Breaking News

డెయిలీ క్విజ్ 67: ఫిజిక్స్

daily-quiz-in-telugu-physics-67-telugumaterial.in

Q1. క్రింది వాటిలో సరియైన వ్యాఖ్యను గుర్తించండి :
a) ఒక లోహపు వాహకము యొక్క నిరోధము దాని మధ్య వున్న పొటన్షియల్ తేడా పై ఆధారపడి వుంటుంది.
b) ఒక లోహపు వాహకము యొక్క నిరోధము దానిలో ప్రవహించే విద్యుత్ ప్రవాహము దిశ పై ఆధారపడి వుంటుంది.
c) ఒక లోహపు వాహకము యొక్క నిరోధము దాని పొడవు పై ఆధారపడి వుంటుంది.
d) ఒక లోహపు వాహకము యొక్క నిరోధము ఉష్ణోగ్రత పై ఆధారపడి వుండదు.




Q2. ఇండ్లలోని రిఫ్రిజిరేటర్ పనిచేయుట యందు గల సూత్రం :
a) పెల్టియర్ ఫలితం
b) సీబెక్ ఫలితం
c) జౌల్ ధామ్స్‌‌న్ ఫలితము
d) కాంతి విద్యుత్ ఫలితం




Q3. ఈ క్రింది వానిలో ఏది సరియైనది?
ఒక విద్యుద్వలయములో -
a) ఆమ్మీటరు సమాంతరంగాను, వోల్టుమీటరు శ్రేణిలోను కలిపి వుంటాయి.
b) ఆమ్మీటరు శ్రేణిలోను, వోల్టుమీటరు సమాంతరంగాను కలిపి వుంటాయి.
c) వోల్టేజి తక్కువగా ఉన్నప్పుడు ఆమ్మీటరు, వోల్టుమీటరు రెండూ శ్రేణిలో కలిపి వుంటాయి.
d) వోల్టేజి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆమ్మీటరు, వోల్టుమీటరు రెండూ సమాంతరంగా కలిపి వుంటాయి.




Q4. 2018వ సంవత్సరమునకు భౌతిక శాస్త్రములో నోబెల్ బహుమతి పొందిన మహిళ
a) నదియా మురాద్
b) ఆర్ధర్ ఆస్కిన్
c) గెరార్డ్ మౌరు
d) డొన్నా స్ట్రిక్‌లాండ్




Q5. క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం అంతరాళంలో ఒక కణాన్ని కనుగొనే మొత్తం సంభావ్యత ప్రమాణాంకీకరణ షతతులో
a) శూన్యము
b) అనంతము
c) ఒకటి
d) అనిశ్చితము




Q6. ఒక తీగ పదార్ధం యొక్క విశిష్ట నిరోధం
a) ఆ తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉండును
b) ఆ తీగ పొడవుకు విలోమానుపాతంలో ఉండును
c) ఆ తీగ పదార్ధం పై మాత్రమే ఆధారపడును
d) ఆ తీగ మధ్యచ్ఛేద వైశాల్యానికి అనులోమానుపాతంలో ఉండును




Q7. ఆంగ్‌స్ట్రామ్ పైరోహేలియో మీటరును దీనిని కనుగొనుటకు ఉపయోగిస్తారు
a) సూర్యుని ఉష్ణోగ్రత
b) సూర్యుని దూరము
c) నక్షత్ర ప్రకాశము
d) సౌర స్ధిరాంకము




Q8. పరమాణు ఆర్బిటాల్‌కు సంబంధించి, క్వాంటమ్ సంఖ్య 'X' దాని ఆకృతిని, క్వాంటమ్ సంఖ్య 'Y' స్ధాన నిర్దేశకతను సూచిస్తాయి. X, Y లు వరుసగా
a) ఎజిముతల్, అయస్కాంత
b) ప్రధాన, ఎజిముతల్
c) అయస్కాంత, ఎజిముతల్
d) అయస్కాంత, ప్రధాన




Q9. క్రింది వాటిలో దేనియందు ఎలక్ట్రాన్ల సంఖ్య (Z + 3) కు సమానం? (Z = మూలకం పరమాణు సంఖ్య)
a) పొటాషియం అయాన్
b) నైట్రైడ్ అయాన్
c) సల్ఫైడ్ అయాన్
d) కార్బైడ్ అయాన్




10. విద్యుత్ కెటిల్ లో నీరు ఈ చర్యవలన వేడి అవుతుంది ?
a) వహనము
b) వికిరణము
c) కదిలేకణములు
d) ఉష్ణ సంవహనము




Answers:




1. జవాబు: c
2. జవాబు: c
3. జవాబు: b
4. జవాబు: d
5. జవాబు: c
6. జవాబు: c
7. జవాబు: d
8. జవాబు: a
9. జవాబు: b
10. జవాబు: a

No comments