Breaking News

ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఆగష్టు 20, 2019

important current affairs in telugu 20 august 2019

  • నేడు ఆగష్టు 20: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి. 


జాతీయం:
  • సీఏపీఎఫ్ రిటైర్మెంట్ ను 60 కి పెంపు: అన్ని రకాల కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లుగా నిర్ణయిస్తూ కేంద్రం అదేశాలు జారీ చేసింది. 
    • ఈ బలగాల్లో కానిస్టేబుల్ నుంచి కమాండెంట్ (సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సమాన హోదా) స్థాయి వరకు ఉన్న నాలుగు కేంద్ర బలగాల అధికారులు (సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్, సహస్ర సీమా బల్) ఇకపై 57 ఏళ్లకు బదులుగా 60 ఏళ్లకు పదవీ విరమణ చేయనున్నారు. 


అవార్డులు: 
  • సరస్వతీ సమ్మాన్ పురస్కారం గెలుచుకున్న వడ్డెపల్లి కృష్ణ: 
    • సిరిసిల్లకు చెందిన సినీ పాటల రచయిత, దర్శకుడు డాక్టర్ వడ్డెపల్లి కృష్ణకు ప్రతిష్టాత్మకమైన సరస్వతీ సమ్మాన్ పురస్కారం లభించింది. 
    • వడ్డెపల్లి కృష్ణ సాహిత్య రంగంలో అందిస్తున్న సేవలకుగాను ఈ పురస్కారం లభించింది. 
    • ఈ అవార్డును గత 54 సంవత్సరాలుగా ఏటా భారతీయ భాషల్లో నిష్ణాతులైన సాహితీవేత్తలకు భోపాల్‌కు చెందిన అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్ అందిస్తుంది. 

  • సుధీర్ జలగంకు ‘హింద్ రతన్’ అవార్డు: 
    • ప్రవాస భారతీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘హింద్ రతన్’ అవార్డును 2018 సంవత్సరానికిగాను సుధీర్ జలగంకు ఎన్‌ఆర్‌ఐ వెల్ఫేర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 
    • వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగే 39వ ఎన్‌ఆర్ఐ కాంగ్రెస్‌లో సుధీర్ ఈ అవార్డు అందుకోనున్నారు. 



వార్తల్లో నిలిచిన వ్యక్తులు: 

  • రాజ్యసభకు ఎన్నికైన మన్మోహన్ సింగ్: 
    • మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
    • రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మదన్‌లాల్ సైనీ మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 
    • ఈ ఎన్నికకు బీజేపీ దూరంగా ఉంది.


  • బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా (82) కన్నుమూశారు. 
    • ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగాను, కేంద్రమంత్రిగా కూడా పనిచేసారు. 


  • బాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు, పద్మభూషణ్ గ్రహీత మొహమ్మద్ జహుర్ ఖయ్యూం హష్మి (93) కన్నుమూశారు. 
    • లుథియానా నుంచి 17 ఏళ్లకే ఖయ్యూం సంగీత ప్రయాణం మొదలైంది. 
    • ‘ఉమ్రాన్ జాన్’ సినిమాకు అందించిన సంగీతానికిగానూ ఆయనకు జాతీయ అవార్డు లభించింది. 
    • కభీకభీ, ఉమ్రాన్ జాన్ సినిమాలకు ఫిలింఫేర్ అవార్డులు కూడా దక్కాయి. 
    • ఆయనకు 2007లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. 
    • 2011లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. 


తెలంగాణ

  • మైనారిటీ కమిటీ సభ్యులుగా రంజిత్ రెడ్డి, సంజయ్ నియామకం: 
    • తెలంగాణ రాష్ట్ర స్థాయి మైనారిటీ సంక్షేమ కమిటీ సభ్యులుగా టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ నియమితులయ్యారు. 
    • ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఉత్తర్వులిచ్చారు. 
    • పీఎం జనవికాస్ పథకం కింద మైనారిటీల సంక్షేమానికి ఉద్దేశించిన 15 పాయింట్ల కార్యక్రమం అమలును వీరు పర్యవేక్షించనున్నారు.


No comments