు విభజనలు లేని సమాజాన్ని" నిర్మిస్తానని తెలిపారు.




8. a: ఆస్ట్రేలియన్ ప్రభుత్వం రెండు ఇమ్మిగ్రేషన్ నిర్బంధ సౌకర్యాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా మిగిలి వున్న 8 ఇమ్మిగ్రేషన్ నిర్బంధ కేంద్రాలలో ప్రస్తుతం సుమారు 1,250 ఉన్నారు. 2013 మధ్యకాలంలో ఈ సంఖ్య 10,200 గా ఉండేది.




9. c: అరుణాచల్ ప్రదేశ్‌లోని షెడ్యూల్డ్ తెగల జాబితాను సవరించడానికి వీలుగా రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్, 1950 లో కొన్ని సవరణలు చేసి రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (సవరణ) బిల్లు 2018 ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.




10. a: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మాజీ చైర్మన్ యు.కె. సిన్హా అధ్యక్షతన, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) పై నిపుణుల కమిటీని 2019 జనవరి 2న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఏర్పాటు చేసింది.

No comments