Breaking News

డెయిలీ క్విజ్ 56: ఎకానమీ

daily-quiz-in-telugu-Economy-56-telugumaterial.in

Q1. ఒకే ఆర్ధిక వ్యవస్ధలో ఆధునిక లేదా అభివృద్ధి చెందిన మరియు సాంప్రదాయక లేదా వెనుకబడిన రంగములు పనిచేయు స్ధితిని మరియు ఆ రెండు రంగములు కూడా ఒకే ప్రాంతములో అమలులో వుండటాన్ని ఏమంటారు?
a) సామ్యవాదము
b) ద్వంద్వ ఆర్ధిక వ్యవస్ధ
c) పెట్టుబడిదారీ వ్యవస్ధ
d) అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ




Q2. 2014-15 నుంచి 2017-18 మధ్యకాలంలో భారతదేశ స్ధూల దేశీయోత్పత్తి సగటు వృద్ధి రేటుగా నమోదు కాబడినది ఏది?
a) 7 శాతం నుంచి7.9 శాతం మధ్య
b) 6 శాతం నుంచి 6.9 శాతం మధ్య
c) 5 శాతం నుంచి 5.9 శాతం మధ్య
d) 8 మరియు 8 శాతం పైన




Q3. భారతదేశంలో జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చినది?
a) 2006
b) 2011
c) 2013
d) 2015




Q4. ‘పీపుల్స్ ప్రణాళిక (1945)’ ని రూపొందించిన వారు ఎవరు?
a) మహాత్మగాంధీ
b) M.N.రాయ్
c) P.C. మహోలోనోబీస్
d) V.K.R.V. రావు




Q5. క్రింది వాటిలో ఏది భారతదేశంలో అత్యధిక స్ధాయిలో మత్స్య ఉత్పత్తిని సాధించిన స్ధితిని సూచిస్తుంది?
a) పసుపు విప్లవం
b) శ్వేత విప్లవం
c) హరిత విప్లవం
d) నీలి విప్లవం




Q6. క్రింది వానిలో దేనిని ‘స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన’ పధకం ద్వారా ఒకే స్వయం ఉపాధి పధకంగా 1999వ సంవత్సరంలో రూపొందించారు?
a) ఐఆర్‌డిపి మరియు ట్రైజమ్
b) ఐఆర్‌డిపి మరియు డ్వాక్రా మరియు యమ్.డబ్ల్యు.ఎస్
c) ఐఆర్‌డిపి మరియు డ్వాక్రా
d) ఐఆర్‌డిపి మరియు ట్రైజమ్ మరియు డ్వాక్రా మరియు యమ్.డబ్ల్యు.ఎస్




Q7. 1956 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని అనుసరించి భారతదేశ పరిశ్రమల విభజనను ఎన్ని షెడ్యూల్స్‌‌గా రూపొందించారు.
a) నాలుగు
b) మూడు
c) రెండు
d) ఆరు




Q8. ‘వ్యాపార శేషం’ అనగా ఏమిటి?
a) వస్తు, సేవల ఎగుమతులు
b) వస్తు, సేవల దిగుమతులు
c) అంతర్గత (దేశీయ) వ్యాపార లావాదేవీలు
d) వస్తు ఎగుమతులు, దిగుమతులు




Q9. 2011 భారతదేశ జనాభా గణాంకాల ప్రకారం కనిష్ఠ స్త్రీ-పురుష నిష్పత్తి నమోదైన రాష్ట్రం ఏది?
a) బీహార్
b) హర్యానా
c) పంజాబ్
d) ఉత్తర ప్రదేశ్




Q10. సెప్టెంబర్ 2018లో, విలీనం చేయుటకు ప్రతిపాదించబడిన మూడు (3) జాతీయ బ్యాంకులు ఏవి?
a) పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడ, విజయా బ్యాంకు
b) దేనా బ్యాంకు, ఆఫ్ బరోడ, విజయా బ్యాంకు, దేనా బ్యాంకు
c) బ్యాంకు ఆఫ్ బరోడ, విజయా బ్యాంకు, దేనా బ్యాంకు
d) యస్ బ్యాంకు, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు




Answers:




1. జవాబు: b
2. జవాబు: a
3. జవాబు: c
4. జవాబు: b
5. జవాబు: d
6. జవాబు: d
7. జవాబు: b
8. జవాబు: d
9. జవాబు: b
10. జవాబు: c

No comments