Breaking News

డెయిలీ క్విజ్ 58: ఇండియన్ పాలిటీ

daily-quiz-in-telugu-Indian-polity-58-telugumaterial.in

Q1. కింది వాటిలో విద్యా హక్కు గురించి రాజ్యాంగపరమైన హామీ ఉన్నది అనటంలో నిజం ఎంతవరకు ఉంది?
a) ఈ హక్కు ప్రప్రంచంలో మొదటి సంక్షేమ రాజ్యమైన బ్రిటీష్ రాజ్యంగం నుండి తీసుకోబడింది.
b) ఈ హక్కు 6-14 వయస్సుకు సంబంధించిన పిల్లలకు విద్య నిమిత్తం 2014 లో అమలులోకి తేబడింది.
c) ఈ హక్కు పిల్లలు మరియు వయోజనులకు సంబంధించింది కనుక ఇది అందరి పౌరులకు విద్యను హామీ ఇస్తుంది.
d) ఈ హక్కు భారత బాలలైన 6-14 వయస్సు గల వారికి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అవకాశం కల్పించబడింది.




Q2. కింది వాటిని జతపరచండి:




జాబితా-I
A: 7వ షెడ్యూల్
B: 8వ షెడ్యూల్
C: 9వ షెడ్యూల్
D: 10వ షెడ్యూల్




జాబితా-II
1: భూసంస్కరణలు మరియు రిజర్వేషన్స్
2: ఫిరాయింపు నిరోధక చట్టం
3: అధికార విభజన
4: పంచాయితీరాజ్ వ్యవస్ధ
5: అధికార భాషలు
a) A-3, B-5, C-1, D-2
b) A-3, B-5, C-1, D-4
c) A-5, B-3, C-1, D-2
d) A-5, B-3, C-4, D-2




Q3. 1774వ సంవత్సరంలో కలకత్తాలో ఏర్పాటు చేయబడిన సుప్రీం కోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినవారు.
a) సర్ ఎలిజా ఇంపే
b) జాన్ హైడ్
c) రాబర్ట్ ఛాంబర్స్
d) హెచ్.జె. కానియా




Q4. భారత రాజ్యాంగ పరిషత్ ముసాయిదా సంఘంలో సభ్యుడు కానివారు
a) ఎన్. గోపాలస్వామి అయ్యంగార్
b) ఎస్. మాధవరావ్
c) జె. బి. కృపలాని
d) టి.టి. కృష్ణమాచారి




Q5. ఈ క్రింది వ్యాఖ్య/వ్యాఖ్యలలో సరైన వాటిని గుర్తించండి.
A: భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము.
B: భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలదు.
C: భారత రాజ్యాంగంలో ‘పునరాయనము’ అన్నప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి ప్రస్ధావించబడినది.
D: భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యము కలదు.
a) A, C, D
b) A, D
c) A, B, C, D
d) A, B, D




Q6. భారత సమాఖ్య వ్యవస్ధకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
a) భారతదేశం ఒక రాష్ట్రల యూనియన్
b) భారత రాజ్యాంగంలో సమాఖ్య అన్నపదం ఎక్కడా ఉపయోగించబడలేదు
c) భారత సమాఖ్య వ్యవస్ధ నుండి విడిపోయే హక్కు రాష్ట్రాలకు లేదు
d) కేంద్ర రాష్ట్రాల మధ్య న్యాయ అధికారాలను పంపిణీ చేయటం జరిగినది




Q7. అకాలీ ఉద్యమం యొక్క లక్ష్యం
a) సెక్యులరిజాన్ని వృద్ధి పరచుట
b) జాతీయ విమోచనకి పాటుబడుట
c) అవినీతి మహంతుల నుండి గురుద్వారాలను విముక్తి చేయుట
d) సిక్కు మత ప్రచారము చేయుట




Q8. క్రింది వాటిని జతపరచుము
పార్టీ
A: బహుజన్ సమాజ్ పార్టీ
B: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
C: ద్రవిడ మున్నేట్ర ఖజగమ్
D: జనతాదళ్ (యునైటెడ్)




చిహ్నం
I: గడియారం
II: బాణం
III: ఏనుగు
IV: ఉదయించే సూర్యుడు
a) A-II, B-IV, C-I, D-III,
b) A-III, B-IV, C-I, D-II
c) A-II, B-I, C-III, D-IV
d) A-III, B-I, C-IV, D-II




Q9. ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ పేరును సూచించిన యీ క్రింది జాతీయ నాయకుడు
a) అనిబిసెంట్
b) సురేంద్రనాధ్ బెనర్జి
c) డబ్ల్యూ.సి. బెనర్జి
d) దాదాబాయ్ నౌరోజి




Q10. “ధైర్యవంతులనే విజయం వరిస్తుంది” అని పేర్కొన్నదెవ్వరు?
a) జె.ఎల్. నెహ్రూ
b) భగత్‌సింగ్
c) ఎమ్.కె. గాంధీ
d) తిలక్




Answers:




1. జవాబు: d
2. జవాబు: a
3. జవాబు: a
4. జవాబు: c
5. జవాబు: b
6. జవాబు: d
7. జవాబు: c
8. జవాబు: d
9. జవాబు: c
10. జవాబు: a

No comments