సేవా పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విధి నిర్వహణలో మంచి ప్రతిభ చూపిన పోలీసులతోపాటు వివిధ విభాగాల అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా పతకాలు ప్రకటించింది.
- పోలీసులు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక పోలీసు దళం, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల సిబ్బందిని ఈ పతకాలకు ఎంపిక చేసింది.
- 15 మందికి తెలంగాణ రాష్ట్ర శౌర్య పతకం, 17 మందికి మహోన్నత సేవా పతకం, 91 మందికి ఉత్తమ సేవా పతకం, 50 మందికి కఠిన సేవాపతకం, 371 మందికి సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.
- ప్రత్యేక భద్రతా దళానికి చెందిన సిబ్బందిలో ఒకరికి మహోన్నత సేవాపతకం, ఇద్దరికి ఉత్తమ సేవాపతకాలు, 15 మందికి సేవాపతకాలు లభించాయి.
- విపత్తు స్పందన అగ్నిమాపక శాఖలో ఇద్దరికి ఉత్తమ సేవా పతకాలు, 14 మందికి సేవా పతకాలు లభించాయి.
- విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ఒకరికి మహోన్నత సేవాపతకం, ముగ్గురికి ఉత్తమ సేవాపతకాలు, 9 మందికి సేవా పతకాలు లభించాయి.
- అవినీతి నిరోధకశాఖలో ముగ్గురికి ఉత్తమ సేవా పతకాలు, 18 మందికి సేవా పతకాలు లభించాయి.

No comments