Breaking News

డెయిలీ క్విజ్ 81: బయాలజీ

daily-quiz-in-telugu-Biology-81-telugumaterial.in

Q1. ఈ క్రింది వానిని జతపరుచుము :
జాబితా-I
(మొక్క)
a: బంగాళాదుంప
b: కారట్
c: ఆపిల్
d: కాబేజి




జాబితా-II
(తినయోగ్యమైన భాగం)
i: ఉబ్బిన పుష్పాసనము
ii: శాఖీయ మొగ్గ
iii: రూపాంతరం చెందిన వేరు
iv: రూపాంతర6 చెందిన కాండం
ఇది సరియైన జోడింపు :
a) a-iv, b-iii, c-I, d - ii
b) a-iii, b-ii, c-I, d - iv
c) a-ii, b-I, c-iv, d - iii
d) a-ii, b-iv, c-I, d - iii








Q2. క్రింది వాటిలో సరియైన వివరణలను గుర్తించుము.
a: ఓజోన్ పొర తరుగుదలకు CFC లు కారణము.
b: నీటి ఆవిరి, మీధేన్, CO2, CFC లు, నైట్రస్ ఆక్సైడ్ లు గ్రీన్ హౌస్ వాయువులు.
c: శుద్ధ నీటి BOD విలువ 100 ppm.
ఈ ప్రవచనాలలో ఏవి సరియైనవి?
a) a, b
b) a, c
c) a, b, c
d) b, c








Q3. కింది వాటిని జతపరచండి :
జాబితా-I (మడ అడవుల స్ధానం)
a: కార్వార్
b: కొరింగా
c: పిచ్చవరం
d: బితార్‌కనిక




జాబితా-II (రాష్ట్రం)
i: ఒడిషా
ii: తమిళనాడు
iii: ఆంధ్ర ప్రదేశ్
iv: కర్నాటక
సరియైన జవాబును/జతలను ఎంపిక చేయంది :
a) a-I, b-iii, c-iv, d - ii
b) a-ii, b-iv, c-iii, d-i
c) a-I, b-ii, c-iii, d-iv
d) a-iv, b-iii, c-ii, d-i








Q4. కింది వాటిని జతపరచండి :
లిస్ట్ - I
a: నర్మదా బచావ్ ఆందోళన
b: చిప్కో ఆందోళన
c: జీవ వైవిధ్య భావన
d: వనజీవి




లిస్ట్ - II
i: సుందరలాల్ బహుగున
ii: దరిపల్లి రామయ్య
iii: మేధా పాట్కర్
iv: ఎడ్వర్డ్ ఓ విల్సన్
v: మైఖల్ గ్రీన్‌స్టోన్
సరియైన జవాబును / జతలను ఎంపిక చేయండి :
a) a-iii, b-i, c-iv, d-ii
b) a-ii, b-I, c-v, d-iv
c) a-ii, b-iii, c-iv, d-i
d) a-iii, b-iv, c-v, d-i








Q5. భారత సుప్రీం కోర్టు పర్యావరణంనకు రాజ్యాంగ భాష్యం చెప్పిన కింది వివరణలను పరిశీలించండి.
a: ‘నిరపేక్ష బాధ్యత’ సూత్రం ఓలియమ్ లీకేజి వాజ్యంలో చెప్పబడింది.
b: ‘సుస్ధిరమైన అభివృద్ధి’ భావన రూరల్ లిటిగేషన్ అండ్ ఎంటైటిల్‌మెంట్ కేంద్ర, దెహ్రడూన్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్ వాజ్యంలో ప్రవేశపెట్టబడింది.
c: ‘కాలుష్యకారుడు భరించాలి’ సూత్రంను ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరో లీగల్ యాక్షన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా వాజ్యంలో ఆమోదింపబడింది.
d: చలనచిత్ర ప్రదర్శన శాలలో పర్యావరణం పై ఉచితంగా స్లై యిడ్లను ప్రదర్శించాలని ఎమ్. సి. మెహత Vs యూనియన్ ఆఫ్ ఇండియా 1991 వాజ్యంలో ఉత్తర్వు ఇవ్వబడింది.
సరియైన జవాబును ఎంపిక చేయుము:
a) a, b మరియు c మాత్రము
b) b మరియు d మాత్రమే
c) a మరియు c మాత్రమే
d) a, b, c మరియు d








Q6. తేనెటీగల పెంపకమును ఇట్లు పిలుచుదురు ?
a) సెరికల్చర్
b) అపీకల్చర్
c) ఫ్లోరీకల్చర్
d) పైవానిలో ఏదీకాదు








Q7. వీనిని భద్రపరుచు ప్రక్రియ ప్యాశ్చరైజేషన్ ?
a) గ్రుడ్డు
b) మాంసము
c) పాలు
d) పండ్లు








Q8. BCG టీకా/మందును దీని కొరకు ఉపయోగింతురు ?
a) క్షయవ్యాధి నుండి రక్షించుటకు
b) ధనుర్వాతము నుండి రక్షించుటకు
c) దగ్గు నుండి రక్షించుటకు
d) టైఫాయిడ్ నుండి రక్షించుటకు








Q9. అన్ని సమయములలో అతిపెద్ద జంతువు ?
a) ఇండియన్ ఏనుగు
b) నీలి తిమింగలము
c) నీటి గుఱ్రము
d) జిరాఫి








Q10. త్రుప్పు పట్టిన పదార్థముల తాకిడి వలన కలుగు వ్యాధి ?
a) చర్మ వ్యాధి
b) జలుబు
c) ఫ్లూ
d) ధనుర్వాతము









Answers:




  1. జవాబు: a
  2. జవాబు: a
  3. జవాబు: d
  4. జవాబు: a
  5. జవాబు: d
  6. జవాబు: b
  7. జవాబు: c
  8. జవాబు: a
  9. జవాబు: b
  10. జవాబు: d


No comments