జనవరి 12 : జాతీయ యువత దినోత్సవం
స్వామి వివేకానంద జన్మదినోత్సవమయిన జనవరి 12ను భారతదేశమంతటా ‘జాతీయ యువత దినోత్సవం’గా జరుపుకుంటారు.
- స్వామి వివేకానంద 1863లో జనవరి 12న కలకత్తాలో భువనేశ్వరీదేవి, విశ్వనాథ దత్తా దంపతులకు ‘నరేంద్రదత్తా’గా జన్మించారు.
- 1881లో స్వామి తన గురువు రామకృష్ణ పరమహంసను మొదటిసారి కలుసుకున్నారు.
- 1886 జనవరిలో ‘రామకృష్ణ మఠం’ ను స్థాపించారు.
- 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన ‘పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్’లో పాల్గొని చిరస్మరణీయమైన ప్రసంగాన్ని వెలువరించారు.
- 1897 మే నెలలో ‘రామకృష్ణ మిషన్’ని స్థాపించారు.
- 1902లో జూలై 4న 39 సంవత్సరాల వయస్సులో కన్నుమూసారు.
స్వామి వివేకానంద బోధించిన కొన్ని సూక్తులు:
- తనపై తనకి నమ్మకం లేనివాడు నాస్తికుడు. భగవంతునిపై నమ్మకం లేనివాడు నాస్తికుడని ప్రాచీన మతాలన్నాయి. కాని స్వశక్తిపై విశ్వాసం లేనివాడు నాస్తికుడని ఆధునిక మతం అంటోంది.
- ఆత్మ విశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని వెలికితీస్తుంది. మీరు దేన్నైనా సాధించగలరు. అఖండశక్తిని ప్రదర్శించడానికి కావలసిన ప్రయత్నం చెయ్యనప్పుడే మీకు అపజయం వాటిల్లుతుంది. ఒక వ్యక్తిగాని, జాతిగాని తనపై తాను విశ్వాసాన్ని కోల్పోతే అది మృత్యువుతో సమానం.
- మిమ్మల్ని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారో, ఆ విధంగానే ఎదుగుతారు. బలహీనులుగా భావిస్తే బలహీనులుగానే మిగిలిపోతారు. బలవంతులని భావించుకుంటే బలవంతులే అవుతారు.

No comments