Breaking News

డెయిలీ క్విజ్ 100: అరిథమెటిక్స్

daily-quiz-in-telugu-quantitative-aptitude-100-telugumaterial.in

Q1. ఒక బాలుడు అతని నలుగురు మిత్రులకు 1/3 : 1/4 : 1/5 : 1/6 నిష్పత్తిలో చాక్లెట్లను పంచాడు. ఈ విభజన చేయగలగడానికి ఆ బాలుడి వద్ద ఉండవలసిన చాక్లెట్ల కనీస సంఖ్య
a) 60
b) 114
c) 57
d) 54



Q2. ఒక వ్యక్తి తన ఆస్తిలో పెద్దకుమారుడికి 2/5వ వంతు మరియు చిన్నకుమారుడికి30% ఇచ్చాడు. మిగిలిన ఆస్తిని అతని ముగ్గురు కుమార్తెలకు 3 : 5 : 2 నిష్పత్తిలో పంచి ఇచ్చాడు. అతని కుమారులలో ఒకరు రెండవవానికంటే రూ. 20,000 ఎక్కువ పొందితే, కుమార్తెల వాటాలలో అత్యధిక వాటా
a) రూ. 18,000
b) రూ. 22,000
c) రూ. 24,000
d) రూ. 30,000


Q3. రెండు సైకిళ్ళ ప్రస్తుత ధరల నిష్పత్తి 2 : 3 రెండు సంవత్సరముల తరువాత, మొదటి సైకిలు ధర 15 పెరిగి, రెండవ సైకిలు ధర రూ. 475 పెరిగితే, వాటి ధరల నిష్పత్తి 3 : 5. మొదటి సైకిలు ప్రస్తుత ధర రూ. లలో
a) 1090
b) 1120
c) 1140
d) 1280


Q4. ఒక నిర్దిష్ట సొమ్ముపై సంవత్సరానికి 10% చొప్పున, 2 సంవత్సరాలకు వచ్చే వార్షిక చక్రవడ్డీకి మరియు మూడు సంవత్సరాలకు వచ్చే బారువడ్డీకి గల భేదం రూ. 1080 అయితే, ఆ సొమ్ము (రూపాయలలో)
a) 10,260
b) 10,800
c) 11,400
d) 12,000


Q5. ఒక వ్యక్తి కొంత సొమ్మును బారువడ్డీకి రుణంగా తీసుకున్నాడు మరియు అతడు చెల్లించిన వడ్డీ, అసలులో 4/9వ వంతు. వడ్డీరేటు మరియు కాల వ్యవధుల పరిమాణములు సమానమయితే, వార్షిక వడ్డీరేటు
a) 6 2/3%
b) 8 1/3%
c) 12 1/2%
d) 16 2/3%



Q6. ఒక వ్యక్తి కొంత సొమ్మును 3 సంవత్సరాల కాలమునకు ఒక నిర్దిష్ట రేటుతో బారువడ్డీకి రుణంగా తీసుకున్నాడు. అతను ఈ సొమ్మును 2% ఎక్కువ రేటుకి తీసుకొని ఉంటే, అతను రూ. 720 ఎక్కువ చెల్లించవలసి వచ్చేది. అయితే అతడు రుణంగా తీసుకున్న సొమ్ము (రూ.లలో)
a) 12.000
b) 10,800
c) 9,600
d) 6,000


Q7. ఒక వడ్డీ వ్యాపారి నుండి సునీల్ సంవత్సరానికి 20% చక్రవడ్డీతో రూ. 25,000 రుణంగా తీసుకున్నాడు. ప్రతి సంవత్సరాంతంలో అతను రూ. 5,000 తిరిగి చెల్లించాడు. అలాంటి వాయిదాలను మూడింటిని చెల్లించిన తరువాత అతను వడ్డీవ్యాపారికి ఇంకనూ చెల్లించవలసిన మొత్తం (రూ.లలో)
a) 25,000
b) 22,500
c) 21,600
d) 20,000



Q8. మొదటి మూడువందల సహజ సంఖ్యలను టైప్ చేయడానికి, ఒక టైప్ రైటర్‌లోని సంఖ్యా-కీ బటన్లను నొక్కవలసిన పర్యాయముల సంఖ్య
a) 792
b) 684
c) 762
d) 300


Q9. 6 సెం.మీ. వ్యాసం కలిగిన ఒక డొల్ల (hollow) గా ఉన్న స్తూపంలో కొంత భాగం నీటితో నింపబడి ఉంది. 3 సెం.మీ. వ్యాసంగా గలిగిన ఒక గోళాన్ని నెమ్మదిగా ఆ స్తూపంలోనికి జారవిడిచినారు. ఆ గోళం స్తూపంలోని నీటిలో పూర్తిగా మునిగినప్పుడు స్తూపంలోని నీటి మట్టంలో వచ్చే పెరుగుదల
a) 3 సెం.మీ
b) 2 సెం.మీ
c) 4 సెం.మీ
d) 1/2 సెం.మీ


Q10. డొల్ల (hollow)గా ఉన్న ఒక లోహపు రోలర్ యొక్క పొడవు 63 సెం.మీ., దాని చుట్టుకొలత 440 సెం.మీ. మరియు మందము 4 సెం.మీ. దాని తయారీకి ఉపయోగించిన లోహపు ఘనపరిమాణం (ఘన సెం.మీ.లలో)
a) 116740
b) 108412
c) 107712
d) 105692





Answers:

  1. జవాబు: c
  2. జవాబు: d
  3. జవాబు: c
  4. జవాబు: d
  5. జవాబు: a
  6. జవాబు: a
  7. జవాబు: a
  8. జవాబు: a
  9. జవాబు: d
  10. జవాబు: c

No comments