Breaking News

తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం

justice tbn radhakrishnan takes oath as telangana first chief justice telugumaterial.in

2019 జనవరి 01న జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసారు.



  • జనవరి 1 నుంచి తెలంగాణ హైకోర్టు ఆవిర్భవించింది. ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ తెలంగాణకు కేటాయించబడ్డారు.
  • విభజన చట్టం ప్రకారం తెలంగాణ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తులు 24 మంది. అయితే ప్రస్తుతం 13 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరితో తెలంగాణ ప్రత్యేక హైకోర్టు జనవరి 1న ప్రారంభం అయింది.
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి. ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కేటాయించబడ్డ పలువురు న్యాయమూర్తులు డిసెంబర్ 30న కుటుంబ సమేతంగా అమరావతికి బయలుదేరారు.
  • తెలంగాణ బార్ కౌన్సిల్ కూడా జనవరి 1 నుండి విడిగా కొనసాగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు ఇటీవల ఎన్నికలు పూర్తయి పాలక మండళ్లు ఏర్పాటయ్యాయి.
  • ఉమ్మడి హైకోర్టులో  3.4 లక్షల వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి. ఇందులో 30శాతం కేసులు తెలంగాణకు చెందినవే.
  • దిగువ కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయాధికారుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 539 మందిని, తెలంగాణకు 362 మందిని కేటాయించారు. ఈ మేరకు డిసెంబర్ 30న హైకోర్టు న్యాయాధికారుల బదిలీ జరిగింది.
  • ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న సుమారు 1600 మంది ఉద్యోగుల్ని ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్ట నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టుల మధ్య 58:42 నిష్పత్తిలో విభజించాల్సి ఉంది.




నేపథ్యం: 

  • నిజాం కాలం నాటి పురాతన ’హైదరాబాద్ హైకోర్టు’ 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుగా ఆవిర్భవించింది.
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌ల ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది.
  • జనవరి 1 నుంచి తెలంగాణ హైకోర్టుగా అవతరించింది.
  • ఆంధ్రప్రదేశ్‌‌ హైకోర్టు ఏర్పాటయ్యాక 35 మంది ప్రధాన న్యాయమూర్తులు పనిచేసారు.
  • గుంటూరులో ఏర్పాటైన హైకోర్టులో మొదటి ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగిన జస్టిస్ కోకా సుబ్బారావు.. హైకోర్టును హైదరాబాద్‌కు తరలించాక మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసారు.
  • 35వ ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా సమయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగింది.
  • రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌లోనే ఉమ్మడి హైకోర్టు ఏర్పాటైంది.
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌ల ఉమ్మడి హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా బాధ్యతలు చేపట్టారు.
  • తరువాత జస్టిస్ దిలీప్ బి. భోసలే, టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసారు.

No comments