ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్విజ్ 01-ఫిబ్రవరి-2019
Q1. ఏ దేశంలోని ప్రాంతాల జాబితాలను నిషేధించాలని ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ యాత్రా వెబ్‌సైట్‌లను కోరింది?
a) ఇరాన్
b) ఇజ్రాయెల్
c) బహ్రెయిన్
d) టర్కీ
Q2. జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
a) ఉత్తరప్రదేశ్
b) బీహార్
c) ఝార్ఖండ్
d) గుజరాత్
Q3. శిశు మరణాలను అరికట్టేందుకు ఇటీవల ప్రత్యేక పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
a) మహారాష్ట్ర
b) కర్ణాటక
c) ఢిల్లీ
d) ఉత్తరప్రదేశ్
Q4. ఇటీవల, ఏ రెండు దేశాల సెంట్రల్ బ్యాంకులు సంయుక్తంగా 'అబెర్' (Aber) అని పిలువబడే సంయుక్త డిజిటల్ కరెన్సీని ప్రారంభించాయి?
a) ఫ్రాన్స్, జర్మనీ
b) UAE, సౌదీ అరేబియా
c) సౌదీ అరేబియా, అమెరికా
d) అమెరికా, బ్రిటన్
Q5. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయెల్ కేంద్ర బడ్జెట్ (మధ్యంతర బడ్జెట్) 2019-20 ను ప్రవేశపెడతారు. అయితే మధ్యంతర బడ్జెట్ కు ఉపయోగించిన మరొక పదం ఏమిటి?
a) డిమాండ్ ఫర్ గ్రాంట్స్
b) గులెటిన్
c) వోట్ ఆన్ అకౌంట్
d) అప్రాప్రియేషన్ బిల్లు
Q6. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (REITs) మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (InvITs) కోసం నూతన సమితి నియమాలను ప్రతిపాదించింది?
a) ఆర్బీఐ (RBI)
b) సెబీ (SEBI)
c) ఫిక్కీ (FICCI)
d) నీతీ ఆయోగ్ (NITI Aayog)
Q7. ఈశాన్య భారత్‌లోని సిక్కిం రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఇటీవల ‘స్వదేశ్ దర్శన్ ప్రాజెక్ట్’ క్రింద మొట్టమొదటి ప్రాజెక్ట్ ప్రారంభమైంది?
a) గురుడోంగ్మార్ సరస్సు
b) రామ్‌టెక్ మోనాస్ట్రీ
c) త్సాంగ్మో సరస్సు
d) జీరో పాయింట్
Q8. 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత న్యూఢిల్లీ నుంచి ఇరాక్‌లోని ‘నజఫ్’ నగరానికి తమ సర్వీసులను పునరుద్ధరించనున్న విమానసంస్థ ఏది?
a) ఎయిర్ ఇండియా
b) ఎయిర్ ఆసియా
c) లుఫ్తాన్సా
d) టైగర్ ఎయిర్
Q9. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
a) అకున్ సభర్వాల్
b) ఎస్.కే. జోషీ
c) రజత్ కుమార్
d) ఎం. సూర్యప్రకాశ్
Q10. గడిచిన ఆర్థిక సంవత్సరం (2017-18) కిగాను వృద్ధిరేటును కేంద్ర ప్రభుత్వం ఎంత శాతానికి సవరించింది?
a) 6.2
b) 6.7
c) 7.2
d) 7.7
Answers:
1(b): వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ఆక్రమిత స్థావరాలను యాత్రా వెబ్‌సైట్‌లలో ఉంచవద్దని ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ యాత్రా వెబ్‌సైట్‌లను కోరింది. ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ విడుదల చేసిన రిపోర్టు (Destination: Occupation) ప్రకారం యాత్రా వెబ్‌సైట్‌లు చట్టవిరుద్ధంగా పరిగణించబడుతున్న ప్రాంతాలకు ఎక్కువగా యాత్రికులను మళ్ళిస్తున్నందున ఈ విధంగా చర్యలు తీసుకుంది.
2(d): మహాత్మా గాంధీ యొక్క 71వ మరణ వార్షికోత్సవ సందర్భంగా గుజరాత్లోని నవ్సరి జిల్లాలోని దండి వద్ద జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ స్మారకచిహ్నం వద్ద 1930 దండి మార్చ్ నుండి వివిధ సంఘటనలు మరియు కథలను వర్ణించే 24-వర్ణన కుడ్యచిత్రాలు ఉన్నాయి.
3(a): శిశు మరణాల రేటును తగ్గించే ప్రయత్నంలో భాగంగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన శిశువులకు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం శిశువు సంరక్షణ వస్తువుల పంపిణీని ప్రారంభించింది.
4(b): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మరియు సౌదీ అరేబియా దేశాల సెంట్రల్ బ్యాంకులు 'అబెర్' (Aber) అని పిలవబడే ఒక సంయుక్త డిజిటల్ కరెన్సీని ప్రారంభించాయి. ఈ డిజిటల్ కరెన్సీని ఇరు దేశాల మధ్య జరిగే ఆర్థిక లావాదేవీలలో వినియోగించనున్నారు. దీనిని బ్లాక్‌చైన్ మరియు డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జెర్స్ టెక్నాలజీలతో వినియోగించనున్నారు.
5(c): ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయెల్ కేంద్ర బడ్జెట్ (మధ్యంతర బడ్జెట్) 2019-20 ను ప్రవేశపెడతారు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్. మధ్యంతర బడ్జెట్ 'వోట్ ఆన్ అకౌంట్' అని కూడా పిలువబడుతుంది. సాధారణంగా మధ్యంతర బడ్జెట్ బడ్జెట్‌ను లోక్సభలో చర్చ లేకుండానే ఆమోదిస్తారు.
6(b): రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (REITs) మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టు (InvITs) లలో పెట్టుబడిదారులకు అవకాశాలను పెంచడానికి నూతన సడలించబడిన నిబంధనలను జనవరి 30న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రతిపాదించింది.
7(d): కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కే.జే. ఆల్ఫోన్స్ జనవరి 30న సిక్కిం రాష్ట్రఓలో గ్యాంగ్‌టాక్‌లోని జీరో పాయింట్ వద్ద ‘స్వదేశ్ దర్శన్ ప్రాజెక్ట్’ క్రింద మొదటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ పథకం కింద ఇది సిక్కిం రాష్ట్రంలో మొట్టమొదటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును పర్యాటక మంత్రిత్వ శాఖ రూ. 98.05 కోట్ల వ్యయంతో జూన్ 2015లో ఆమోదించింది.
8(a): 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత న్యూఢిల్లీ నుంచి ఇరాక్‌లోని ‘నజఫ్’ నగరానికి తమ సేవలను పునరుద్ధరించనుంది. 2019 ఫిబ్రవరి 14 నుంచి సేవలు ప్రారంభమవుతాయని ఇరాక్‌లో భారత రాయబారి డాక్టర్ ప్రదీప్ రాజ్‌పురోహిత్ తెలిపారు.
9(d): తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్‌గా కర్నల్ ఎం. సూర్యప్రకాశ్ నియమితులయ్యారు.
10(c): గడిచిన ఆర్థిక సంవత్సరం (2017-18) కిగాను వృద్ధిరేటును 7.2 శాతానికి సవరించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రియల్ జీడీపీ లేదా జీడీపీ (2011-12 గణాంకాల) ప్రకారంగా 2017-18లో రూ. 131.80 లక్షల కోట్లుగా ఉండగా, 2016-17లో నమోదైన రూ. 122.98 లక్షల కోట్లతో పోలిస్తే 7.2 శాతం పెరుగుదల కనిపించింది.

No comments